Jump to content

ఫ్రూట్ సలాడ్ చెట్టు

వికీపీడియా నుండి
సిట్రస్ ఫ్రూట్ చెట్టు

ఫ్రూట్ సలాడ్ చెట్టు అనేది వివిధ రకాల పండ్ల చెట్టు. సామాన్యముగా ఒక చెట్టుకు ఒకే రకం పండ్లు కాస్తాయి కానీ ఫ్రూట్ సలాడ్ చెట్టుకు 8 రకాల పండ్లు ఒకేసారి కాస్తాయి. ఫ్రూట్ సలాడ్ చెట్టు అనేది 1990ల ప్రారంభంలో ఆస్ట్రేలియాలో జేమ్స్, కెర్రీ వెస్ట్‌లచే అభివృద్ధిచేయబడింది. ఈ ఫ్రూట్ సలాడ్ నిమ్మ, నారింజ, అరటి, యాపిల్స్ వంటి ఒకే జాతికి చెందిన 6-8 పండ్లను ఉత్పత్తి చేస్తుంది. మొట్టమొదటి ఫ్రూట్ సలాడ్ చెట్టు ఆస్ట్రేలియాలో పెరిగింది, కానీ కాలక్రమేణా అది ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు రవాణా చేయబడింది.[1]

చెట్టు రకాలు

[మార్చు]

ఇందులో నాలుగు రకాల ఫ్రూట్ సలాడ్ చెట్లు ఉన్నాయి. అవి సిట్రస్, స్టోన్ ఫ్రూట్, మల్టీ యాపిల్, మల్టీ నాషి. పేరును బట్టి, ఏ చెట్టుకు ఏ పండ్లు పండుతాయో స్పష్టంగా తెలుస్తుంది.[2]

  • మల్టీ నాషి చెట్టు: ఇది వివిధ రకాల ఆసియా బేరిలను ఉత్పత్తి చేసే సలాడ్ చెట్టు.
  • మల్టీ యాపిల్ చెట్టు: పసుపు, ఎరుపు, ఆకుపచ్చ ఆపిల్ వంటి ఆపిల్ రకాలను ఇస్తుంది.
  • స్టోన్ ఫ్రూట్ చెట్టు: రేగు, ఆప్రికాట్లు, పీచెస్, నెక్టరైన్ వంటి రకాలను ఇస్తుంది.
  • సిట్రస్ ఫ్రూట్ చెట్టు: నారింజ, నిమ్మకాయలు, మాండరిన్లు, ద్రాక్షపండ్లు వంటివి దీనికి కాస్తాయి.

చెట్లను పెంచడం

[మార్చు]

ఈ చెట్టును పెంచే ప్రక్రియలో మొదట, చెట్టును నీటితో నిండిన బకెట్‌లో రాత్రంతా నానబెట్టాలి. మరునాడు ఈ చెట్టును మట్టిలో పాతాలి, కొన్ని రోజులకి దాని వేర్లు వ్యాప్తి చెందుతాయి. వాడే మట్టి రకాన్ని బట్టి దానికి కంపోస్ట్ లేదా జిప్సం ఇవ్వాలి. నేల తేమను కాపాడటానికి, చెట్టుకు మల్చింగ్ చేయాలి. ఈ ఫ్రూట్ సలాడ్ చెట్టు మొదటి కాపుకు దాదాపు 9-18 నెలల సమయం పడుతుంది.[3][4]

ప్రయోజనాలు

[మార్చు]

ఫ్రూట్ సలాడ్ చెట్టును తోట/టెర్రస్ మీద కూడా పెంచుకోవచ్చు. తక్కువ జాగలో ఎక్కువ పండ్లను పొందవచ్చు. ఏడాది పొడవున తాజా పండ్లు దొరుకుతాయి.

ప్రతికూలత

[మార్చు]

ఒకే చెట్టుపై వివిధ జాతుల పండ్లను పండించలేరు. ఉదాహరణకు, నిమ్మ, యాపిల్ లేదా అరటి, ఆప్రికాట్స్ ను కలిపి పండించలేరు. వీటి కోసం ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి.

వాతావరణం

[మార్చు]

ఉష్ణమండల, వెచ్చని, సమశీతోష్ణ వాతావరణంలో స్టోన్ ఫ్రూట్ చెట్టు, మల్టీ నాషి చెట్లను పెంచవచ్చు. శీతల వాతావరణంలో స్టోన్ ఫ్రూట్ సలాడ్ చెట్లు, సిట్రస్ ఫ్రూట్ సలాడ్ చెట్లు (-8 డిగ్రీల వరకు), ఆపిల్ ఫ్రూట్ సలాడ్ చెట్లు పెరుగుతాయి.

మూలాలు

[మార్చు]
  1. "It's for real! This tree bears 7-8 different varieties of fruits". The Times of India. ISSN 0971-8257. Retrieved 2023-05-22.
  2. Trees, Fruit Salad. "Fruit Salad Trees | Different fruit on the same tree Australia wide!". Fruit Salad Trees. Retrieved 2023-05-22.
  3. "Ever Heard Of A Salad Tree? It Exists, Know The Details Here". Slurrp. Retrieved 2023-05-22.
  4. "Fruit Salad Trees Exist and Here How to Grow Them". Better Homes & Gardens. Retrieved 2023-05-22.