Jump to content

బల్గేరియాలో హిందూమతం

వికీపీడియా నుండి
దేవనాగరిలో "ఓం" గుర్తు

బల్గేరియాలో హిందూ మతం చిన్న మతం. బల్గేరియాలో హిందూమతం ఇస్కాన్ ద్వారా వ్యాపించింది. ఇస్కాన్ 1996 నుండి బల్గేరియాలో పనిచేస్తోంది.

బల్గేరియాలో భారతీయులు

[మార్చు]

బల్గేరియాలో 141 మంది భారతీయులు నివసిస్తున్నారు. [1] దేశంలో హిందూ దేవాలయాలు లేవు. [1]

బల్గేరియాలో రథయాత్ర

[మార్చు]

బల్గేరియాలో కృష్ణ భక్తులు జరుపుకునే ప్రధాన వైష్ణవ ఉత్సవాల్లో రథయాత్ర ఒకటి. దీనికి పొరుగున ఉన్న నార్త్‌ మాసిడోనియా, సెర్బియాల నుండి కూడా భక్తులు హాజరవుతారు.

బల్గేరియాలో మొదటి రథయాత్ర 1996లో నిర్వహించారు. 2008 మార్చి వరకు, బల్గేరియాలో పన్నెండు రథయాత్ర ఉత్సవాలు జరుపుకున్నారు. బల్గేరియన్ రథయాత్ర ఉత్సవం బాల్కన్‌ దేశాల్లో మొదటిది.

మూలాలు 

[మార్చు]
  1. "137 Indians, 350 Chinese Work in Bulgaria". novinite.com.