బంకోలా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బంకోలా తెలుగు చారిత్రక నవల. శాస్త్రీయ చారిత్రిక నవలా రచన విధానాన్ని చక్కగా అనుసరించబడిన నవల ఇది.

ఈ నవలారచయిత శ్రీ సాధు సుబ్రహ్మణ్యశర్మ కాకినాడ వాసులు,[1] కాకినాడలో విశ్రాంత జీవితం గడుపుతున్నారు. కాకినాడ సమీపంలో సాగరతీరంలో కోరంగి అనే విస్మృత ఓడరేవు ఉంది. బందరు రేవునుంచి ఈస్టిండియా కంపెనీ, కోరంగి ప్రాంతంనుంచి డచ్ ఈస్టిటండియా కంపెనీ వ్యాపారం నిర్వహించాయి. స్థానిక మత్స్యకారులు కోరంగి నుంచి సముద్రం మీదకు చేపలవేటకు వెళ్ళేవారు. క్రమంగా వారినౌకలు శక్తి వంతమైనవి అయ్యాయి. నౌకల నిర్మాణం, కట్టడం, బాగుచెయ్యడంలో స్థానికులు గొప్ప నైపుణ్యం సంపాదించారు. డచ్ వారు కోరంగిరేవును చిన్న టౌనుగా అభివృద్ధి చేశారు. కోరంగిలో ఒక వారకాంత-సుందరస్త్రీ, ఒక మత్స్యకారుల యువకుణ్ణి ముఖ్యపాత్రలుగా 1750-1850వరకు ఆరేవు చుట్టూ కథ అల్లబడింది. ఆనాటితెలుగు వారి జీవితం, సమాజం, డచ్ ఇంగ్లీషు వాణిజ్య కంపెనీలు, వాటిమధ్యపోటీ, సంబంధాలు కల్పన, చరిత్ర కలిపి గొప్పగా చిత్రించారు రచయిత. మధ్యలో విముక్తి పోరాట ప్రయత్నాలు వగైరా కథను కూడా చెప్తారు. అతిశయోక్తులు, నేలమీద నిలవని అభూతకల్పనలు కాక, ఆంధ్రదేశ చరిత్రలో ఏభైఏళ్ళను ఈ గ్రంథ పుటల్లో నిక్షిప్తం చేశారు సాధు సుబ్రహ్మణ్యశర్మగారు.[2] ఆధునికదృష్టి, చారిత్రక నవలా రచనాశిల్పం వారి రచనకు వన్నెతెచ్చాయి. బ్రిటిష్ కాలం నాటి సామాజిక చరిత్రను కళ్ళకు కట్టించే నవల ఇది. బంకోలా అంటే సాగరతీరంలో దీపస్థంభం.(లైట్ హౌస్) ఇప్పటికీ కోరంగి వద్ద శిథిలమైన ఆనాటి దీపస్థంభం కానవస్తుంది.

మూలాలు[మార్చు]

  1. "K.N. Murali Sankar KAKINADA". The Hindu (in Indian English). 2018-02-21. ISSN 0971-751X. Retrieved 2023-11-14.
  2. "మిసిమి పత్రిక వ్యాసం" (PDF). July 2012.

బయటి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=బంకోలా&oldid=4026958" నుండి వెలికితీశారు