బందరు లడ్డు
బందరు లడ్డు | |
---|---|
వివరణ | శనగ పప్పు, బెల్లం పాకం, నెయ్యి తో తయ్యారు చేసిన లడ్డు |
రకం | హార్టికల్చర్ ఆహారం |
ప్రాంతం | కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ |
దేశం | భారతదేశం |
నమోదైంది | 2017 |
పదార్థం |
బందరు లడ్డు, ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం నగరానికి చెందిన లడ్డు. దీనికి ఆంధ్రప్రదేశ్ నుండి ఆహార పదార్థాలు వర్గంలో భౌగోళిక సూచనలో ఒకటిగా, భౌగోళిక సూచిక రిజిస్ట్రీ నమోదు చేసింది.[1][2]
మల్లయ్య స్వీట్స్ అధ్యక్షుడు గౌరా వెంకటేశ్వర రావు నేతృత్వంలోని బృందావనపురం బందరు లడ్డూ తయారీదారుల సంక్షేమ సంఘం ‘బందరు లడ్డు’ కోసం భౌగోళీక గుర్తింపు ట్యాగ్ ఘనత సంపాదించారు.[3]
బందరు లడ్డూకి 77 సంవత్సరాల చరిత్ర ఉంది. దిల్లీ సుల్తానుల కాలంలో మహారాష్ట్ర - మధ్యప్రదేశ్ సరిహద్దున ఉండే బుందేల్‌ఖండ్ ప్రాంతం నుంచి మచిలీపట్నంలోని బందరుకు వలస వచ్చిన బొందిలీలు ఈ లడ్డు తయారీ ప్రారంభించారని చరిత్రకారులు చెబుతున్నారు. మొదట్లో సన్నకారప్పూసని తయారుచేసిన ఆ కుటుంబం.ఆ పూసని బెల్లంపాకంతో కలిపి తొక్కి లడ్డూలని తయారుచేసి తొక్కుడు లడ్లు చేశారని తయారీదారులు చెబుతున్నారు. ఇక్కడి నుంచి అమెరికా, లండన్‌తోపాటు ఐరోపా దేశాలకు ఏటా పదివేల కిలోల లడ్డు ఎగుమతి అవుతోంది.[4]
మూలాలు
[మార్చు]- ↑ ":::GIR Search:::". ipindiaservices.gov.in. Archived from the original on 8 మే 2017. Retrieved 5 May 2017.
- ↑ Naidu, T. Appala. "Bandar laddu gets GI tag". The Hindu (in ఇంగ్లీష్). Retrieved 5 May 2017.
- ↑ "బందరు లడ్డు | కృష్ణా జిల్లా , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము | ఇండియా". Retrieved 2020-08-26.
- ↑ "Bundar Laddu ….బందరు లడ్డు". www.telugukiranam.com. Archived from the original on 2021-06-15. Retrieved 2020-08-26.