ఫరీద్ జకారియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫరీద్ జకారియా
2012లో ఫరీద్ జకారియా
జననం
ఫరీద్ రఫిక్ జకారియా

(1964-01-20) 1964 జనవరి 20 (వయసు 60)
విద్యబ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (యేల్ యూనివర్సిటీ)
మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (హార్వర్డ్ యూనివర్సిటీ),
డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ
వృత్తి
  • జర్నలిస్ట్
  • రచయిత
  • రాజకీయ వ్యాఖ్యాత
ఉద్యోగంసిఎన్ఎన్ (CNN)
Notable credit(s)
ఫరీద్ జకారియా జిపిఎస్, హోస్ట్ (2008–ప్రస్తుతం)
టైమ్ మ్యాగజైన్ సంపాదకుడు (2010–2014)
న్యూస్‌వీక్ ఇంటర్నేషనల్, సంపాదకుడు(2000–2010)
ఫారిన్ ఎక్స్ఛేంజ్ (యూఎస్ టీవి సిరీస్), హోస్ట్ (2005–2007)
ఫారిన్ ఎఫ్ఫైర్స్, మాజీ మేనేజింగ్ ఎడిటర్
జీవిత భాగస్వామి
పౌలా థ్రోక్‌మోర్టన్‌
(m. 1997; div. 2018)
పిల్లలు3
తల్లిదండ్రులురఫీక్ జకారియా (తండ్రి)
ఫాతిమా జకారియా (తల్లి)
బంధువులుఅరిఫ్ జకారియా (కజిన్)
ఆసిఫ్ జకారియా (కజిన్)
పురస్కారాలుపద్మభూషణ్ పురస్కారం (2010)[1]

ఫరీద్ రఫీక్ జకారియా (జననం 1964 జనవరి 20) భారతీయ అమెరికన్ పాత్రికేయుడు, రాజకీయ వ్యాఖ్యాత, రచయిత. ఆయన సిఎన్ఎన్ టెలివిజన్ ప్రసారం చేస్తున్న ఫరీద్ జకారియా జీపిఎస్ కార్యక్రమానికి హోస్ట్, అత్యంత ప్రజాదరణ పొందిన ది వాషింగ్టన్ పోస్ట్ ఆంగ్ల పత్రికకు కాలమిస్టు.[2] అంతేకాకుండా, ఆయన న్యూస్‌వీక్ అనే అమెరికన్ వీక్లీ న్యూస్ మ్యాగజైన్ కాలమిస్ట్‌గా, న్యూస్‌వీక్ ఇంటర్నేషనల్ ఎడిటర్‌గా, టైమ్‌ పత్రికకు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నాడు.[3]

జనవరి 2010లో, జర్నలిజం రంగానికి చేసిన కృషికి గానూ పద్మభూషణ్ పురస్కారంతో ఆయనను భారత ప్రభుత్వంసత్కరించింది.[4]

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

ఫరీద్ జకారియా ముంబైలో కొంకణి ముస్లిం కుటుంబంలో జన్మించాడు.[5][6] ఆయన తండ్రి, రఫీక్ జకారియా (1920-2005), ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌తో సంబంధం ఉన్న రాజకీయ నాయకుడు, ఇస్లామిక్ వేదాంతవేత్త. ఆయన తల్లి ఫాతిమా జకారియా (1936–2021), అతని తండ్రి రెండవ భార్య, ఆమె కొంతకాలం సండే టైమ్స్ ఆఫ్ ఇండియా సంపాదకురాలు.[7]

ఫరీద్ జకారియా ముంబైలోని కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్‌లో చదివాడు. ఆయన 1986లో యేల్ యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్‌తో పట్టభద్రుడయ్యాడు, అక్కడ అతను యేల్ పొలిటికల్ యూనియన్ అధ్యక్షుడిగా, యేల్ పొలిటికల్ మంత్లీకి ఎడిటర్ ఇన్ చీఫ్, స్క్రోల్ అండ్ కీ సొసైటీ సభ్యుడు, పార్టీ ఆఫ్ ది రైట్ సభ్యుడు. ఆ తరువాత, ఆయన 1993లో హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి పొందాడు.[8]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆయన యునైటెడ్ స్టేట్స్ పౌరసత్వం కలిగి ఉన్నాడు.[9] 1997లో, ఆయన ఆభరణాల డిజైనర్ అయిన పౌలా థ్రోక్‌మోర్టన్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. జూలై 2018లో, అతని భార్య విడాకుల కోసం దరఖాస్తు చేసింది.[10] ఆయన న్యూయార్క్ నగరంలోని అప్పర్ వెస్ట్ సైడ్‌లో నివసిస్తున్నాడు.[11]

మూలాలు

[మార్చు]
  1. "Padma award recipients Zakaria, Parikh say they are humbled". The Indian Express. 2010-01-26. Retrieved 2014-03-14.
  2. "Fareed Zakaria". The Washington Post.
  3. "Fareed Zakaria's Website". Archived from the original on 25 August 2010. Retrieved 10 May 2010.
  4. "List of Padma awardees". IBNLive. 3 February 2010. Archived from the original on 31 January 2010. Retrieved 2010-10-01.
  5. Press, Joy (9 August 2005). "The Interpreter". The Village Voice. Village Voice, LLC. Retrieved 10 May 2010.
  6. "DNA test uncovers Fareed Zakaria's roots". CNN. Retrieved 1 June 2018.
  7. "Fareed Zakaria: A second lockdown in India is 'impossible'" (in ఇంగ్లీష్). CNN. 4 May 2021. Retrieved 4 May 2021.
  8. "Harvard Graduate School Honors Daniel Aaron, Nancy Hopkins, and Others". Harvard Magazine. 23 May 2012. Retrieved 2012-05-29.
  9. Zakaria, Fareed (15 July 2001). "America Doesn't Need Crusades". Newsweek. Retrieved 17 July 2017.
  10. Light, Mikey; Greene, Leonard (24 July 2018). "Wife of CNN 'GPS' host Fareed Zakaria suing for divorce after 21 years of marriage". Chicago Tribune.
  11. Darrah, Paige (February 15, 2019). "How Fareed Zakaria, CNN Host, Spends His Sundays". The New York Times. Archived from the original on March 14, 2019.