Coordinates: 17°24′39.55″N 78°26′55.4″E / 17.4109861°N 78.448722°E / 17.4109861; 78.448722

బంజారా చెరువు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బంజారా చెరువు
బంజారా చెరువు is located in India
బంజారా చెరువు
బంజారా చెరువు
ప్రదేశంబంజారా హిల్స్, హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
అక్షాంశ,రేఖాంశాలు17°24′39.55″N 78°26′55.4″E / 17.4109861°N 78.448722°E / 17.4109861; 78.448722
రకంచెరువు
ప్రవహించే దేశాలుభారతదేశం
గరిష్ట లోతు5 మీటర్లు (16 అడుగులు)
ప్రాంతాలుహైదరాబాదు

బంజారా చెరువు (హమీద్ ఖాన్ కుంట) తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బంజారా హిల్స్ ప్రాంతంలో ఉన్న మానవ నిర్మిత చెరువు.

చరిత్ర[మార్చు]

బంజారాహిల్స్ రోడ్ నం.1లోని తాజ్ బంజారా హోటల్‌ను ఆనుకుని ఉన్న ఈ చెరువు 1930లో నిర్మించబడింది. ఆ కాలంలో ఈ ప్రాంతంలో రాజ కులీనుల భవనాలు, నివాసాలు ఉండేవి. మొదట్లో ఈ చెరువు ఒక కిలోమీటర్ కంటే ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉండి, 1990 వరకు ఇది మంచినీటి చెరువుగా ఉపయోగించబడింది.[1] 100 అడుగుల లోతులో ఉండే ఈ చెరువులో గతకాలంలో బోటు షికారు కూడా సాగేది. ఆ తరువాత క్రమక్రమంగా కబ్జాలకు, ఆక్రమణలకు గురికావడంతో అక్రమ నిర్మాణాలు పుట్టుకొచ్చాయి.[2]

పరిరక్షణ[మార్చు]

చెరువుకు పక్కనున్న ప్రాంతాలనుండి మురుగునీరు వచ్చి చెరువులో కలుస్తుంది.[3] సేవ్ అవర్ అర్బన్ లేక్స్ (సోల్) వంటి సంస్థలచే ఈ సరస్సును పరిరక్షణకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.[4]

ఇతర వివరాలు[మార్చు]

తెలంగాణ ప్రభుత్వం నీటి పారుదల శాఖ అధ్వర్యంలో చెరువు చుట్టుపక్కల ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపట్టింది.[5]

మూలాలు[మార్చు]

  1. The News Minute, Hyderabad (27 December 2016). "Hyderabads Banjara Lake being dumped debris allege activists". Retrieved 16 December 2019.
  2. వార్త, ఎడిటోరియల్ (17 October 2017). "కబ్జా ప్రభావం.. చెరువులు మాయం". పి.వి.ఆర్. మూర్తి. Archived from the original on 16 December 2019. Retrieved 16 December 2019.
  3. Nanisetti, Serish (2017-03-04). "Banjara Lake to shrink further". The Hindu. ISSN 0971-751X. Retrieved 2019-11-12.
  4. The Hindu, Hyderabad (10 October 2012). "City NGO focuses on poor state of Banjara lake at CoP 11". The Hindu. Archived from the original on 16 December 2019. Retrieved 16 December 2019.
  5. నమస్తే తెలంగాణ, రంగారెడ్డి జిల్లా (18 March 2019). "మారనున్న తాజ్ బంజారా చెరువు రూపురేఖలు". www.ntnews.com. Archived from the original on 16 December 2019. Retrieved 16 December 2019.