Jump to content

బచ్చలి కుటుంబము

వికీపీడియా నుండి
తీగ బచ్చలి

బచ్చలి కుటుంబము - ఈ కుటుంబములో బెద్ద చెట్లు లేవు. ఆకులు లఘు పత్రములు. ఒంటరి చేరిక, వీనికి గణుపు పుచ్చములుండవు. కొన్నిటి పువ్వులు మిధున పుష్పములు. కొన్నిటిలో ఏక లింగ పుష్పములే గలవు. పుష్పకోశము నీచము, మూడు మొదలైదు వరకు తమ్మెలుండును. లేద, రక్షక పత్రములు విడివిడిగానే వుండును. ఇవి మొగ్గలలో అల్లుకొని యుండును. ఆకర్షణ పత్రములు లేవు. కింజల్కములు రక్షక పత్రముల కెదురుగా నుండును. అండాశయము ఉచ్చము. ఒక గది అండము ఒకటి ఫలము పేటికా ఫలము; సాధారణముగ పుష్ప కోశములోనె మరుగు పడి యుండును.

బచ్చల కాడలో నాలౌగైదు రకములు గలవు. వీనిలో ముఖ్యమైనది పెద్ద బచ్చలి. దీనిని తీగె ముక్కలు నాటియే పెంచ వచ్చును. ఆకులు కాడలు కండ కలిగి యుండును.

ఎర్ర బచ్చలి, మట్టు బచ్చలి అంతగా వాడుట లేదు. వీనిని గింజలను పాతి మొలపింతురు. పాదులు పెట్టకనే డొంకల వద్ద మలచు బచ్చలి కాడ ఇంత కంటే సన్నముగానుండును. తినుటకును అంత బాగుండదు.

ఈల కూర కొమ్మమీద ఆకులు దూర దూరముగ నుండును. వీనిని కూర వండుకొని తిందురు. 1871 - 72 వ సంవత్సరములలో క్షామము పట్టినపుడు ధనికులు కూడనీయాకులను దినిరట. ఈ మొక్కలు పెరుగుటకు వర్షము లేకున్నను అంత ఇబ్బంది లేదు. ఈ ఆకుల రసమును పండ్ల జబ్బులకు మంచి దందురు. ఇది సముద్ర తీరమునందు పెరుగుటచే గాజు చేయుటకు బనికి వచ్చు పదార్థము దీని యందు మెండుగా కలుగు చున్నచి.