Jump to content

బంద్

వికీపీడియా నుండి

బంద్ నిజానికి ఒక హిందీ పదం, దీని అర్థం మూసివేయడం. ఇది భారతదేశం, నేపాల్ వంటి దక్షిణాసియా దేశాల్లో రాజకీయ ఉద్యమకారులు ఉపయోగించే ఒక నిరసన యొక్క ఒక రూపం. బంద్ సమయంలో ఒక రాజకీయ పార్టీ లేదా ఒక సంఘం సాధారణ సమ్మె ప్రకటిస్తుంది. భారత్ బంద్ అని ప్రకటిస్తే భారతదేశం అంతటా బంద్ చేయాలని సూచించినట్టు, రాష్ట్ర బంద్ అని ప్రకటిస్తే రాష్ట్రం అంతటా బంద్ చేయాలని సూచించినట్టు, జిల్లా బంద్ అని ప్రకటిస్తే జిల్లా అంతటా బంద్ చేయాలని సూచించినట్టు, ఈ విధంగా బంద్ ఒక నిర్ధిష్ట ప్రాంతంలో చేయాలని ముందుగా ప్రకటిస్తారు. తరచుగా సంఘం లేదా రాజకీయ పార్టీ బంద్ ప్రకటించినప్పుడు సాధారణ ప్రజలు కార్యాలయ పనులు మాని ఇంటి వద్దే ఉండాలని ఆశిస్తారు. అత్యంత ప్రభావం దుకాణదారులపై పడుతుంది, బంద్ చేసేవారు బంద్ సమయములో దుకాణాలు మూయమని చెబుతారు, అలాగే ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేరవేసే వాహనదారులకు వాహనాలు నడపవద్దని చెబుతారు. బంద్ అనగా శక్తివంతమైన అర్థములో శాసనోల్లంఘన. ఎందుకంటే నిరసన సాధనలలో బంద్ చాలా భయానకమైనది, స్థానిక సమాజంపై విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తుంది.

బంద్ అనగా మూసివేయడం. బంద్ సమయంలో ఎటువంటి ఆర్థిక పరమైన లావాదేవిలు జరగకుండా నిర్భంధించడం. ఎవరికి వారు స్వచ్ఛందంగా ఇటువంటి నిర్ణయాన్ని తీసుకుంటే దానిని స్వచ్ఛంద బంద్ అని, బలవంతంగా ఇటువంటి నిర్ణయాన్ని తీసుకుంటే దానిని నిర్భంధ బంద్ అని అంటారు. ప్రభుత్వంపై తమ తీవ్రమైన వ్యతిరేకతా భావాన్ని ఈ రూపంలో ప్రదర్శిస్తారు.

"https://te.wikipedia.org/w/index.php?title=బంద్&oldid=2888557" నుండి వెలికితీశారు