బస్తీ (2015 సినిమా)
బస్తీ | |
---|---|
దర్శకత్వం | వాసు మంతెన |
రచన | వాసు మంతెన |
నిర్మాత | వాసు మంతెన |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | గుణశేఖర్ |
కూర్పు | గౌతంరాజు |
సంగీతం | ప్రవీణ్ ఇమ్మడి |
నిర్మాణ సంస్థ | వజ్మన్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 3 జూలై 2015 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బస్తీ 2015లో విడుదలైన తెలుగు సినిమా. వజ్మన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వాసు మంతెన నిర్మించి, దర్శకత్వం వహించాడు. నందు, శ్రేయన్, అభిమన్యు సింగ్, కోట శ్రీనివాసరావు, ప్రగతి, ముఖేష్ రుషి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జులై 03, 2015న విడుదలైంది.[1]
కథ
[మార్చు]భిక్షపతి (కోట శ్రీనివాసరావు) వర్గం, అమ్మిరాజు (ముఖేష్ రుషి) వర్గం రెండు వైరివర్గాల మధ్యం నిత్యం తగాదాలు చోటు చేసుకుంటాయి. అయితే ఇరు వర్గాల పెద్దలూ ఈ గొడవలన్నింటికీ స్వస్తి పలికి ఎవరికి వారుగా జీవిస్తుంటారు. కానీ భిక్షపతి కొడుకు భవాని (అభిమన్యు సింగ్) మాత్రం ఆ రెండు వర్గాల మధ్య గొడవలు అయ్యేందుకు రెచ్చగొట్టే పనులు చేస్తూనే ఉంటాడు. భవానికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో అమ్మిరాజు, అతని చెల్లైన స్రవంతి (ప్రగతి చౌరస్య) ని కిడ్నాప్ చేస్తాడు. ఆ సమయంలోనే అమెరికా నుండి విజయ్ (శ్రేయాన్) తన ఇంటికి వస్తాడు.ఒకరోజు అనుకోకుండా తమ ఇంట్లో కిడ్నాప్‌కు గురైన స్రవంతిని విజయ్ చూసి ఆమెను ప్రేమిస్తాడు.[2][3]
నటీనటులు
[మార్చు]- శ్రేయన్
- ప్రగతి
- అభిమన్యు సింగ్
- కోట శ్రీనివాసరావు
- ముఖేష్ రుషి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్:వజ్మన్ ప్రొడక్షన్స్
- నిర్మాత: వాసు మంతెన
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వాసు మంతెన
- సంగీతం:ప్రవీణ్ ఇమ్మడి
- సినిమాటోగ్రఫీ: గుణశేఖర్
- ఎడిటర్: గౌతంరాజు
మూలాలు
[మార్చు]- ↑ Teluguwishesh (3 July 2015). "The full telugu review of Basthi movie | telugu movie reviews | shreyan | pragathi | jayasudha". Archived from the original on 11 సెప్టెంబరు 2021. Retrieved 11 September 2021.
- ↑ The Times of India (3 July 2015). "Basthi Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes". Archived from the original on 11 సెప్టెంబరు 2021. Retrieved 11 September 2021.
- ↑ Indiaherald (3 July 2015). "Basthi Telugu Movie Review, Rating" (in ఇంగ్లీష్). Archived from the original on 11 సెప్టెంబరు 2021. Retrieved 11 September 2021.