ప్రేమ ప్రయాణం
| ప్రేమ ప్రయాణం (1996 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | ముత్యాల సుబ్బయ్య |
|---|---|
| నిర్మాణం | బొప్పన కోటేశ్వరరావు |
| తారాగణం | వినోద్ కుమార్, సౌందర్య |
| సంగీతం | రాజ్ |
| నిర్మాణ సంస్థ | వసంత ఆర్ట్స్ |
| విడుదల తేదీ | 1996 జులై 26 |
| నిడివి | 149 ని. |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
ప్రేమ ప్రయాణం 1996 జూలై 26న విడుదలైన తెలుగు సినిమా. వసంత ఆర్ట్స్ పతాకం కింద బొప్పన కోటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో వినోద్ కుమార్, సౌందర్యలు ప్రధాన తారాగణంగా నటించగా రాజ్ సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- వినోద్ కుమార్
- శ్రీకాంత్
- సౌందర్య
- అలీ
- కైకాల సత్యనారాయణ
- నూతన్ ప్రసాద్
- సుత్తి వేలు
- బ్రహ్మానందం
- ఏవీఎస్
- చలపతిరావు
- నర్రా
- ఐరన్ లెగ్ శాస్త్రి
సాంకేతిక వర్గం
[మార్చు]- కథ & మాటలు: ఆకెళ్ళ
- స్క్రీన్ ప్లే & దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య
- నిర్మాత: బొప్పన కోటేశ్వరరావు
- ఎడిటింగ్: కోలా భాస్కర్
- సంగీతం: రాజ్
- సమర్పణ: మన్నె విజయలక్ష్మి
- నేపథ్య గానం:ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
- పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, భువనచంద్ర, సాయి శ్రీహర్ష
కథాంశం
[మార్చు]భర్త చనిపోయాడనుకుని తిరిగి పెళ్లి చేసుకున్నాక మళ్ళీ అతను తిరిగివస్తే ఒక స్త్రీ పడే వ్యధను మూలకథగా తీసుకుని చిత్రీకరించినదే ఈ సినిమా. సుధ (సౌందర్య) ఒక అనాధ. ఆమె, సంజయ్ (శ్రీకాంత్) కాలేజిలో కలిసి, ప్రేమించుకున్నారు. సుధ ఎవరోకాదు, తన మరదలే అన్న విషయం సంజయ్ తండ్రి నానాజీ (సత్యనారాయణ) ద్వారా తెలుస్తుంది. ఆయనే దగ్గరుండి వీళ్ళ పెళ్లి జరిపిస్తాడు.
అయితే ఒక కేసులో సంజయ్‌కి మూడేళ్ళ శిక్షపడి అతన్ని జైలుకి తీసుకు వెళుతున్న వాహనం పేలిపోతుంది. కొంతకాలం తర్వాత సుధ పనిచేస్తున్న బ్యాంక్ లోని మేనేజర్ రాజేష్ (వినోద్ కుమార్) సుధను ప్రేమిస్తున్నాడన్న విషయం తెలుసుకున్న నానాజీ దగ్గరుండి వాళ్ళ పెళ్లి జరిపిస్తాడు. అయితే చనిపోయాడనుకున్న సంజయ్ తిరిగి వస్తాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో అతను మరణించడంతో సినిమా ముగుస్తుంది.
దీనితో ఈ సినిమా సమాజంలో ఉన్న మనుషులను ఆకట్టుకుంది.
పాటలు
[మార్చు]- అయ్యబాబోయ్ చుమ్మా...
- చిట్టి పాపలు...
- ఎన్నో వరాలు...
- ఊహలు సైతం...
- పిల్లేమో సుల్తానా...
- వయసా వయసా...
మూలాలు
[మార్చు]- ↑ "Prema Prayanam (1996)". Indiancine.ma. Retrieved 2022-11-30.