ఫూల్ చంద్ ఎక్స్ పోర్ట్స్ లిమిటెడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫూల్ చంద్ ఎక్స్ పోర్ట్స్ లిమిటెడ్ నామ ఫలకం

ఫూల్ చంద్ ఎక్స్ పోర్ట్స్ 1975 లో ఫూల్ చంద్ అగర్వాల్ చే స్థాపింప బడ్డ ముంబయి కి చెందిన ఒక బహుళ వ్యాపార సంస్థ.

విభాగాలు

[మార్చు]

ఫూల్ చంద్ ఎక్స్ పోర్ట్స్ లో ఈ క్రింది విభాగాలు కలవు.

గనుల విభాగం

[మార్చు]

ఇనుప, బాక్సైట్, మ్యాంగనీస్ గనుల ఎగుమతి చేసే విభాగం. చైనా, ఆస్ట్రేలియా, ఇండొనేషియా ల నుండి బొగ్గు గనులను దిగుమతి చేస్తుంది. వీటిని నిర్వహించటానికి హల్దియా, పరదీప్, విశాఖపట్నం, మంగుళూరు వంటి పోర్టులలో కావలసిన సాంకేతిక వసతులను ఏర్పాటు చేసుకొన్నది. 2003-04 సంవత్సరానికి గాను 5,00,000 టన్నుల ఇనుప గనిని, 2005 వ సంవత్సరానికి 2 మిలియన్ టన్నుల ఇనుప గనిని ఎగుమతి చేసినది.

రసాయనిక విభాగం

[మార్చు]

యాక్టివేటెడ్ కార్బన్, పొటాషియం పర్మాంగనేట్, సోడా యాష్, కాస్టిక్ పొటాష్, సోడియం సయనైడ్ ల ఎగుమతి చేస్తుంది.

వస్త్ర విభాగం

[మార్చు]

1995 లో బెంగళూరు కేంద్రంగా వస్త్రాలు రూపొందించే సంస్థగా ప్రస్తుత నిర్వహణ దర్శకుడు ప్రదీప్ అగర్వాల్ చే ప్రతీక్ అపారెల్స్ నెలకొల్పబడ్డది. ఈ క్రింది బ్రాండులకి ప్రతీక్ అపారెల్స్ వస్త్రాలను తయారు చేస్తుంది.

లోహ విభాగం

[మార్చు]

ఉక్కు, అల్యుమినియం, జింక్ లోహాలను ముడి పదార్థాలుగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఎగుమతి చేస్తుంది ఈ విభాగం.

వ్యవసాయ ఉత్పత్తుల విభాగం

[మార్చు]

గోధుమలు/గోధుమ పిండి, వరి, పంచదార, తేయాకు, సోయా బీన్, బంగాళా దుంపలు, పప్పు ధాన్యాలను ఎగుమతి చేస్తుంది.

మూలాలు

[మార్చు]