Jump to content

బడిత

వికీపీడియా నుండి
(బడిత పూజ నుండి దారిమార్పు చెందింది)

కంకుల నుండి గింజలు వేరు చేయడానికి ఉపయోగించే వంకర తిరిగిన కర్రను బడిత అంటారు. పాత రోజులలో కంకుల నుండి ఉదాహరణకు రాగి, సజ్జ వంటి కంకుల నుండి విత్తనాలు వేరుచేయడానికి పెద్ద కల్లాన్ని ఏర్పాటు చేసుకుని దానిపై కంకులను వేసి ఎద్దుల ద్వారా కంకుల గుండు అనే వెడల్పు ఎక్కువగా ఉండే ఒక పెద్ద రాతి చక్రం ను తిప్పేవారు. ఈ విధంగా కంకుల గుండును తిప్పడం వలన కంకుల నుండి విత్తనాలు వేరవుతాయి. అయితే ఈ విధానం వలన కంకుల నుండి అన్ని గింజలు వేరుకాక కంకులకు అక్కడక్కడా కొన్ని గింజలు అత్తుకొని ఉంటాయి. కంకులకు అక్కడక్కడా అతుక్కొని ఉన్న గింజలను కూడా రాలగొట్టేందుకు బడితను ఉపయోగించేవాళ్ళు. ఈ బడిత కోసం ఎక్కువగా వేప, చింత ఇంకా చాలా రకాల కర్రలను ఉపయోగించేవారు. ఈ కర్ర చేతితో గట్టిగా పట్టుకునేందుకు, నేలపై ఉన్న కంకులను కొట్టేందుకు వీలుగా కొద్దిగా వంకర తిరిగి ఉంటుంది. కలంలో మిగిలిన గింజలను రాలగొట్టేందుకు బడితతో కూర్చుని నడుస్తూ లేక వంగి కంకులను కొట్టేందుకు వీలుగా ఉండే 3 నుంచి 5 అడుగుల పొడవు ఉన్న బడితలను ఉపయోగించేవారు.

బడిత పూజ

[మార్చు]

విత్తనాలు రాలగొట్టడానికి ఉపయోగించే బడిత నుండే బడితపూజ అనే పదం వాడుకలోనికి వచ్చింది. బడిత పూజ అంటే మనుషులను లేదా జంతువులను సక్రమమైన మార్గంలో నడిపేందుకు కర్రతో కొట్టడం.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=బడిత&oldid=3879581" నుండి వెలికితీశారు