ఫాతిమా జకారియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఫాతిమా జకారియా (1936 ఫిబ్రవరి 17 – 2021 ఏప్రిల్ 6) మొదట ముంబై టైమ్స్ సంపాదకులుగా, తరువాత టైమ్స్ ఆఫ్ ఇండియా ఆదివారం సంచిక సంపాదకులుగా పనిచేసింది. ఆమె తాజ్ హోటల్స్ వారి తాజ్ పత్రికకు సంపాదకులుగా కూడా పనిచేసింది.

కెరీర్

[మార్చు]

1958లో ఆమె ముంబైలో పిల్లల సంరక్షణ సంస్థను స్థాపించింది. ఇది 500 మంది పేద పిల్లలకు విద్య, ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చేది.[1]

1963లో ఫాతిమా, పాత్రికేయ వృత్తిలో చేరి ది ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాలో పిల్లల కాలమిస్ట్‌గా కెరీర్ ప్రారంభించింది. కుష్వంత్ సింగ్ కింద అసిస్టెంట్ ఎడిటర్‌గా పనిచేసింది.[2] 1970 లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో చేరిన ఆమె సండే ఎడిషన్ ఎడిటర్ స్థాయికి ఎదిగింది.[3] ఎడిటరుగా ఆమె, ఇందిరా గాంధీ, మార్గరెట్ థాచర్, జెఆర్‌డి టాటా, జయప్రకాష్ నారాయణ్, అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్ వంటి ప్రముఖులను ఇంటర్వ్యూ చేసింది.[1]

ఫాతిమా తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్‌లో చేరి, ఔరంగాబాద్‌లోని మౌలానా ఆజాద్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ క్యాంపస్‌లో మొదటి తరగతి ఫైవ్ స్టార్ హోటల్ స్థాపనలో పాలుపంచుకుంది. కాఫీ టేబుల్ మ్యాగజైన్ తాజ్‌కి ఎడిటర్ అయింది.[4] ఆమె కార్యాలయం ముంబైలోని తాజ్ మహల్ హోటల్‌లో ఉండేది. ఆ తర్వాత, ఆమె బ్రిటిష్ యూనివర్సిటీ పొత్తుతో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సును ప్రవేశపెట్టింది. ఔరంగాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ బోర్డులో ఆమె సభ్యురాలిగా ఉండేది. ఔరంగాబాద్‌లోని మౌలానా ఆజాద్ ఎడ్యుకేషనల్ సొసైటీకి (MAES) అధ్యక్షురాలు గాను, మౌలానా ఆజాద్ ఎడ్యుకేషనల్ ట్రస్టుకు (MAET) చైర్మన్‌ గానూ ఉండేది.[1] మౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ సొసైటీ (ఎంఏఈఎస్) అధ్యక్షురాలిగా, ఔరంగాబాద్లోని మౌలానా ఆజాద్ విద్యా ట్రస్ట్ (ఎంఏఈటీ) చైర్మన్‌గా పనిచేసింది.

1983 లో పాత్రికేయ వృత్తిలో చేసిన కృషికి గాను ఆమె సరోజినీ నాయుడు ఇంటిగ్రేషన్ అవార్డును అందుకుంది.[5] 2006 లో భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది. విద్యారంగంలో ఆమె చేసిన విస్తృత కృషికి గాను రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకుంది.[6]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఫాతిమా, భారతీయ రాజకీయవేత్త, ఇస్లామిక్ మత గురువూ అయిన రఫీక్ జకారియాకు రెండవ భార్య.[7] అతని ఇద్దరి పిల్లలకు ఆమె సవతి తల్లి. పెద్ద కుమారుడు, తస్నీమ్ జకారియా మెహతా, ముంబైలో నివసిస్తున్న కళా చరిత్రకారుడు, రచయిత కాగా, మరో కుమారుడు మన్సూర్ జకారియా, సిలికాన్ వ్యాలీలో వ్యవస్థాపకుడు, ఇప్పుడు సంపద నిర్వహణ సంస్థలో భాగస్వామి.

ఆమెకు ఇద్దరు కన్నకొడుకులున్నారు. వారిలో పెద్ద కుమారుడైన అర్షద్ జకారియా,[8] హెడ్జ్ ఫండ్‌ను నడుపుతుండగా, చిన్న కుమారుడు ఫరీద్ జకారియా రాజకీయ వ్యాఖ్యాత, పాత్రికేయుడు. అతను అమెరికా లోని సిఎన్ఎన్ లో జిపిఎస్ వ్యాఖ్యాతగా పనిచేస్తున్నాడు.

మరణం

[మార్చు]

ఫాతిమా జకారియా 2021 ఏప్రిల్ 6 న ఔరంగాబాద్‌లోని కమల్‌నయన్ బజాజ్ హాస్పిటల్‌లో కోవిడ్-19 తో మరణించింది.[9]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "Noted educationist, journalist Padmashri Fatma Zakaria passes away - www.lokmattimes.com". Lokmat English (in ఇంగ్లీష్). 2021-04-06. Retrieved 2024-01-13.
  2. "Former editor Fatma Zakaria dies at 85". The Indian Express (in ఇంగ్లీష్). 2021-04-07. Retrieved 2024-01-13.
  3. "Siblings-Arshad and Fareed Zakaria". www.the-south-asian.com (in ఇంగ్లీష్). Retrieved 2024-01-13.
  4. "The new Taj". Arlington, VA: Tata Sons Ltd. 12 November 2001. Archived from the original on 16 July 2011. Retrieved 2011-02-14.
  5. "Veteran Journalist, Fareed Zakaria's Mother, Padma Shri Fatima Zakaria Dies Aged 85". Al Haqeeqa (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-04-12. Retrieved 2024-01-13.
  6. "Padma Awards Directory (1954-2009)" (PDF). Ministry of Home Affairs. Archived from the original (PDF) on 2013-05-10.
  7. "Dr. Rafiq Zakaria remembered". TwoCircles.net (in అమెరికన్ ఇంగ్లీష్). 2010-07-16. Retrieved 2024-01-13.
  8. "rediff.com: Arshad Zakaria appointed Merrill Lynch co-president". www.rediff.com (in ఇంగ్లీష్). Retrieved 2024-01-13.
  9. Desk (2021-04-06). "Veteran Journalist, Fareed Zakaria's Mother, Padma Shri Fatima Zakaria Dies Aged 85". The Cognate (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2024-01-13.