Jump to content

ఫాతిమా షేక్

వికీపీడియా నుండి
ఫాతిమా షేక్
జననం(1831-01-09)1831 జనవరి 9 [1]
పూణే, బాంబే ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా
మరణం1900 అక్టోబరు 9(1900-10-09) (వయసు 69)
వృత్తిసంఘ సంస్కర్త, ఉపాధ్యాయురాలు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
భారతదేశపు తొలి ముస్లిం మహిళ ఉపాధ్యాయురాలు
బంధువులుమియాన్ ఉస్మాన్ షేక్ (సోదరుడు)
షాహీన్ బాగ్ ఉద్యమం సమయంలో ఫాతిమా షేక్ సావిత్రిబాయి ఫూలే తాత్కాలిక లైబ్రరీ

ఫాతిమా షేక్ (జననం 1831 జనవరి 9) భారతీయ విద్యావేత్త, సంఘ సంస్కర్త. ఆమె సంఘ సంస్కర్తలైన జ్యోతీరావ్ ఫూలే, సావిత్రీబాయి ఫూలే లతో కలసి పనిచేసారు. [2] [3] ఆమె భారతదేశపు మొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలిగా విస్తృతంగా పరిగణించబడుతుంది.[1]

ఆమె 191వ జయంతి సందర్భంగా 9 జనవరి 2022న, గూగుల్ ప్రత్యేకమైన డూడుల్(doodle)తో సన్మానించింది.[4]

జీవిత చరిత్ర

[మార్చు]

ఫాతిమా షేక్ మియాన్ ఉస్మాన్ షేక్ సోదరి. సామాజిక సేవల విషయంలో సొంత తండ్రే జ్యోతీరావ్ ఫూలేను ఇంటి నుంచి బయటకు పంపించినప్పుడు.. మియాన్ ఉస్మాన్ షేక్ ఆశ్రయమిచ్చారు.[5] వారి ఇంట్లో జ్యోతీరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే నివాసం ఉండేవారు. ఆధునిక భారతదేశంలోని మొట్టమొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయుల్లో ఒకరైన ఆమె ఫూలే పాఠశాలలో దళిత పిల్లలకు విద్యను అందించడం ప్రారంభించింది. ఫూలే దంపతులు ఫాతిమా షేక్‌తో కలసి అణగారిన వర్గాలలో విద్యను వ్యాప్తి చేసే బాధ్యతను చేపట్టారు. ముఖ్యంగా బాలికా, స్త్రీ విద్యకు కృషి చేసారు.

సింథియా ఫర్రార్ అనే అమెరికన్ మిషనరీ నిర్వహిస్తున్న ఉపాధ్యాయ శిక్షణా సంస్థలో ఇద్దరూ చేరినప్పుడు ఫాతిమా షేక్, సావిత్రిబాయి ఫూలేను కలిశారు. [6] ఆమె ఫూలే దంపతులు స్థాపించిన ఐదు పాఠశాలల్లో పనిచేసింది. ఆమె అన్ని మతాలు, కులాల పిల్లలకు బోధించింది. 1851లో ముంబాయిలో రెండు పాఠశాలల స్థాపనలో ఫాతిమా షేక్ పాల్గొన్నది [7].

ఉస్మాన్‌ షేక్‌ ఇంట్లో ప్రారంభమైన పాఠశాలకు విద్యార్థుల ఆదరణ పెరగటంతో మరిన్ని పాఠశాలలను చుట్టుపక్కల ప్రాంతాల్లో నెలకొల్పారు. వాటిల్లో సావిత్రీబాయి, ఫాతిమా షేక్‌ ఇద్దరూ కలిసి చదువు చెప్పేవారు. అయితే మహిళలకు చదువులెందుకు అనే ధోరణి ఉన్న సమాజంలో వారిరువురు అనేక అవాంతరాలను ఎదుర్కొన్నారు. అందులోనూ అట్టడుగు వర్గాల ప్రజలు చదువుకోవడానికి వీలులేని దురాచారం ఉరండేది. దీంతో భవిష్యత్‌ తరాల కోసం వాళ్లు అవమానాలను, దాడులను సైతం ఎంతో సహనంతో భరించారు. అమ్మాయి చదువు అవనికి వెలుగు అని చాటిచెప్పారు.

2014లో మహారాష్ట్ర ప్రభుత్వం సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, జాకీర్ హుస్సేన్, అబ్దుల్ కలాం, ఆజాద్ లాంటి వారితో పాటు ఫాతిమా షేక్ సంక్షిప్త పరిచయాన్ని బాల్ భారతి లో పాఠ్యాంశంగా చేర్చింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా 2022లో ఫాతిమా షేక్ పాఠాన్ని 8వ తరగతి పాఠ్యపుస్తకాలలో ప్రవేశపెట్టింది.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Fatima Sheikh's 191st Birthday". Google (in ఇంగ్లీష్). Retrieved 9 January 2022.
  2. Susie J. Tharu; K. Lalita (1991). Women Writing in India: 600 B.C. to the early twentieth century. Feminist Press at CUNY. p. 162. ISBN 978-1-55861-027-9.
  3. Madhu Prasad (2019). "A strategy for exclusion". Elementary Education in India: Policy Shifts, Issues and Challenges. ISBN 9781000586954.
  4. "Fatima Sheikh's 191st Birthday". www.google.com (in ఇంగ్లీష్). Retrieved 2022-01-08.
  5. "ఫాతిమా షేక్: తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి ఫూలేతో కలిసి పనిచేసిన ఈమె ఎవరు?". BBC News తెలుగు. 2020-09-13. Retrieved 2022-01-09.
  6. Grey, Mary (2016). "Opposition to Untouchability: Gandhi and Ambedkar". A Cry for Dignity: Religion, Violence and the Struggle of Dalit Women in India. Taylor & Francis. p. 118. ISBN 9781315478401. Retrieved February 17, 2021.
  7. Tschurenev, Jana (2019). "Civil Society, Government, and Educational Institution-Building, Bombay Presidency, 1819-1882". Empire, Civil Society, and the Beginnings of Colonial Education in India. Cambridge University Press. p. 276. ISBN 9781108656269. Retrieved February 17, 2021.