బల్వంత్ పరేఖ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బల్వంత్ పరేఖ్
బల్వంత్ పరేఖ్
జననం
బలవంతరాయ్ కళ్యాణ్‌జీ పరేఖ్

1925 (1925)
మహువా, భావ్‌నగర్, గుజరాత్, భారతదేశం
మరణం2013 జనవరి 25(2013-01-25) (వయసు 87–88)
ముంబై, భారతదేశం
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లుబి కె పరేఖ్
సుపరిచితుడు/
సుపరిచితురాలు
పిడిలైట్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు
పిల్లలు
  • మధుకర్ పరేఖ్
  • అజయ్ పరేఖ్

బల్వంతరాయ్ కళ్యాణ్‌జీ పరేఖ్ (1925 - 25 జనవరి 2013) భారతీయ పారిశ్రామికవేత్త, పిడిలైట్ ఇండస్ట్రీస్ స్థాపకుడు. ఇతన్ని "ఇండియాస్ ఫెవికాల్ మ్యాన్" అని పిలుస్తారు.[1]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

బల్వంత్ భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలోని భావ్‌నగర్ జిల్లాలోని మహువ పట్టణంలోని జైన కుటుంబంలో జన్మించాడు.[2] అతని తాత న్యాయమూర్తి. అతను మహువాలో తన పాఠశాల విద్యను పూర్తి చేసాడు, ముంబైలోని ప్రభుత్వ న్యాయ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. బల్వంత్‌ చదువుతున్నప్పుడే కాంతాబెన్‌ను వివాహం చేసుకున్నాడు. ఇతను చదువును మధ్యలో మానేసి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు. బల్వంత్‌ ఎప్పుడూ లా ప్రాక్టీస్ చేయలేదు, అతను ఎప్పుడు బిజినెస్ మ్యాన్ కావాలనే కళలు కనేవాడు. ముంబైలోని డైయింగ్, ప్రింటింగ్ ప్రెస్ సంస్థలలో పనిచేశాడు, కలప వ్యాపారి ఆఫీసులో ప్యూన్ గా పనిచేసాడు. ఉండడానికి ఇల్లు లేక స్నేహితుని గోదాంలో భార్యతో కలిసి ఉన్నాడు. అతను పనిచేస్తున్న సంస్థలో పరిచయాలు పెంచుకొని జర్మనీకి వెళ్ళాడు.

పిడిలైట్ ఇండస్ట్రీస్

[మార్చు]

జర్మనీకి చెందిన హోకిక్ట్ కంపెనీకి ఇండియాలో రిప్రజెంట్ గా ఉన్న కంపెనీలో చేరాడు. 1954లో బల్వంత్ తన సోదరుడు సుశీల్‌తో కలిసి ముంబైలోని జాకబ్ సర్కిల్‌లో డై, ఇండస్ట్రియల్ కెమికల్స్, పిగ్మెంట్ ఎమల్షన్స్ యూనిట్ వ్యాపారం, తయారీని ప్రారంభించాడు, దానికి అతను పరేఖ్ డైచెమ్ ఇండస్ట్రీస్ అని పేరు పెట్టాడు.[3] ఇందులో వచ్చిన లాభాలతో 1959 లో పిడిలైట్ కంపెనీని స్థాపించాడు.[4] బల్వంత్ సింథటిక్ రెసిన్ తో తెల్లటి ఫెవికాల్ గ్లూ ని తయారు చేసాడు. ఫెవికాల్ తయారుచేయకముందు భారతదేశంలో జంతువుల కొవ్వుతో గ్లూ తయారుచేసేవారు. జర్మనీలో మోవికాల్ పేరుతో గ్లూ కంపెనీ ఉండేది దాని పేరును ఆదర్శంగా తీసుకోని ఫెవికాల్ అనే పేరును పెట్టాడు. ఆ తరువాత వరుసగా ఫెవిక్విక్, ఎంసీల్ కూడా మార్కెట్లోకి వచ్చాక పిడిలైట్ షేర్ విలువ 70 శాతం వరకు పెరిగింది. ఈ కంపెనీ 1989లో ఫెవిక్రిల్ యాక్రిలిక్ కలర్స్ ట్రాన్స్పోర్ట్ ఫ్యాబ్రిక్ అండ్ మల్టి సర్ఫేస్ పెయింటింగ్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఎఫ్ఈ బ్రాండ్ వ్యాగన్ ఇయర్ బుక్-1997 ప్రకారం దేశంలోని టాప్ 15 ఇండియన్ బ్రాండ్స్ లో ఒకటిగా నిలిచింది. 2006 నుండి పిడిలైట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, యునైటెడ్ స్టేట్స్, థాయిలాండ్, దుబాయ్, ఈజిప్టు, బాంగ్లాదేశ్ లో ఫ్యాక్టరీలను స్థాపించింది. సింగపూర్ లో పరిశోధన కేంద్రమును కూడా స్థాపించింది.

విరాళాలు, దాతృత్వం

[మార్చు]

మహువలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీని ప్రారంభించడంలో బల్వంత్ సహకారం అందించాడు. భావ్‌నగర్‌లోని సైన్స్ సిటీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించడానికి అతను 2 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చాడు, గుజరాతీ సాహిత్య పరిషత్‌కు కూడా విరాళంగా ఇచ్చాడు. 2009లో, అతను వడోదరలో బల్వంత్ పరేఖ్ సెంటర్ ఫర్ సైకాలజీని స్థాపించాడు.[5]

అవార్డులు, గుర్తింపులు

[మార్చు]
  • జె. టాల్బోట్ విన్సెల్ అవార్డు - 2011.
  • అతను ఫోర్బ్స్ ఇండియా జాబితాలో భారతదేశంలోని 45వ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచాడు.[6]

కుటుంబం

[మార్చు]

బల్వంత్‌కు ఒక కుమార్తె కల్పనా పరేఖ్, ఇద్దరు కుమారులు మధుకర్ పరేఖ్, అజయ్ పరేఖ్ వీరు కుటుంబ వ్యాపారం పిడిలైట్ ఇండస్ట్రీస్‌లో భాగంగా ఉన్నారు. బల్వంత్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీకి సన్నిహిత మిత్రుడు, ముంబైలోని కార్మైకేల్ రోడ్‌లోని ఉషాకిరణ్ బిల్డింగ్‌లోని అదే అపార్ట్‌మెంట్ బ్లాక్‌లో నివసించాడు.[7] బల్వంత్ 25 జనవరి 2013న 88 సంవత్సరాల వయస్సులో మరణించాడు.[8]

యాడ్స్

[మార్చు]

మొదటి సారి 1970 లో దూరదర్శన్ లో ఫెవికాల్ యాడ్స్ వచ్చాయి, 1990 లో వచ్చిన యాడ్స్ లో యే ఫెవికాల్ కా మజ్బూత్ జోడ్ హై టూటేగా నహీఅనే డైలాగ్స్ చాల ఫేమస్ అయ్యి కస్టమర్లు కూడా పెరిగారు.

మూలాలు

[మార్చు]
  1. Karmali, Naazneen. "Balvant Parekh, India's Fevicol Man, Dies". Forbes. Retrieved 2023-05-28.
  2. "Balvanth". www.thebusinesstycoons.com. Archived from the original on 2022-10-20. Retrieved 2023-05-28.
  3. "Balvant Parekh: A Legacy That Sticks". Forbes India. Retrieved 2023-05-28.
  4. "Shri Balvantray Kalyanji Parekh – Founder & Chariman| Pidilite". Pidilite. Archived from the original on 2023-05-28. Retrieved 2023-05-28.
  5. "Profile". web.archive.org. 2015-01-09. Archived from the original on 2015-01-09. Retrieved 2023-05-28.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  6. "Balvant Parekh". Forbes. Retrieved 2023-05-28.
  7. "Fevicol fame Pidilite Industry's founder Balvantbhai Parekh passes away". DeshGujarat. 2013-01-26. Retrieved 2023-05-28.
  8. Kar, Prafulla C. (2013-01-01). "Obituary notice (Balvant K. Parekh: 1924-2013)". ETC.: A Review of General Semantics. 70 (1): 69–71.