Jump to content

పట్టాదారు పాసు పుస్తకాలు

వికీపీడియా నుండి
(ప్రైవేటు భూమి నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసమును వికిపుస్తకములకు తరలించాలని ప్రతిపాదించబడినది. వివరాలకు చర్చా పేజీ చూడండి.


p.సుశీల

పట్టాదారి పాసుపుస్తకంలోని వివరాలు - నమూనా

పట్టాదారు పాసు పుస్తకాలు భూమి యాజమాన్యపు హక్కు పత్రాలు. గ్రామంలో ఎవరెవరికి ఎంతెంత భూమి ఉంది. ఏ సర్వే నంబర్‌లో ఉంది. ఆ వ్యక్తి ఎలా ఉంటాడు అనే వివరాలతో పట్టాదారుల ఫోటోలు అతికించి 1-బి రిజిస్టర్ను తయారు చేసి దానిని బట్టి తహసీల్దారు పట్టాదారు పాసు పుస్తకాలు జారీచేస్తారు. ఈ 1-బి రిజిస్టర్ ను పూర్వం 10 (1) ఖాతాల రిజిస్టర్ అనేవారు. గ్రామంలోని ప్రభుత్వభూమిని మినహాయించి మొత్తం ప్రైవేటు భూమి ఈ పుస్తంలోకి లెక్కలోకి వస్తుంది. వ్యవసాయానికి ఉపయోగించే మొత్తం ప్రైవేటు భూమికి పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలి. తద్వారా బినామీ పట్టాదారులు బట్టబయలు అవుతారు. నిజానికి భూమి ఉండి, నిజాయితీగా పట్టాలు పొంది పంటలు సాగుచేస్తు రుణాలు పొందగోరే రైతులకు నకిలీ పాసుపుస్తకాల తయారీ తలనొప్పిగా మారింది.

నకిలీ పాస్ పుస్తకాలకు కారణాలు

[మార్చు]
  • గ్రామ 1-బి రెవెన్యూ రికార్డుల్లో అసలు పట్టాదారుల స్థానంలో నకిలీ పట్టాదారులను చేర్చటం
  • గ్రామస్థులు, పట్టాదారులు అప్రమత్తంగా లేకపోవటం
  • గ్రామ రెవెన్యూ అధికారి ప్రమేయం
  • మృతి చెందిన పట్టాదారులకు సంబంధించిన పాతపుస్తకాలు, భూములు అమ్ముకొని ఇతరులకు బదలాయించినా పాత పాసుపుస్తకాలను మాత్రమే కొత్త పాసుపుస్తకాల తయారీకోసం ఉపయోగించటం.

పాస్ పుస్తకం జారీకి షరతులు

[మార్చు]
  • భూమి యజమాని బ్రతికి ఉండాలి
  • భూమి అతని స్వాధీన అనుభవంలో ఉండాలి
  • కొనుగోలు చేసిన భూమికి దానికి సంబంధించిన అనుబంధ (లింకు) డాక్యుమెంటు దస్తావేజును కూడా పరిశీలించాలి. తండ్రి తాను కొనుగోలు చేసిన భూమిని తన కొడుకులకు పంపిణీ చేస్తూ కొడుకుల పేరుతో దాన విక్రయం కింద భూ నమోదు (రిజిస్ట్రేషన్‌) చేయించుకున్న పిదప పుస్తకాలు ఇవ్వాలి.
  • పట్టాదారు పాసుపుస్తకం ఫీజు రూ.15

భూమి యాజమాన్యపు వివరాలు (అంతర్జాలంలో)

[మార్చు]

భూమి రికార్డుల వివరాలు గల పట్టాదారుని పహాణి/అడంగలు సర్వేనంబరు ప్రకారం అంతర్జాలంలో "ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పహణి/అడంగలు లింకు". Archived from the original on 2016-11-18. Retrieved 2014-11-18., ROR1-B వివరాలను ఖాతా లేక పట్టాదారు పాసుపుస్తకం సంఖ్య ప్రకారం "ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ROR1-B లింకు". Archived from the original on 2016-03-05. Retrieved 2014-11-18. పరిశీలించవచ్చు.

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]