ప్రీతి అమీన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రీతి అమీన్
జననం
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలుప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ఝూమే జీయా రే, చక్రవాకం,నాన్న, దిల్ మిల్ గయే
తల్లిదండ్రులు
  • నీతా అమీన్ (తల్లి)

ప్రీతి అమీన్ భారతీయ టెలివిజన్ నటి. ఇండియాస్ బెస్ట్ సినీస్టర్స్ కి ఖోజ్ రియాలిటీ షోలో పాల్గొన్నది.[1]

జీవిత విషయాలు

[మార్చు]

ప్రీతి అమిన్ హైదరాబాదులో జన్మించింది. తల్లిపేరు నీతా అమీన్. ప్రీతి కుటుంబం మహారాష్ట్రలోని ముంబైలో నివసిస్తోంది. హైదరాబాదులోని సెయింట్ ఆండ్రూస్ హైస్కూల్ లో పాఠశాల విద్యను పూర్తిచేసిన ప్రీతి, సికింద్రాబాదులోని కస్తూర్బా గాంధీ మహిళా కళాశాలలో, హైదరాబాదులోని సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాలలో గ్రాడ్యుయేషన్ చేసింది. 2014లో అమెరికన్ మానసిక వైద్యుడు లియోనెల్ పెరీరాను వివాహం చేసుకుంది.[2]

టివిరంగం

[మార్చు]

హిందీ టెలివిజన్‌లో ఝూమ్ జియా రేతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. దిల్ మిల్ గయే, భాస్కర్ భారతి, కసమ్ సే, సిఐడి - అహత్ (సీజన్ 4) క్రాస్ఓవర్ ఎపిసోడ్, లాపటగంజ్, సూపర్ కాప్స్ వర్సెస్ సూపర్ విలైనీస్, మిస్సెస్ కౌశిక్ కి పాంచ్ బాహుయిన్, దిల్ కి నజర్ ఖుబ్ సూరత్ లలో కూడా నటించింది.[3] 2003లో తెలుగు సీరియల్ చక్రవాకంలో కూడా నటించింది. టివిరంగంలోకి రావడానికి ముందు అమిన్ నాటకాల్లో, ప్రచార చిత్రాల్లో నటించింది.

జీ టీవీ రాజస్థాన్ కార్యక్రమం నాచ్ లే బిందాని (డాన్స్ ఇండియా డాన్స్ సూపర్ మామ్స్) కి ప్రీతి అమిన్ న్యాయనిర్ణేతగా వ్యవహరించింది.[4]

నటించినవి

[మార్చు]
  • చక్రవాకం (జెమిని టివి)
  • అలౌకిక (ఈటివి)
  • నాన్న (జెమిని టివి)
  • ఇండియాస్ బెస్ట్ సినీస్టర్స్ కి ఖోజ్
  • ఝూమే జియా రే
  • దిల్ మిల్ గయే
  • భాస్కర్ భర్తి
  • కాసమ్ సే
  • సి.ఐ.డి. - ఆహత్
  • లాపటగని
  • సూపర్ క్రాప్స్ వర్సెస్ సూపర్ విలైనీస్
  • మిస్సెస్ కౌశిక్ కి పాంచ్ బాహుయిన్
  • దిల్ కి నజర్ ఖుబ్ సూరత్

మూలాలు

[మార్చు]
  1. "India's Best Cinestars Ki Khoj: Will It Work This Time?". Business Insider. 5 July 2014. Retrieved 22 June 2020.
  2. "Preeti Amin has a church wedding". The Times of India. 29 October 2014. Retrieved 22 June 2020.
  3. "Will not join `Lapataganj 2`, says Preeti Amin". Zee News. 20 May 2013. Archived from the original on 27 జూన్ 2020. Retrieved 22 June 2020.
  4. "Preeti Amin & Arvind Kumar to judge a TV show". The Times of India. 27 February 2014. Retrieved 22 June 2020.

ఇతర లంకెలు

[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ప్రీతి అమీన్ పేజీ