Jump to content

ప్రియా లాల్

వికీపీడియా నుండి
ప్రియా లాల్
జననం
ప్రియాంక లాలాజీ

(1993-08-01) 1993 ఆగస్టు 1 (వయసు 31)[1]
జాతీయతబ్రిటిష్
ఇతర పేర్లుప్రియ
వృత్తినటి
స్పోర్ట్స్ ప్రెజెంటర్
క్రియాశీల సంవత్సరాలు2010–ప్రస్తుతం

ప్రియాంక లాలాజీ (జననం 1993 ఆగస్టు 1) ప్రియా లాల్ అని పిలవబడే ఒక బ్రిటిష్ నటి. ఆమె ప్రధానంగా మలయాళ చిత్రాలలో నటిస్తుంది.[2] ఆమె 2010లో మోహన్‌లాల్, సురేష్ గోపిలతో ఎన్. ఆర్. సంజీవ్ దర్శకత్వం వహించిన జనకన్‌తో సినీ రంగ ప్రవేశం చేసింది.[3] ఆమె తమిళం, తెలుగు చిత్రసీమల్లోనూ పనిచేసింది.

ప్రారంభ జీవితం

[మార్చు]

ప్రియా లాల్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని రస్ అల్ ఖైమాలో క్రైస్తవ కుటుంబంలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు లాలాజీ, బీనా కేరళకు చెందినవారు. ఆమెకు దీపక్ లాలాజీ అన్నయ్య ఉన్నాడు. ప్రియా చిన్నపిల్లగా ఉన్నప్పుడు, ఆమె కుటుంబం యునైటెడ్ కింగ్‌డమ్‌కు, ఇంగ్లాండ్‌లోని లివర్‌పూల్‌కు వలస వెళ్ళింది.

కెరీర్

[మార్చు]

ప్రియా లాల్ నటించిన మొదటిచిత్రం జనకన్‌ (2011) తో కమర్షియల్‌గా విజయం సాధించింది. ఆమె తర్వాత మలయాళ చిత్ర పరిశ్రమలో కిల్లాడి రామన్ (2011), లార్డ్ లివింగ్‌స్టోన్ 7000 కంది (2015) లతో సహా మరో రెండు సినిమాలు చేసింది.[4]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

సినిమా

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష నోట్స్
2010 జనకన్ సీత/అను మలయాళం తొలి సినిమా
2011 కిల్లాడి రామన్ రాధిక మలయాళం
2015 లార్డ్ లివింగ్‌స్టోన్ 7000 కండి మీంకన్ని మలయాళం
2018 జీనియస్ జాస్మిన్ తమిళం
2019 లాట్స్ ఆఫ్ లవ్ (LOL) నాగలక్ష్మి (తెలుగు) తెలుగు MX ప్లేయర్ కోసం వెబ్ సిరీస్
హరిణి (తమిళం) తమిళం
2020 గువ్వ గోరింక శిరీష తెలుగు అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది
2023 జెంటిల్మేన్ 2 తమిళం

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం టైటిల్ పాత్ర ఛానల్
2016 కామెడీ సూపర్ నైట్ 2 హోస్ట్ ఫ్లవర్స్ టీవీ
2019 ఛాంపియన్స్ బోట్ లీగ్ (CBL) స్పోర్ట్స్ ప్రెజెంటర్ స్టార్ స్పోర్ట్స్
2019-2020 ఇండియన్ సూపర్ లీగ్ (ISL) స్పోర్ట్స్ ప్రెజెంటర్ స్టార్ స్పోర్ట్స్

మూలాలు

[మార్చు]
  1. "Priyaa Lal". Times of India. 14 April 2022.
  2. "From Liverpool to Kochi". The Times of India. 14 January 2017. Retrieved 20 June 2018.
  3. Sreekumar, Priya (18 June 2016). "Rumours of romance not true: Priyaa Lal". Deccan Chronicle. Retrieved 20 June 2018.
  4. Adivi, Sridhar (30 October 2017). "Liverpool girl Priyaa Lal to foray into Telugu cinema". The Times of India. Retrieved 20 June 2018.