ఫిలిప్పు వ్రాసిన పత్రిక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఫిలిప్పు వ్రాసిన పత్రిక బైబిల్ కు సంబంధంలేని పత్రిక. మగ్ధలేని మేరి అనే అమ్మాయిని ఏసు క్రీస్తు భార్యగా చెప్పబడిన ఈ పత్రిక ప్రపంచ వ్యాప్తంగా వివాదాస్పదమైనది. ఈ పత్రిక ఏసుక్రీస్తు మరణించిన 200 సంవత్సరాల తర్వాత ఫిలిప్పు అనే వ్యక్తి వ్రాశాడు. ఈ పత్రిక 1945 లో ఉత్తర ఈజిప్టు పట్టణమైన నాగ్ హమ్మడి (Nag Hammadi) లో మహమ్మద్ ఆలీ సమ్మాన్ (Mohamad Ali Samman) అనే వ్యక్తికి ఇతర 11 పుస్తకాలతో సహా దొరికినది.

వివాదాస్పద వచనం[మార్చు]

ఈ పత్రిక లోని 59 వ వచనంగా ఇట్లు వ్రాయబడియుంది.

మరియుకి మేరీ మగ్ధలేని సహచరిగా యుండెను. తన శిష్యులందరిలో ఆమెను ఎక్కువగా ప్రేమించెను, పలుమార్లు ఆమె పై ముద్దు పెట్టుకొనుచూవుండెను. దానికి శిష్యులు విచారము వ్యక్తము చేసెను. ఆమెను మమ్మల్నికంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా? అని వారు అడుగగా క్రీస్తు ఇట్లు చెప్పెను -- నేను మిమ్మలికంటే ఆమెను ఎక్కువగా ప్రేమించుటకు గల కారణమా? గ్రుడ్డివాడును, చూడగలిగిన వాడును కలిసి చీకటిలో ఉన్నప్పుడు, వారిద్దరికీ ఏ భేదమును లేదు. వెలుగు వచ్చినప్పుడు మాత్రము చూడగలిగిన వాడు దాన్ని చూచును, గ్రుడ్డివాడు ఆ చీకటిలోనే మిగిలిపోవును

వాస్తవానికి ఫిలిప్పు పత్రికలో కాలక్రమేణా కొన్ని పదాలు చెరిగిపోయాయి. ఆ పదాలు ఖాళీలుగా ఇవ్వబడ్డాయి. ఖాళీలలో పదాల పూరింపు తత్వవేత్తలకు సాధ్యం కాలేదు.

వాదనలు[మార్చు]

బైబిలును క్షుణ్ణంగా అధ్యయనం చేసిన పండితుల వాదన:

హెబ్రీయులు 13:4 లో 'వివాహం అన్ని విషయములలో ఘనమైనది' అని క్రీసు చెప్పడం జరిగింది. క్రీస్తు మేరీ మగ్ధలేని వివాహం చేసుకుని ఉంటే ఒక్క సందర్భంలోనైనా ఆమెను సమాజానికి తన భార్యగా పరిచయం చేసేవాడు. మగ్ధలేని మరియ నిజంగా క్రీస్తు యొక్క భార్య అయితే శిష్యులు క్రీస్తును మమ్మల్ని కంటే ఆమెని ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అని అడుగరు. ఏసుక్రీస్తు మరియ మగ్ధలేనిని ముద్దు పెట్టుకోవడం శృంగార కార్యంగా చూడలేదు. చూసివుంటే ఏసుక్రీస్తును మమ్మల్ని కంటే ఆమెని ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అని అడుగరు. మగ్ధలేని మరియ నిజంగా క్రీస్తు యొక్క భార్య అయితే ఏసుక్రీస్తు ఆమె పెదాలపై ముద్దు పెట్టుకుని ఉండేవాడు. కాని పబ్లిక్ సెక్స్ ఆచారం ఏసుక్రీస్తువారి కాలంలో లేదు. ముద్దు పెట్టుకున్నంత మాత్రాన మగ్ధలేని మరియ ఏసు క్రీస్తుకు భార్య అవ్వాలని లేదు. పైపెచ్చు కనుక ఏసుక్రీస్తు మగ్ధలేని మరియను వివాహం చేసుకున్నట్లు ఎటువంటి సాక్ష్యాలు లేవు.

లంకెలు[మార్చు]