బండా శ్రీనివాస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బండా శ్రీనివాస్

ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
23 జులై 2021 - ప్రస్తుతం
ముందు పిడమర్తి రవి

వ్యక్తిగత వివరాలు

జననం 2 జూన్ 1969
హుజూరాబాద్ , కరీంనగర్ జిల్లా , తెలంగాణ రాష్ట్రం
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి బండా సువర్ణ
సంతానం సింధుజ, సాయి కుమార్
నివాసం హుజూరాబాద్
వృత్తి రాజకీయ నాయకుడు

బండా శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 23 జులై 2021న తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ (ఎస్సీ కార్పొరేషన్) చైర్మన్‌గా నియమితుడయ్యాడు.[1]

జననం, విద్యాభాస్యం[మార్చు]

బండా శ్రీనివాస్‌ 2 జూన్ 1969లో తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా, హుజూరాబాద్ లో జన్మించాడు. ఆయన కరీంనగర్ లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి, డిగ్రీ ని కొన్ని కారణాల వల్ల మధ్యలో ఆపేశాడు.

రాజకీయ జీవితం[మార్చు]

బండా శ్రీనివాస్‌ 1984లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేశాడు. ఆయన కాంగ్రెస్ అనుబంధ విభాగం ఎన్.ఎస్.యూ.ఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా, 1992 నుండి 1995 వరకు హుజూరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరక్టర్‌గా, 1995 నుండి 2000 వరకు హుజూరాబాద్ ఎంపీటీసీ సభ్యుడిగా, 1996 నుండి 1999 వరకు జిల్లా టెలికాం బోర్డు సభ్యుడిగా పని చేశాడు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 2001లో కేసీఆర్ ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. ఆయన 2006 నుండి 2011 వరకు హుజూరాబాద్ ఎంపీటీసీ సభ్యుడిగా, 2007 నుండి 2015 వరకు రెండుసార్లు హుజూరాబాద్ మండలాధ్యక్షుడిగా, 2015 నుండి 2018 వరకు కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా, 2018 నుండి రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా వివిధ హోదాల్లో పని చేశాడు.ఆయన 23 జులై 2021న తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ (ఎస్సీ కార్పొరేషన్) చైర్మన్‌గా నియమితుడయ్యాడు.[2][3][4][5] బండా శ్రీనివాస్‌ హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని సంక్షేమ భవన్‌లో 30 జులై 2021న చైర్మన్‌గా భాద్యతలు స్వీకరించాడు.[6][7]

మూలాలు[మార్చు]

  1. Sakshi (23 July 2021). "తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా బండా శ్రీనివాస్‌". Archived from the original on 24 July 2021. Retrieved 24 July 2021.
  2. నమస్తే తెలంగాణ (23 July 2021). "తెలంగాణ ఎస్సీ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా బండా శ్రీనివాస్". Archived from the original on 24 July 2021. Retrieved 24 July 2021.
  3. Mana Telangana (23 July 2021). "ఎస్‌సి కార్పొరేషన్ ఛైర్మన్ గా బండా శ్రీనివాస్". Archived from the original on 24 జూలై 2021. Retrieved 24 July 2021.
  4. Telangana Today (23 July 2021). "Banda Srinivas appointed as TSSCDC Chairman". Archived from the original on 24 July 2021. Retrieved 24 July 2021.
  5. Andrajyothy (24 July 2021). "'ఎస్సీ కార్పొరేషన్‌' హుజూరాబాద్‌ వాసికే". andhrajyothy. Archived from the original on 24 జూలై 2021. Retrieved 24 July 2021.
  6. Namasthe Telangana (30 July 2021). "ఉద్యమకారులకు సముచిత స్థానం : మంత్రి కొప్పుల". Archived from the original on 30 July 2021. Retrieved 30 July 2021.
  7. Namasthe Telangana (30 July 2021). "ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా బండ శ్రీనివాస్‌ బాధ్యతల స్వీకరణ". Archived from the original on 31 July 2021. Retrieved 31 July 2021.