Jump to content

బర్రె సుగంధిపాల

వికీపీడియా నుండి

బర్రె సుగంధిపాల
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
డెకాలెపిస్
Species:
D. hamiltonii
Binomial name
Decalepis hamiltonii
బర్రె సుగంధిపాల

బర్రె సుగంధిపాల లేదా మారేడు గడ్డలు ఒక రకమైన ఔషధ మొక్క. దీని శాస్త్రీయనామం డెకాలెపిస్ హెమిల్ టోనై (Decalepis hamiltonii). ఇది అపోసైనేసి కుటుంబానికి చెందినది.

దీని మాదిరిగా ఉండే నిజమైన సుగంధి పాల మొక్క హెమిడెస్మస్ ఇండికస్ ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తారంగా పెరుగుతుంది.

ప్రాంతీయ నామాలు

[మార్చు]
  • సంస్కృతం : స్వేత సెరివా
  • కన్నడం : మహాకాలి బిరు
  • తమిళం : మాహాలి కిజాంగు
  • మలయాళం : నన్నారి, నారు నింతి

లక్షణాలు

[మార్చు]
  • ఈ తీగ జాతికి చెందిన బహువార్షిక మొక్క 5-15 మీటర్ల ఎత్తు పెరుగుతుంది.
  • ఆకులు కణుపుకు రెండు చొప్పున చివర భాగము ఎక్కువ వెడల్పుగా ఉంటాయి.
  • పుష్పాలు చిన్నవిగా నూగు కలిగివుంటార్యి. ఇవి ఆకుల మొదలులో గుత్తులుగా ఉండి ఆకుపచ్చ లేదా గోధుమ రంగు అంచులతో ఉంటాయి.
  • ఫలదీకరణం తర్వాత పుష్పం నుంచి జంటగా కాయలు ఏర్పడతాయి. వీటిని డైవారికేట్ ఫాలికిల్స్ అంటారు. కాయలు పసుపు రంగులోకి మారి ఎండి ఒకవైపు పగిలి విత్తనాలు వెదజల్లుతాయి.
  • విత్తనాలు అండాకారంలో ఉండి తెలుపురంగు పట్టులాంటి కేశాలను కలిగివుంటాయి. వీటిని కోమోన్ విత్తనాలు అంటారు.
  • వేర్లు మొక్క మొదలౌ నుండి ఒక గుత్తిలాగ 8-15 మీటర్ల వరకు వచ్చి 5-10 సెం.మీ. లావు అవుతూ భూమిలోకి 2-3 అడుగుల వరకు సమాంతరంగా పెరుగుతూ పోతాయి. వీటిని గిచ్చితే పాలు వస్తాయి.

ఉపయోగాలు

[మార్చు]

వీటి వేర్లలో 2-హైడ్రాక్సీ 4-మిథాక్సీ బెంజాల్డిహైడ్ ఉంటుంది. ఇది రక్త శుద్ధి, రక్తహీనత, కామెర్లు, దగ్గు, జ్వరం, ఊపిరితిత్తుల వ్యాధులు, చర్మవ్యాధులు, వేసవి పానీయాల తయారీలో ఉపయోగిస్తున్నారు.