Jump to content

ఫ్లోక్యులేషన్

వికీపీడియా నుండి
కోగ్యులేషన్ - ప్లోక్యులేషన్ ప్రక్రియలో నీటిని శుద్ధి చేయడం

ఫ్లోక్యులేషన్ అనగా ఉండకట్టడం లేదా తుట్టె కట్టడం. జిగార్థ రసాయన శాస్త్ర రంగంలో ఈ మాట తరచు వినబడుతూ ఉంటుంది. ఒక అవలంబనం (suspension) నుండి జిగార్థాలు (జిగటగా ఉన్న పదార్ధములు = colloids) ఉండకట్టి లేదా తుట్టెకట్టి (లేదా ఫ్లేక్ రూపంలో) బయటకు వచ్చే ప్రక్రియ ఇది. ఈ ప్రక్రియ యాదృచ్ఛికంగా జరగొచ్చు లేదా వేరే శుద్ధి చేసే పదార్థం కలవడం వలన కావచ్చు. అవపాతం (precipitation) వల్లనే కాకుండా ఈ ప్రక్రియలో ఏర్పడిన జిగార్థములు ద్రావణంలో కరిగిపోకుండా తేలియాడుతాయి. మజ్జిగలో తొరకలు రూపంలో ఉన్న ఈ జిగార్థ పదార్దాలు తేలుతుండడం వలన రొట్టెముక్కలా (కేక్ లా) నిర్మాణం జరుగదు.

పదం యొక్క నిర్వచనం

[మార్చు]

ఐయుపిఎసి వారి నిర్వచనం ప్రకారం ఫ్లోక్యులేషన్ అనగా "స్పర్శ, సంధానం (contact and adhesion) వంటి చర్యల ద్వారా వెదజల్లబడ్డ పదార్థాల రేణువులు ఉండకట్టడం (లేదా ఉండలుగా మారడం)." రసాయన శాస్త్రంలో flocculation, agglomeration, coagulation (పేరుట, కరుడు కట్టుట, ఘనీభవనం) అనేవాటిని పర్యాయ పదాలుగా వాడుతున్నారు.

పాలల్లో నిమ్మ రసం వేసి పాలని విరగ్గొట్టడం coagulation అనే ప్రక్రియకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వరద వచ్చిన గోదావరి నీళ్ళల్లో ఇండుపగింజ గంధం కాని పటిక కాని వేసి మడ్డిని కిందకి దింపి, మంచి నీటిని తేర్చడం flocculation కి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. పటిక (alum, Al2 (SO4) 3.14 H2O నీళ్ళల్లో కలిపినప్పుడు జరిగే ప్రక్రియ ఈ దిగువ చూపినవిధంగా ఉంటుంది:

Al2 (SO4) 3 • 14 H2O → 2 Al (OH) 3 (s) + 6 H+ + 3 SO42- + 8 H2O

ఫ్లోక్యులేషన్ సమయంలో ద్రావణాన్ని నెమ్మదిగా కలపడం వలన రేణువులు (తొరకలు) ఒకదానితో మరొకటి గుద్దుకునే వేగం పెరుగుతుంది. ఆ కారణంగా రేణువుల స్థిర నిశ్చలత భంగపడి రేణువులు మరింత పెద్ద ప్రెసిపిటేట్లుగా మారతాయి. ఫ్లోక్యులేషన్ అనే ప్రక్రియ కలిపే వేగం, కలిపే తీవ్రత, కలిపే సమయం వంటి అనేక పారామితుల వలన ప్రభావితమవుతుంది.

అనువర్తనాలు

[మార్చు]

ఉపరితల రసాయనం (సర్ఫేస్ కెమిస్ట్రీ)

[మార్చు]

జిగార్థ రసాయన శాస్త్రంలో, ఫ్లోక్యులేషన్ అంటే చిన్న చిన్న రేణువులు కలిసి, తుట్టె కట్టి ఒక వెన్నముద్దలా మారే ప్రక్రియను సూచిస్తుంది. అప్పుడు ఈ ముద్ద ద్రవం పైన తేలుతూ ఉండవచ్చు (మజ్జిగ మీద వెన్న తేలినట్లు లేదా క్రీమింగ్), ద్రవం యొక్క అడుగుకి మడ్డిలా చేరవచ్చు (అవక్షేపణ), లేదా వెంటనే ద్రవం నుండి గలనం (ఫిల్టర్) కావచ్చు.

భౌతిక రసాయనం

[మార్చు]

రసాయనాలు కోసం, ఫ్లోక్యులేషన్ వ్యక్తిగతంగా చెదరగొట్టిన చుక్కల యొక్క క్లస్టరింగ్ను, దాని ద్వారా వాటి స్వభావాన్ని కోల్పోకుండా ఉండడానిని వివరిస్తుంది. ఫ్లోక్కులేషన్ ఈ విధంగా ఎమల్షన్ యొక్క కాలవ్యవధిని మరింత పెంచడానికి (బిందువుల మిశ్రమముచే, అంతిమ సెపరేషన్ దశలు) దారితీసిన ప్రారంభ దశ. ఫ్లోక్కులేషన్ను ఖనిజ డ్రెస్సింగ్లో ఉపయోగిస్తారు.

సివిల్ ఇంజనీరింగ్ / భూ శాస్త్రాలు

[మార్చు]

సివిల్ ఇంజనీరింగ్, భూమి శాస్త్రాలలో, ఫ్లోక్యులేషన్ అనునది బంకమట్టి, పాలిమర్స్, లేదా ఇతర చిన్న ఆవేశపూరితమైన రేణువుల ఒకదానితో మరొకటి అనుసంధానం చెంది తుట్టెల వంటి పదార్ధము ఏర్పడే పరిస్థితిని సూచిస్తుంది. చెల్లాచెదావుతూన్న బంకమట్టి బెందడిలో తల్లడపాటు తగ్గిన తరువాత చెదిరిపోయిన పళ్లెరాలు ఆకస్మికంగా తలెత్తి తుట్టెలు (flocs) లా తయారవుతాయి.

జీవశాస్త్రం

[మార్చు]

తుట్టేకట్టే ప్రక్రియని ప్రోత్సహించి సూక్ష్మవడపోత (microfiltration) ని సానుకూళం చెయ్యవచ్చు.

జున్ను ఉత్పత్తి

[మార్చు]

చీజు పరిశ్రమలో - పాలుని తోడు పెట్టే సందర్భంలో - తుట్టెల లక్షణాలని ఉపయోగిస్తారు.

మద్యం తయారీ

[మార్చు]

నీటిని శుద్ధి చెయ్యడం

[మార్చు]