బయో ఆసియా సదస్సు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బయో ఏషియా సదస్సు అనేది ఆసియాలో అతిపెద్ద లైఫ్‌-సైన్సెస్‌, హెల్త్‌కేర్‌ ఫోరం. జీవశాస్ర్తాలు, ఔషధ రంగానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రతిష్ఠాత్మకంగా ఈ సదస్సును నిర్వహిస్తోంది. అడ్వాన్సింగ్‌ ఫర్‌ వన్‌-షేపింగ్‌ ది నెక్స్‌ జనరేషన్‌ ఆఫ్‌ హ్యూమనైజ్డ్‌ హెల్త్‌కేర్‌ అనే థీమ్​తో నిర్వహించబడే ఈ సదస్సులో దేశవిదేశాల నుంచి టెక్నాలజీ, హెల్త్‌కేర్‌ రంగాల సంస్థలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారు.

2022[మార్చు]

హైదరాబాద్‌ వేదికగా 2022 ఫిబ్రవరి 24 ప్రారంభమై వర్చువల్‌ పద్ధతిలో రెండు రోజులపాటు జరిగింది.[1] ఈ బయో ఏషియా సదస్సు-2022 (19వ ఎడిషన్‌) లో దేశవిదేశాల నుంచి టెక్నాలజీ, హెల్త్‌కేర్‌ రంగాల సంస్థలకు చెందిన దాదాపు 50 మంది ప్రముఖులు పాల్గొన్నారు. తొలిరోజు సాంకేతికత ద్వారా ఆరోగ్య పరిశ్రమలను బలోపేతం చేయడం, కొవిడ్‌ వ్యాక్సిన్‌ అభివృద్ధి, హెల్త్‌కేర్‌ డెలివరీ సిస్టమ్‌ను క్రమబద్ధీకరించడం.. అంశాలపై ప్రత్యేక చర్చ జరుగింది. రెండో రోజున ‘ఔషధ రంగంలో పరిశోధన, అభివృద్ధి - నిన్న, నేడు, రేపు’ అనే అంశంపై కీలక చర్చ జరిగింది. బయో ఆసియా సదస్సుకు సంబంధించిన పూర్తివివరాలకు http://bioasia.in/ Archived 2022-02-10 at the Wayback Machine వెబ్సైట్ లో చూడవచ్చు.

2023[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని హెచ్‌ఐసీసీలో 2023 ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు 20వ ఎడిషన్ బయో ఏషియా సదస్సు-2023 జరుగింది.[2] మానవీయ ఆరోగ్య పరిరక్షణలో భవిష్యత్తు తరానికి మార్గదర్శనం అనే నినాదంతో నిర్వహించబిన ఈ సదస్సులో 50 దేశాల నుంచి దాదాపు 5,600 మంది (సగటున రోజూ 1100 మంది సందర్శన) ప్రభుత్వ ప్రముఖులు, పరిశ్రమల అధిపతులు, పరిశోధకులు, వ్యవస్థాపకులు, నోబెల్‌ పురస్కార విజేతలు, శాస్త్రవేత్తలు, ఇతర ప్రతినిధుల పాల్గొన్నారు.[3] ఈ సదస్సులో రెండురోజులపాటు లైఫ్‌సైన్సెస్‌, ఫార్మా, పరిశ్రమ రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశాలు, మూడోరోజు వివిధ కంపెనీలకు చెందిన ప్రదర్శన, జీనోమ్‌ వ్యాలీ ఎక్స్‌లెన్స్‌ అవార్డు ప్రదానోత్సవం జరిగాయి.

మూలాలు[మార్చు]

  1. India, The Hans (2022-02-23). "KTR to inaugurate BioAsia 2022 today". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2022-02-24.
  2. G 2346, Naga Sridhar (2022-08-24). "BioAsia 2023 to be held in February 24-26". www.thehindubusinessline.com (in ఇంగ్లీష్). Archived from the original on 2022-08-24. Retrieved 2023-02-24.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  3. telugu, NT News (2022-08-24). "ఫిబ్రవరిలో బయో ఏషియా సదస్సు". Namasthe Telangana. Archived from the original on 2022-08-24. Retrieved 2023-02-24.