బంతి
Jump to navigation
Jump to search
బంతి (Ball) ఒక ఆట వస్తువు. సహజముగా అవి గుండ్రముగ ఉండును; కానీ కొన్ని కోలగా ఉంటాయి. చాలా ఆటలలో ఆటగాళ్ళు బంతిని కొట్టడం గానీ, తన్నడం గానీ లేదా చేతితో విసరడం గానీ చేస్తారు. గాజు గోళీకాయలు కూడా ఒక రకమైన బంతులే. లోహాలతో చేసిన గుండ్లు ఇంజినీరింగ్ రంగంలో బేరింగులు (Ball bearings) గా చాలా యంత్రాలలో రాపిడిని తగ్గించడానికి ఉపయోగిస్తారు.
ఎక్కువ ఆటలాడే బంతులు రబ్బరుతో తయారుచేస్తారు. కొన్నింటిలో గాలి అధిక పీడనంలో లోపలికి పంపి గట్టిదనాన్ని కలిగిస్తారు. కొన్నింటి లోపల ఖాళీగా ఉంచితే కొన్నింటిలో బిరడా వంటి పదార్ధాన్ని నింపుతారు. ప్రాచీన కాలంలో బంతుల్ని తోలు లేదా బ్లాడర్ తో తయారుచేసి మధ్యలో వివిధ రకాల గడ్డి వంటివి లోపల కూరి తయారుచేశారు.
బంతాటలు
[మార్చు]- క్రికెట్, ఫుట్ బాల్, బాస్కెట్ బాల్, వాలీ బాల్, హాకీ, బాల్ బాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, హేండ్ బాల్, థ్రో బాల్, గోల్ఫ్, పోలో, రగ్బీ, లాన్ టెన్నిస్ మొదలైనవి ప్రసిద్ధిచెందిన బంతి ఆటలు.
గ్యాలరీ
[మార్చు]-
2006 ఫిఫా ఫుట్బాల్ ఆటలో వాడిన అధికారిక బంతి
-
Computed tomography of a football (soccer) (Video)
-
గోల్ఫ్ క్ర్రీడలో వాడే బంతి రంధ్రము పక్కనే ఉన్న దృశ్యం