బాచిన చెంచుగరటయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాచిన చెంచుగరటయ్య

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1983, 1985, 1994,1999
నియోజకవర్గం అద్దంకి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 24 జనవరి 1946
జే.పంగులూరు గ్రామం, జే.పంగులూరు మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు బాచిన రాఘవయ్య, కాంతమ్మ
జీవిత భాగస్వామి రత్నకుమారి
సంతానం ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు

బాచిన చెంచుగరటయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అద్దంకి నియోజకవర్గం నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.[1]

జననం, విద్యాభాస్యం[మార్చు]

బాచిన చెంచుగరటయ్య 24 జనవరి 1946లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, జే.పంగులూరు మండలం, జే.పంగులూరు గ్రామంలో బాచిన రాఘవయ్య, కాంతమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన ఎంబీబీఎస్‌ పూర్తి చేసి డాక్టరుగా కొన్నేళ్లపాటు వైద్యునిగా ప్రాక్టీస్‌ చేశాడు.[2]

రాజకీయ జీవితం[మార్చు]

బాచిన చెంచుగరటయ్య 1974లో జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1978లో జరిగిన ఎన్నికల్లో జేఎన్‌పీ తరపున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కరణం బలరామకృష్ణమూర్తి చేతిలో 5150 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 1983లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కరణం బలరామకృష్ణమూర్తి పై 3394 ఓట్లు మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. బాచిన చెంచుగరటయ్య 1985, 1994, 1999 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

మూలాలు[మార్చు]

  1. Sakshi (19 March 2019). "మళ్ళీ అదే రిపీట్‌ అవుద్ది..!". Archived from the original on 9 December 2021. Retrieved 9 December 2021.
  2. Sakshi (18 March 2019). "ఎన్నికల బరిలో గెలుపు గుర్రాలు". Archived from the original on 16 September 2021. Retrieved 17 September 2021.