ఫస్ట్ లాన్సర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఫస్ట్ లాన్సర్ అనేది హైదరాబాద్ బంజారాహిల్స్‌ దిగువన ఉన్న ప్రాంతపు పేరు, నిజాం మిలిటరీ చరిత్రతో చాలా ప్రసిద్ధ ప్రాంతం. వాణిజ్య వ్యాపారాల కోసం స్థానికులలో కూడా ప్రసిద్ధి చెందింది నిజాం 1874లో 300 మంది సైనికులతో ఫస్ట్ లాన్సర్‌ను ఏర్పాటు చేసాడు, సైనికుల కోసం కవాతు మైదానం సృష్టించబడింది. ఇది రద్దీగా ఉండే ప్రాంతం ఫస్ట్ లాన్సర్‌లో హైదరాబాద్‌లోని అతిపెద్ద ఈద్గాలు కూడా ఉన్నాయి, ఈ ప్రాంతంలో అత్యంత ప్రసిద్ధ సూఫీ ఆధ్యాత్మికవేత్త సయ్యద్ అహ్మద్ దర్గా ఉంది,[1] ఇక్కడ ప్రజలు తమ కోరికలను నెరవేర్చుకోవడానికి వస్తారు ఇక్కడ ఉర్సు కూడా నిర్వహిస్తారు.[2] ఇక్కడే విరామ సైనికుల కోసం నివాస సముదాయాలు కూడా ఉన్నాయి.[3] ఫస్ట్ లాన్సర్ ప్రాంతంలోఉన్న ఈద్గా మైదాన్ దేశంలోని అతిపెద్ద ఈద్గాలలో ఒకటిగా చెప్పబడుతుంది,క్రికెటర్ మహ్మద్ సిరాజ్ ఈ మైదానంలో క్రికెట్ ఆడేవాడు.[4] ఇక్కడి కుతుబ్ షాహీ మసీద్ ప్రసిద్ధి చెందింది , ఈ మస్జిద్ తరచుగా ఇస్లామిక్ ఉపన్యాసాలను నిర్వహిస్తుంది. దానికి తోడు మసీదుకు సమీపంలో ఉన్న ప్రాంతంలో భారీ ముస్లిం శ్మశానవాటిక ఉంది.

మూలాలు[మార్చు]

  1. "Tales of a Flying Sufi of Hyderabad's' First Lancer". India Heritage Walks (in ఇంగ్లీష్). Retrieved 2022-12-21.
  2. OH, Team (2018-05-21). "First Lancer, Hyderabad - Online Hyderabad - Mohammed Siraj". Online Hyderabad (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-12-21.
  3. Nanisetti, Serish (2017-10-30). "Living Hyderabad: Men of Speed". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2022-12-21.
  4. "Gully boy Mohammed Siraj lives his dream and makes it big in Australia". India Today (in ఇంగ్లీష్). Retrieved 2022-12-21.