Jump to content

ఫ్రమ్ హియర్ టు ఎటర్నిటి

వికీపీడియా నుండి
ఫ్రమ్ హియర్ టు ఎటర్నిటి
సినిమా పోస్టర్
దర్శకత్వంఫ్రెడ్ జిన్నెమాన్
స్క్రీన్ ప్లేడేనియల్ తరదాష్
దీనిపై ఆధారితంఫ్రమ్ హియర్ టు ఎటర్నిటి (నవల) 
by జేమ్స్ జోన్స్
నిర్మాతబడ్డీ ఆడ్లర్
తారాగణం
  • బర్ట్ లాంకస్టర్
  • మాంట్ గోమరి క్లిఫ్ట్
  • డెబొరా కెర్
  • డొన్నా రీడ్
  • ఫ్రాంక్ సినట్రా
ఛాయాగ్రహణంబర్నెట్ గఫె
కూర్పువిలియం ఎ. లైయాన్
సంగీతంజార్జ్ డ్యూనింగ్, మోరిస్ స్టొలోఫ్
కలర్ ప్రాసెస్నలుపు - తెలుపు
నిర్మాణ
సంస్థ
కొలంబియా పిక్చర్స్
పంపిణీదార్లుకొలంబియా పిక్చర్స్
విడుదల తేదీ
ఆగస్టు 5, 1953 (1953-08-05)
సినిమా నిడివి
118 నిమిషాలు
దేశంఅమెరికా
భాషఇంగ్లీషు
బడ్జెట్$1.7–2.5 మిలియన్లు[1][2]
బాక్సాఫీసు$30.5 మిలియన్లు[1]

'ఫ్రమ్ హియర్ టు ఎటర్నిటి' 1953, ఆగష్టు 5న విడుదలైన అమెరికన్ రొమాంటిక్ యుద్ధ సినిమా.[3] అదే పేరుతో జేమ్స్ జోన్స్ వ్రాసిన నవల ఆధారంగా ఈ సినిమాను బడ్డీ ఆడ్లర్ నిర్మించగా ఫ్రెడ్ జిన్నెమాన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 8 విభాగాలలో ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది. 2002లో లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ ఈ చిత్రాన్ని సాంస్కృతికంగా, చారిత్రకంగా, కళాత్మకంగా ఆవశ్యకమైన చిత్రంగా గుర్తించి నేషనల్ ఫిల్మ్ రిజిస్ట్రీలో భద్రపరచారు.

'ఫ్రమ్ హియర్ టు ఎటర్నిటీ' చిత్రంలో కథంతా హవాయిలోని ఓహూవద్ద ఉన్న స్కోఫీల్డ్ బ్యారక్స్‌లో జరుగుతుంది. కథాకాలం పెరల్ హార్బర్‌పై దాడికి కొంచెం ముందు. కథలో హీరో ప్రైవేట్ రాబర్ట్లీ ప్రెవిట్. (ప్రైవేట్ అంటే సోల్జర్ అనుకోవచ్చు.) అతనివి చాలా గాఢమైన విశ్వాసాలు. తనవల్ల జరిగిన ఒక పొరపాటు కారణంగా బాక్సింగ్ రింగులో ఒకరి కన్ను పోయిందన్న గిల్టీ భావంతో అతను, తనను తనపై ఆఫీసర్లు శిక్షిస్తారనే సంగతి తెలిసినా, మళ్లీ రింగ్‌కి వెళ్లడు. చిత్రంలో పెరల్ హార్బర్ సెట్ చాలా గొప్పగా ఉంటుంది. సన్నివేశాలపరంగా అయితే సముద్రతీరంలో సెక్సు దాహం తీర్చుకొనే కెప్టెన్ భార్య, ఆమెతో సంబంధం ఉన్న సార్జెంట్‌ల దృశ్యాలు; సైన్యంలో సైనికుల మీద క్రమశిక్షణ రుద్దే సన్నివేశాలు; ప్రైవేట్, మాగియోల మధ్య స్నేహం ఇవన్నీ గొప్పగా ఉంటాయి.[3]

నటీనటులు

[మార్చు]
  • బర్ట్ లాంకస్టర్ - ఫస్ట్ సార్జెంట్ మిల్టన్ వార్డెన్[4][5]
  • మాంట్ గోమరి క్లిఫ్ట్ - ప్రైవేట్ రాబర్ట్ ఇ.లీ ప్రెవిట్
  • డెబొరా కెర్ - కరెన్ హోమ్స్
  • డొన్నా రీడ్ - అల్మా బుర్క్/లోరీన్
  • ఫ్రాంక్ సినట్రా - ప్రైవేట్ ఏంజెలో మాగియో
  • ఫిలిప్ ఓబర్ - కెప్టెన్ "డైనమైట్" హోమ్స్
  • మికీ షౌనెసి- కార్పొరల్ లెవా
  • హారీ బెల్లావర్ - ప్రైవేట్ మజియోలి
  • ఎర్నెస్ట్ బోర్గ్నైన్ - సార్జెంట్ జేమ్స్ ఆర్.ఫాట్స్ జడ్సన్
  • జాక్ వార్డెన్ - కార్పోరల్ బక్లీ
  • జాన్ డెనిస్ - సార్జెంట్ ఐక్ గలోవిచ్
  • మెర్లే ట్రావిస్ - సాల్ ఆండర్సన్
  • టిమ్‌ ర్యాన్ - పీట్ కరెల్సన్
  • ఆర్థర్ కీగన్ - ట్రేడ్వెల్
  • బార్బరా మారిసన్ - మిసెస్ కిప్ఫర్

పురస్కారాలు

[మార్చు]
అవార్డు విభాగం విజేతలు/ప్రతిపాదించబడిన వారు ఫలితం
అకాడమీ పురస్కారాలు[6] ఉత్తమ చిత్రం బడ్డీ ఆడ్లర్ గెలుపు
ఉత్తమ దర్శకుడు ఫ్రెడ్ జిన్నెమాన్ గెలుపు
ఉత్తమ నటుడు మాంట్ గోమరి క్లిఫ్ట్ ప్రతిపాదన
బర్ట్ లాంకస్టర్ ప్రతిపాదన
ఉత్తమ నటి డెబొరా కెర్ ప్రతిపాదన
ఉత్తమ సహాయనటుడు ఫ్రాంక్ సినట్రా గెలుపు
ఉత్తమ సహాయనటి డొన్నా రీడ్ గెలుపు
ఉత్తమ స్క్రీన్ ప్లే డేనియల్ తరదాష్ గెలుపు
ఉత్తమ ఛాయాగ్రహణం నలుపు-తెలుపు బర్నెట్ గఫె గెలుపు
ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్ నలుపు-తెలుపు జీన్ లూయీస్ ప్రతిపాదన
ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ విలియం లియాన్ గెలుపు
ఉత్తమ సంగీతం జార్జ్ డ్యూనింగ్, మోరిస్ స్టొలోఫ్ ప్రతిపాదన
ఉత్తమ సౌండ్ రికార్డింగ్ జాన్ పి.లివడరీ గెలుపు
బాంబీ అవార్డులు ఉత్తమ అంతర్జాతీయ సినిమా గెలుపు
బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డులు[7] ఉత్తమ చిత్రం ప్రతిపాదన
కేన్స్ ఫిలిం ఫెస్టివల్[8] గ్రాండ్ ప్రిక్స్ ఫ్రెడ్ జిన్నెమాన్ ప్రతిపాదన
ప్రత్యేక బహుమతి గెలుపు
డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా అవార్డులు ఉత్తమ దర్శకుడు గెలుపు
గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు[9] ఉత్తమ సహాయ నటుడు ఫ్రాంక్ సినట్రా గెలుపు
ఉత్తమ దర్శకుడు ఫ్రెడ్ జిన్నెమాన్ గెలుపు
గోల్డెన్ స్క్రీన్ అవార్డులు గోల్డెన్ స్క్రీన్ గెలుపు
గోల్డెన్ స్క్రీన్ విత్ స్టార్ గెలుపు
నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ అవార్డులు టాప్ టెన్ సినిమాలు 3వ స్థానం
నేషనల్ ఫిల్మ్ ప్రిజర్వేషన్ బోర్డు నేషనల్ ఫిల్మ్ రిజిస్ట్రీ చేర్చబడింది
న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డులు ఉత్తమ సినిమా గెలుపు
ఉత్తమ దర్శకుడు ఫ్రెడ్ జిన్నెమాన్ గెలుపు
ఉత్తమ నటుడు బర్ట్ లాంకస్టర్ గెలుపు
ఆన్‌లైన్ ఫిల్మ్ & టెలివిజన్ అసోసియేషన్ అవార్డులు హాల్ ఆఫ్ ఫేమ్ – సినిమా గెలుపు
ఫోటో ప్లే అవార్డులు బంగారు పతకం గెలుపు
రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా అవార్డులు ఉత్తమ అమెరికన్ డ్రామా డేనియల్ తరదాష్ గెలుపు

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Box Office Information for 'From Here to Eternity'." Archived 2013-09-10 at the Wayback Machine The Numbers. Retrieved: April 12, 2012.
  2. Webster, David Kenyon. "Film Fare: Hollywood producers concentrate on fewer, more lavish pictures, theatre owners complain, but studios' profits are the best in year's Genghis Khan and Ben Hur." The Wall Street Journal, July 13, 1954, p. 1.
  3. 3.0 3.1 పాలకోడేటి సత్యనారాయణరావు (1 April 2007). హాలీవుడ్ క్లాసిక్స్ మొదటి భాగం (1 ed.). హైదరాబాదు: శ్రీ అనుపమ సాహితి. pp. 82–84.
  4. Brogdon, William (1953-07-29). "From Here to Eternity". Variety (in ఇంగ్లీష్). Retrieved 2020-04-27.
  5. "From Here to Eternity - Plot, Cast, Awards, & Facts". Encyclopedia Britannica (in ఇంగ్లీష్). Retrieved 2020-04-27.
  6. "The 26th Academy Awards (1954) Nominees and Winners." Oscars.org.
  7. "Film in 1954". BAFTA. Retrieved November 17, 2017.
  8. "From Here to Eternity." Archived 2012-01-19 at the Wayback Machine Festival de Cannes.
  9. "From Here to Eternity". Golden Globes. Retrieved November 17, 2017.