అరవింద్ మిల్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Arvind Mills
తరహాPublic (NSE, BSE)
స్థాపన1931
ప్రధానకేంద్రముఅహ్మదాబాదు
కీలక వ్యక్తులుSanjay Lalbhai (CEO &MD) Arvind N. Lalbhai
పరిశ్రమచేనేత
ఉత్పత్తులుDenim, Knits, Khakhis
రెవిన్యూరూ. 23.45 Billion
నికర ఆదాయముLoss రూ. 480 Million
ఉద్యోగులు26000
వెబ్ సైటుwww.arvindmills.com

అరవింద్ మిల్స్ ప్రాథమికంగా ఒక భారతీయ వస్త్ర వ్యాపార సంస్థ. దీనికి టెలికాం, ఇంజినీరింగ్ విభాగాలు కూడా ఉన్నాయి.

చరిత్ర[మార్చు]

1930 లో కలిగిన ఆర్థిక మాంద్యం వలన ప్రపంచంలోని చాలా సంస్థలు మూతపడ్డాయి. ముఖ్యంగా UK లోనూ, భారతదేశంలోనూ వస్త్ర పరిశ్రమలు ఈ మాంద్యానికి బాగా ప్రభావితం అయ్యాయి. సరిగ్గా అదే సమయంలో మహాత్మాగాంధీ స్వదేశీ నినాదంతో భారతీయులు ఇంగ్లాండు నుండి దిగుమతి అయిన వస్త్రాలను బహిష్కరించారు.

ఇటువంటి సమయంలో భారతదేశంలోనే తయారయ్యే వస్త్రాల అమ్మకానికి మంచి అవకాశం ఉందని గ్రహించారు లాల్ భాయి కుటుంబం. కస్తూర్ భాయి, నరోత్తం భాయి, చిమన్ భాయిలు ఒక మిల్లును నెలకొల్పారు. యంత్రపరికరాలను ఇంగ్లాండు నుండి తెప్పించుకొని అరవింద్ లిమిటెడ్ ను స్థాపించారు.

1931 లో రూ. 25,25,000 ($ 55,000) పెట్టుబడితో ప్రారంభించ బడింది. 1934 నాటికి 45.76 లక్షల అమ్మకాలతో 2.82 లక్షల లాభాలను గడించింది. విద్యుచ్ఛక్తి లేమి వలన 80 లలో చేనేత పరిశ్రమ కుంటు పడినా, అరవింద్ మిల్స్ ఆ సమయంలో కూడా అత్యధిక లాభాలను గడించింది. స్వదేశంలోనే కాకుండా విదేశాలపై కూడా దృష్టి సారించిన అరవింద్ మిల్స్ నూలు దుస్తులపై పెరుగుతున్న గిరాకీతో 1987-88 లో డెనింను ఉత్పత్తి చేయటం మొదలుపెట్టినది. ఇదే సంవత్సరంలో అంతర్జాతీయ షర్టుల సంస్థ ఆరో ని భారతదేశంలో నెలకొల్పినది. 1991 నాటికి అరవింద్ మిల్స్ సంవత్సరానికి 1600 మిలియన్ మీటర్ల ఉత్పత్తికి చేరుకొంది. ప్రపంచంలో డెనిం ఉత్పత్తి చేసే సంస్థలలో ఇది మూడవ స్థానం. ఎస్ ఏ పీని వాడుకొన్న మొట్టమొదటి (1997-98 లోనే) భారతీయ సంస్థ అరవింద్ మిల్స్. 2008 లో మెగామార్ట్ వస్త్ర వికయశాలల హారాన్ని నెలకొల్పినది.

2011 లో ద అరవింద్ స్టోర్ పరిచయం చేయబడింది. ఈ స్టోర్ లోని స్టూడియో అరవింద్లో అరవింద్ మిల్స్ చే నేయబడ్డ వస్త్రాలను ఇదే సంస్థ చే ఎన్నుకోబడ్డ దర్జీల వద్ద బట్టలను అక్కడే కుట్టించుకొనవచ్చును. అరవింద్ డిజైన్ ల్యాబ్స్ (ఏ డీ ఎల్) రూపొందించిన జీన్స్ ప్యాంట్లను వినియోగదారుడి కొలతల ప్రకారం కుట్టించుకొనవచ్చును. ఏ డీ ఎల్ రూపొందించిన బటన్, రివెట్లు, జిప్ ల శ్రేణుల నుండి వినియోగదారుడు నచ్చినవి ఎంపిక చేసుకొనవచ్చును. ఇంతే కాక, ఇక్కడ ఆరో, ఫ్లయింగ్ మషీన్, యూ.ఎస్.పీ.ఏ బ్రాండుల రెడీమేడ్ వస్త్రాలు కూడా అందుబాటులో ఉంటాయి.

బ్రాండులు[మార్చు]

స్వంత బ్రాండులు[మార్చు]

లైసెన్స్డ్ బ్రాండులు[మార్చు]

జాయింట్ వెంచర్ బ్రాండులు[మార్చు]

అంతర్గత లంకెలు[మార్చు]

బాహ్య లంకెలు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]