బసాబీ నంది

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కబితా
జననం(1939-09-05)1939 సెప్టెంబరు 5
మరణం2018 జూలై 22(2018-07-22) (వయసు 78)
వృత్తినటి
సుపరిచితుడు/
సుపరిచితురాలు
బాన్ పలాషిర్ పడబలి (1974)

బసాబీ నంది, (1939 డిసెంబరు 5 - 2018 జూలై 22) బెంగాలీ సినిమా నటి, గాయని.

జననం, విద్య

[మార్చు]

బిసాబీ నంది 1935, డిసెంబరు 5న బంగ్లాదేశ్ లోని ఢాకాలో జన్మించింది. తండ్రి బిఎల్ నంది ఢాకాలో వైద్యుడిగా పనిచేశాడు. బిసాబీ కోల్‌కతాలోని యునైటెడ్ మిషనరీ గర్ల్స్ హైస్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తిచేసింది.[1] ఆ తర్వాత అసుతోష్ కళాశాల నుండి ఐఏ ఉత్తీర్ణత సాధించింది.

సినిమారంగం

[మార్చు]

బిసాబీ నందికి చిన్నప్పటి నుంచి పాటలు, శాస్త్రీయ నృత్యాలపై ఆసక్తి ఉండేది. సతీనాథ్ ముఖోపాధయ్, ఉత్పల సేన్ ల దగ్గర బెంగాలీ పాటలు నేర్చుకుంది. గవిందన్ కుట్టి నుండి పాఠాలు నేర్చుకుంది. 1958లో అనంత సింగ్ తన జమలాయే జిబంత మానుష్ సినిమా కోసం బిసాబీని ఎంపిక చేశాడు.[2] ఉత్తమ్ కుమార్‌తో కూడా కొన్ని సినిమాల్లో నటించింది, ప్లేబ్యాక్ సింగర్‌గా కూడా పనిచేసింది. తన స్వంత సంగీత రికార్డులను వెలువరించింది. 1974లో బాన్ పలాషిర్ పడబలి సినిమాలో నటించి బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ద్వారా ఉత్తమ సహాయ నటి అవార్డును అందుకుంది.

సినిమాలు (పాక్షిక జాబితా)

[మార్చు]
  • జమలయే జిబంత మానుష
  • మృతే మార్టీ ఆగమాన్
  • అభయ ఓ శ్రీకాంత
  • సఖేర్ చోర్
  • "దో దిలోన్ కి దస్తాన్" (హిందీ)
  • బాఘిని
  • నబరాగ్
  • కాయ హినేర్ కహినీ
  • బోన్ పలాశిర్ పడబలి
  • ఆమి సిరాజేర్ బేగం
  • రోదనభార బసంత
  • సే చోఖ్
  • రేటర్ కుహేలి
  • శత్రు పఖా
  • గజముక్త
  • ఆమీ సే ఓ సఖా

మరణం

[మార్చు]

బిసాబీ నంది 2018 జూలై 22న పశ్చిమ బెంగాలీలోని కలకత్తాలో మరణించింది.

మూలాలు

[మార్చు]
  1. "Ascension to the celebration". December 31, 2011. Retrieved 2022-03-27.
  2. "Blast from the Past: Devanthakudu (1960)". March 10, 2016. Retrieved 2022-03-27.

బయటి లింకులు

[మార్చు]