Jump to content

ఫెడెరికో ఫెలినీ

వికీపీడియా నుండి
ఫెడెరికో ఫెలినీ
Federico Fellini
జననం(1920-01-20)1920 జనవరి 20
మరణం1993 అక్టోబరు 31(1993-10-31) (వయసు 73)
వృత్తిసినీ దర్శకుడు, రచయిత
క్రియాశీల సంవత్సరాలు1945–1992
జీవిత భాగస్వామిGiulietta Masina
(m. 1943–93, his death)

“నేను సాహిత్యాన్ని” అన్న కాఫ్కా రీతి లో.. “నేను సినిమాను” అని చాటిన ఇటాలియన్ దర్శకుడు ‘ఫెడెరికో ఫెలినీ’ (Federico Fellini). ఆయన చేసిన సినిమాల ద్వారా ప్రపంచ సినీ చరిత్రలో అరుదైన ఆర్టిస్టిక్ జీనియస్ అనిపించుకున్నాడు ఫెలినీ. ఆయన జీవితం గురించి చదివినవారికీ, ఆయన సినిమాలు చూసినవారికి ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

కవితాత్మకమైన, భావావేశముతో కూడిన అసమాన దృశ్యాలతో ..సినిమా అనే మాధ్యమం ద్వారా ..మనిషి లోని కాంప్లెక్సిటీని చెప్పటానికి ప్రయత్నించిన అతికొద్ది దర్శకుల్లో ఫెలినీ ముఖ్యమైనవాడు. ఇమాజినేజన్ ఈజ్ మోర్ ఇంపార్ట్ టెంట్ దెన్ నాలెడ్జ్ అన్న అల్బర్ట్ ఐన్ స్టీన్ మాటలకు నిదర్శనాలుగా నిలుస్తాయి ఫెలినీ సినిమాలు. హ్యూమన్ ఎమోషన్స్ లేదా సెంటిమెంట్ లను వివరంగా చెప్పటమే ప్రధాన లక్ష్యంగా వుంటాయి ఫెలినీ ఇమేజెస్. వీటికి ఏ విధమైన ఆదర్శాలను జతచేయకపోవటమే ఫెలినీ గ్రేట్ నెస్ గా చెప్పుకోవాలి.

ఫెలినీ.. ప్రపంచ సినిమాకు దొరికిన అసలు సిసలైన, నిజమైన కళాకారుడు.డ్రీమ్స్ ద్వారా మాత్రమే మనిషి సిన్సియర్ గా దేనినైనా కమ్యూనికేట్ చేయగలుగుతాడు.మిగిలినదంతా అబద్దం అని బలంగా నమ్మాడు ఫెలినీ. అందుకే ఫెలినీ సినిమాల్లో ఎక్కువశాతం డ్రీమ్స్, ఫాంటసీస్, ఇమాజినేషన్స్ కనిపిస్తాయి. ఫెలినీ సినిమా అర్థం చేసుకోవటం కష్టం అని ఎవరైనా ప్రశ్నిస్తే..అందుకు ఫెలినీ ఇచ్చే సమాధానం.. ఇక్కడ ఏదైతే క్లియర్ గా వుండి, అందరికీ అర్థమవుతుందో అదంతా అబద్దం. ఒక మనిషి నిజాయితీగా, సిన్సియర్ గా తన గురించి తాను మాట్లాడితే..అది కచ్చితంగా తనదైన సంక్లిష్ట విధానం లో, ఎక్కువ వ్యాఖ్యానాలు చేయటానికి వీలైన లక్షణాలు కలిగివుంటుంది.అందుకే చాలా కొద్దిగా మాత్రమే అర్థమవుతుంది అని బదులిచ్చే మేధావి, జీనియస్ ఫెడెరెకో ఫెలినీ.

ఫెలినీ సినిమాల్లో లా స్ట్రాడా, లా డొల్సి విటా, 8 ½ లు ముఖ్యమైనవి. అయితే..సినిమా మేధావులూ, విమర్శకులూ, పరిశోధకులూ ముఖ్యంగా ఫెలినీ అభిమానులూ… అందరూ కలిసి ఆయన సినిమాలన్నింటిలో కెల్లా గొప్ప సినిమాగా ఓ సినిమాను నిర్దారించారు. ఆ సినిమా నే 8 ½ . ఫెలినీ లోని ఆర్టిస్టిక్ జీనియస్ ను సంపూర్తిగా, గొప్పగా ఆవిష్కరించిందీ ఈ సినిమా. ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డ్ తో పాటు పలు అవార్డ్ లను గెలుచుకున్న ఈ సినిమాను మెచ్చుకోని సినిమా దర్శకుడు లేడంటే అతిశయోక్తి కాదు. 30 మందితో కూడిన యూరోపియన్ ఇంటెలెక్టువల్ కమిటీ.. 1987 లో 8 ½ సినిమాను అతి ముఖ్యమైన యూరోపియన్ సినిమాగా, ఫెలినీని అతి ముఖ్యమైన యూరోపియన్ డైరెక్టర్ గా అభివర్ణించటం విశేషం.

బాల్యం

[మార్చు]

ప్రభావం

[మార్చు]

సినిమాలు

[మార్చు]

రచనలు

[మార్చు]

అవార్డులు

[మార్చు]

మరణం

[మార్చు]

మూలాలు

[మార్చు]

ఫెల్లినీ’s 8 ½