Jump to content

బాద్‌షాహీ అషుర్‌ఖానా

వికీపీడియా నుండి
బాద్‌షాహీ అషుర్‌ఖానా
Native name
అషుర్‌ఖానా
బాద్‌షాహీ అషుర్‌ఖానా
ప్రదేశంహైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
నిర్మించినది1594

బాద్‌షాహీ అషుర్‌ఖానా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని చార్మినార్ సమీపంలోఉన్న షియా ముస్లిం సంతాప ప్రదేశం. ఇమామ్ హుస్సేన్ అమరవీరుల జ్ఞాపకార్థం నిర్మించబడిన ఈ ప్రదేశాన్ని మొహర్రం పండుగ సందర్భంగా ఉపయోగిస్తారు.[1][2][3]

చరిత్ర

[మార్చు]

ముహమ్మద్ కులీ కుతుబ్ షా ఆధ్వర్యంతో 1594లో దీని నిర్మాణం ప్రారంభం కాగా, చార్మినార్ నిర్మించిన మూడు సంవత్సరాల తరువాత 1611లో నిర్మాణం పూర్తయింది.[4] 1611లో అబ్దుల్లా కుతుబ్ షా ఆధ్వర్యంలో అద్భుతమైన రంగు టైల్-మొజాయిక్ అలంకరణ పూర్తయింది. 1764లో నిజాం రాజు నిజాం అలీ ఖాన్ అసఫ్ ఝా II కాలంలో చెక్క కొలొనేడ్లు, బయటి గదులు, ప్రవేశ ద్వారం నిర్మించబడ్డాయి.[5]

స్మారక చిహ్నం

[మార్చు]

అషుర్‌ఖానాలో నియాజ్ ఖానా (సమర్పణ స్థలం), నకార్ ఖానా (డ్రమ్స్ ప్లేస్), సారై ఖానా (భక్తుల కోసం), అబ్దర్ ఖానా (తాగునీటి ప్రదేశం), లంగర్ ఖానా (ఆహార వడ్డించే ప్రదేశం), మకాన్-ఎ-ముజావర్ (ముజావర్ నివాసం), దఫ్తార్-ఎ-ముజావర్ (ముజావర్ కార్యాలయం), అలవా చాబుత్రా, భద్రత గది మొదలైనవి ఉన్నాయి.[6]

ఇతర వివరాలు

[మార్చు]
Hyderabad, Badshahi Ashurkhana
  1. ఇది ఇప్పుడు వారసత్వ ప్రదేశంగా గుర్తింపబడింది.
  2. పూర్వీకుల వంశపారంపర్యంగా ముతవల్లి ముజావర్ మీర్ నవాజిష్ అలీ మూస్వి 11వ తరం సంరక్షకుడితోపాటు రాష్ట్ర పురావస్తు శాఖ, మ్యూజియం దీనిని చూసుకుంటుంది.[7]

మూలాలు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
  1. "INTACH awards presented". The Hindu. Archived from the original on 13 డిసెంబరు 2006. Retrieved 19 June 2020.
  2. "Rediscovering the heritage of the city". The Hindu. Archived from the original on 8 November 2011. Retrieved 19 June 2020.
  3. Bilgrami, Syed Ali Asgar (1992). Landmarks of the Deccan: A Comprehensive Guide to the Archaeological Remains of the City and Suburbs of Hyderabad (in ఇంగ్లీష్). Asian Educational Services. ISBN 9788120605435.
  4. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (9 October 2016). "భాగ్యనగరాన్ని నాశనం చేసిన ఔరంగజేబు..చార్మినార్‌ను మాత్రం వదిలేశాడెందుకు". Archived from the original on 19 June 2020. Retrieved 19 June 2020.
  5. "Heritage Walk in Hyderabad – Badshahi Ashurkhana".
  6. "Remove encroachments at Ashoor Khana: HC". Times of India. Archived from the original on 2014-02-02. Retrieved 19 June 2020.
  7. "Logo for state archaeology after 90 years". Times of India. Archived from the original on 2012-10-22. Retrieved 19 June 2020.