Jump to content

బాణుడు

వికీపీడియా నుండి
(బానభట్టుడు నుండి దారిమార్పు చెందింది)

బాణభట్టుడు ప్రాచీన భారతదేశపు ప్రముఖ సంస్కృత పండితుడు. యితడు నేటి బీహారు రాష్ట్రం ఛాప్రా జిల్లా ప్రీతికూట గ్రామంలో జన్మించాడు. ఇతడు హర్షవర్ధనుడు ఆస్థాన కవిగా గౌరవించబడ్డాడు. సా.శ.7 వ శతాబ్దములో నివసించాడు. కాదంబరి, హర్షచరిత్ర గ్రంథాలను రచించాడు. ఇవే కాకుండా చండికా శతకము, పార్వతీ పరిణయం అనే నాటకాన్ని కూడా రచించాడు. బాణోచ్ఛిష్టం జగత్‌సర్వం-బాణుని ఎంగిలే ఈ జగత్తంతా అన్న లోకోక్తికి బాణుడు వర్ణించనిది లోకంలో లేదని అర్థం. అంతటి సుప్రసిద్ధి పొందిన బాణభట్టుడు సంస్కృతంలో కాదంబరి అనే వచన కావ్యం, హర్ష చరిత్రమనే కావ్యం రచించారు.

సంస్కృత కవులలో ముఖ్యంగా సంస్కృతాన గద్య కవులలో బాణునికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. దీనికి కారణం బాణుడు మొట్టమొదటి చారిత్రక కావ్య రచయిత, మొట్టమొదటి స్వీయ చరిత్ర నిర్మాత కావడం. పదమూడు శతాబ్దాలుగా వాఙ్మయ రచయితగా అత్యున్నత స్థానంలో ఉన్నాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

శీవత్స గోత్రీకుడైన బాణుడు బీహారు రాష్ట్రంలో చాప్రా జిల్లాలో సోణా (సౌన్) నదీ తీరంలో ఉన్న పృధుకూట గ్రామంలో జన్మించాడు. ఈ గ్రామాన్ని ప్రస్తుతం ప్రీతికూటగా పిలుస్తున్నారు. ఈయన తలిదండ్రులు చిత్రభానుడు, రాజదేవి. చిన్నతనంలో విద్యాభ్యాసం అంతా తండ్రి వద్దనే నడిచింది. తల్లిదండ్రులు చిన్న తనంలోనే మరణించుట వలన దేశ సంచారానికి బయలుదేరాడు. దేశ సంచారంలో అనేకమంది వ్యక్తులు, పండితుల పరిచయంతో అనేక విద్యాపద్ధతులు, అనుభవాలతో తనకు సహజంగా ఉన్న ప్రతిభను మెరుగుపరుచుకొన్నాడు.

బాణుడు కామ, అర్ధ, రాజనీతి, అలంకార శాస్త్రాలను అభ్యసించాడు. అతడి ప్రతిభా విశేషాలను విన్న స్థానేశ్వరం రాజు హర్షవర్ధనుడు అతడిని తన ఆస్థాన కవిగా ఉండమని ఆహ్వనించాడు. రాజాస్థానంలో అనేక సన్మానాలు పొంది కొంతకాలం అనంతరం తన స్వగ్రామానికి వెళ్లి అక్కడి జనుల కోరిక మేరకు హర్షుని జీవిత చరిత్రను కావ్య రూపంగా రచిస్తూ వారికి వినిపించాడు. దానికి సంతసించిన హర్షుడు అనేక బహుమానాలను, బంగారాన్ని కానుకలుగా సమర్పించాడని ఒక కథనం.

బాణుణి కాలం హర్షవర్ధనుని కాలంలో కనుక సా.శ. 606 నుండి 648 వరకూ ఉండవచ్చునని చరిత్రకారుల అంచనా. బాణుడు హర్షచరిత్రతోపాటు కాదంబరిని కూడా రచించాడు. అయితే ఈ రెండూ కూడా అసంపూర్తి గ్రంథాలుగా వదిలేసాడు. దీనికి కారణం నడుస్తున్న చరిత్రను కథా వస్తువుగా తీసుకోవడమనేది ఒక ఊహ. తరువాత సాహిత్యాభిమనుల కోరిక మీద అతని పుత్రుడైన భూషణభట్టు పూర్తిచేసాడు. ఇతడిని ఇంకా పుళింద, పుళింద్ర పేర్లతో పిలుస్తారు. అతడు అచ్చంగా తండ్రి శైలితోనే కావ్యాన్ని పూర్తిచేసి పండితుల ప్రసంసలు పొందాడు.

రచనలు

[మార్చు]
  • కాదంబరి - ఈ వచన కావ్యాన్ని పూర్తిచేయముందే మరణించాడు. ఇతని కుమారుడు భూషణభట్టుడు పూర్తి చేసాడు.
  • హర్ష చరిత్ర - హర్షవర్ధనుడి చరిత్ర.

బయటి లంకెలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. The Harsa-Carita of Bana. Translated by E. B. Cowell and F. W. Thomas. London: Royal Asiatic Society, 1897, 4-34.
"https://te.wikipedia.org/w/index.php?title=బాణుడు&oldid=3496117" నుండి వెలికితీశారు