ప్రాణహిత పుష్కరాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రాణహిత నది

ప్రాణహిత పుష్కరాలు - 2022 చైత్ర శుద్ధ ద్వాదశి అనగా 2022 ఏప్రిల్ 13న బృహస్పతి తన స్వక్షేత్రమైన మీనంలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ క్రమంలో అదేరోజు ప్రాణహిత పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. నాటి నుంచి పన్నెండు రోజులు చైత్ర శుద్ధ అష్టమి అనగా 2022 ఏప్రిల్‌ 24 వరకు కొనసాగుతాయి.[1]

గోదావరి ఉపనదుల్లో ప్రాణహిత ప్రముఖమైనది. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో పెన్‌గంగ, వార్ధా నదులు సంగమించి ప్రాణహితగా ప్రవహిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో తుమ్మిడిహట్టి నుంచి ప్రాణహిత ప్రస్థానం మొదలవుతుంది. దాదాపు 113 కిలోమీటర్లు ప్రవహించి కాళేశ్వరం దగ్గర గోదావరిలో కలుస్తుంది. ఇక్కడే అంతర్వాహినిగా సరస్వతీనది కలుస్తుండటంతో కాళేశ్వరాన్ని త్రివేణి సంగమ క్షేత్రంగా చెబుతారు.[2]

తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్దు గడ్చిరోలి, జయశంకర్‌ భూపాలపల్లి, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో ఈ పుష్కరాలు జరగనున్నాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని త్రివేణి సంగమంతో పాటు మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట, వేమనపల్లిలో పుష్కర ఏర్పాట్లు చేసారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ వద్ద, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని తుమ్మిడిహట్టి వద్ద కూడా పుష్కర ఘాట్లను ఏర్పాటు చేశారు.[3]

ఇవీ చదవండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. telugu, NT News (2022-04-11). "పుష్కర కృతం ప్రాణహితం ఈ నెల 13 నుంచి 24 వరకు ప్రాణహిత పుష్కరాలు". Namasthe Telangana. Retrieved 2022-04-12.
  2. "ప్రాణహితకు పుష్కర కళ". EENADU. Retrieved 2022-04-12.
  3. "ప్రాణహిత పుష్కరాలకు వేళాయె." Sakshi. 2022-04-11. Retrieved 2022-04-12.

వెలుపలి లంకెలు[మార్చు]