ఫైల్ రకం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గణక యంత్రాలలో వాడే ఫైళ్లు వివిధరకాలుగా వుంటాయి. కొన్ని ఏ యంత్రంలోనైనా చదవగల పాఠ్యరూపంలో వుంటే, వివిధ సాఫ్ట్వేర్ల కు అనువుగా వాటికి కావలసిన సమాచారంతో వుంటాయి. ఫైల్ పేరులో వీటిని చుక్క తరువాత వచ్చే భాగంగా వీటిని గుర్తించవచ్చు. వీటిలో చాలా ఎక్కువగా వాడుకునేవాటి గురించి క్లుప్త సమాచారం చూద్దాం.

.టిఎక్స్‌టి (.txt)

[మార్చు]

ఈ ఫైళ్లలో కేవలం పాఠ్యంలో వాడిన అక్షరాల్ని ప్రామాణీకరించిన యాస్కీ (ASCII) లేక యూనికోడ్ (UNICODE) అక్షరామూలాలను మాత్రమే వాడుతారు. యాస్కీ ఇంగ్లీషు, దానికి పోలికవుండే కొన్ని భాషలకు మాత్రమే సరిపోతుంది. యూనికోడ్ తో ప్రపంచలో వాడబడే భాషలలోని ఏ అక్షరమూలలకైనా అవి కలగలిపివున్నా వాడవచ్చు. వివిధ రకాల కంప్యూటర్ వ్యవస్థల మధ్య సమాచారం పంపటానికి ఇది అనువైనది.

.పిడిఎఫ్(.pdf)

[మార్చు]

పిడిఎఫ్ అనగా పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్. ఇది ముఖ్యంగా డిటిపితో అభివృద్ధిచెందింది. దీనిలోని సమాచారం ఉచితంగా అన్ని కంప్యూటర్ వ్యవస్థలకు దొరికే అడోబి పిడిఎఫ్ రీడర్ ద్వారా చూడవచ్చు. ఇతరులతో ముద్రణారూపు దిద్దబడిన పత్రాలను పంచుకోటానికి ఇది అనువైనది.

.డిఒసి(.doc)

[మార్చు]

ప్రముఖ కంప్యూటర్ ద్వారా ముద్రణారూపు దిద్దగల(డిటిపి) సాఫ్ట్వేర్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ యొక్క ఫైల్ రకం.

.ఒడిటి(.odt)

[మార్చు]

ఇది ప్రామాణిక స్వేచ్ఛా పత్ర పాఠ్య తీరు. ఉచితంగా లభించే సాఫ్ట్వేర్ లిబ్రెఆఫీస్ ఇతర ఫైల్ రకాలను తెరవగలదు,రాయగలదు.

వనరులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఫైల్_రకం&oldid=2951451" నుండి వెలికితీశారు