బండారుపల్లి (ఏర్పేడు మండలం)
స్వరూపం
బండారుపల్లి, తిరుపతి జిల్లా, ఏర్పేడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
| బండారుపల్లి | |
| — రెవిన్యూయేతర గ్రామం — | |
| ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
| అక్షాంశరేఖాంశాలు: 13°40′40″N 79°38′14″E / 13.677878°N 79.637235°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | తిరుపతి |
| మండలం | ఏర్పేడు |
| ప్రభుత్వం | |
| - సర్పంచి | |
| జనాభా (2001) | |
| - మొత్తం | 4,000 |
| - గృహాల సంఖ్య | 1,800 |
| పిన్ కోడ్ | 517 620 |
| ఎస్.టి.డి కోడ్: 08578 | |
దర్శనీయ ప్రదేశాలు/ దేవాలయాలు
[మార్చు]బండారుపల్లి గ్రామంలో శ్రీకృష్ణాశ్రమం ఉంది. ఇది శ్రీ రామానందగిరి స్వామిచే నడుపబడుతోంది. ఈ ఆశ్రమంలో శ్రీకృష్ణ, రాధా దేవతలు ఉంటారు. కేవలం శ్రీకృష్ణ దేవాలయం మాత్రమే కాదు, శ్రీరామ మందిరం, నాగాలమ్మ దేవాలయం, అంకమ్మ దేవాలయం, గురుప్పస్వామి దేవాలయం, వినాయక దేవాలయం, గంగమ్మ గుడి వంటి అనేక దేవాలయాలు ఉన్నాయి.
ప్రధాన పంటలు
[మార్చు]బండారుపల్లి గ్రామంలో వేరుశనగ పంట, వరి పంటలు ప్రధాన పంటలు.
రవాణా సదుపాయం
[మార్చు]ఈ గ్రామానికి, మండలంలోని ఇతర గ్రామాలకు రోడ్డు సౌకర్యముంది. ఆర్టీసి బస్సులు ఉన్నాయి. ఈ గ్రామానికి ఏర్పేడు, రాచగున్నేరి రైల్వే స్టేషనులు సమీపంలో ఉన్నాయి.