బాబ్ ఫోస్సే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాబ్ ఫోస్సే
బాబ్ ఫోస్సే (పాల్ జోయ్, 1963)
జననం
రాబర్ట్ లూయిస్ ఫోస్సే

(1927-06-23)1927 జూన్ 23
చికాగో, ఇల్లినాయిస్‌, యుఎస్
మరణం1987 సెప్టెంబరు 23(1987-09-23) (వయసు 60)
వృత్తి
క్రియాశీల సంవత్సరాలు1947–1987
జీవిత భాగస్వామి
  • మేరీ ఆన్ నైల్స్
    (m. 1947; div. 1951)
  • జోన్ మెక్‌క్రాకెన్
    (m. 1952; div. 1959)
  • గ్వెన్ వెర్డాన్
    (m. 1960)
భాగస్వామిఆన్ రీంకింగ్ (1972–1978)
పిల్లలునికోల్ ఫోస్సే

రాబర్ట్ లూయిస్ ఫోస్సే (1927, జూన్ 23 – 1987, సెప్టెంబరు 23) అమెరికన్ సినిమా-నాటకరంగ దర్శకుడు, నటుడు, నృత్యదర్శకుడు.[1] ది పైజామా గేమ్ (1954), డామ్ యాన్కీస్ (1955), హౌ టు సక్సీడ్ ఇన్ బిజినెస్ వితౌట్ రియల్లీ ట్రైయింగ్ (1961), స్వీట్ ఛారిటీ (1966), పిప్పిన్ (1972), చికాగో (1975), స్వీట్ ఛారిటీ (1969), క్యాబరేట్ (1972), లెన్ని (1975), ఆల్ దట్ జాజ్ (1979), స్టార్ 80 (1983) మొదలైన సినిమాలకు దర్శకత్వం వహించాడు.

1973లో ఒకే సంవత్సరంలో ఆస్కార్, ఎమ్మీ, టోనీ అవార్డులను గెలుచుకున్న ఏకైక వ్యక్తి ఫోస్సే. నాలుగు అకాడమీ అవార్డులకు నామినేట్ అవ్వడంతోపాటు క్యాబరే సినిమాకు ఉత్తమ దర్శకుడిగా అకాడమీ అవార్డును గెలుపొందాడు. 1980లో ఆల్ దట్ జాజ్ సినిమాకు పామ్ డి'ఓర్ అవార్డును గెలుచుకున్నాడు. తన కొరియోగ్రఫీకి రికార్డుస్థాయిలో ఎనిమిది టోనీ అవార్డులను గెలుచుకున్నాడు.

జననం[మార్చు]

ఫోస్సే 1927, జూన్ 23న సిరిల్ కింగ్స్లీ ఫోస్సే - సారా ఆలిస్ "సాడీ" దంపతులకు ఇల్లినాయిస్‌లోని చికాగో నగరంలో జన్మించాడు.[2] ఆరుగురు పిల్లలలో ఇతడు ఐదవవాడు.[1][3][4]

మరణం[మార్చు]

ఫోస్సే 1987 సెప్టెంబరు 23న గుండెపోటుతో జార్జ్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయ హాస్పిటల్‌లో మరణించాడు. నేషనల్ థియేటర్‌ సమీపంలో స్వీట్ ఛారిటీ పునరుద్ధరణ ప్రారంభించే[1] సమయంలో విల్లార్డ్ హోటల్ సమీపంలో వెర్డాన్ చేతుల్లో కుప్పకూలిపోయాడు.[5]

ఫోస్సే కోరినట్లుగా లాంగ్ ఐలాండ్‌లోని అట్లాంటిక్ మహాసముద్రంలో ఇతని చితాభస్మం కలుపబడింది.[6]

నాటకరంగం[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర వేదిక మూలాలు
1947 కాల్ మీ మిస్టర్ ప్రదర్శకుడు - కోరస్ జాతీయ పర్యటన
1948 మేక్ మైన్ మాన్హాటన్ ప్రదర్శకుడు జాతీయ పర్యటన
1950 డాన్స్ మీ ఏ సాంగ్ ప్రదర్శకుడు - నర్తకుడు రాయల్ థియేటర్, బ్రాడ్‌వే [7]
1951 బిలియన్ డాలర్ బేబీ నటుడు - చాంప్ వాట్సన్ ఆల్విన్ థియేటర్, బ్రాడ్‌వే [8]
1952 పాల్ జోయ్ నటుడు - జోయ్ ఎవాన్స్ (అండర్ స్టడీ) బ్రాడ్‌హర్స్ట్ థియేటర్, బ్రాడ్‌వే
1954 పైజామా గేమ్ నృత్య దర్శకుడు
1955 డామన్ యాన్కీస్ నృత్య దర్శకుడు అడెల్ఫీ థియేటర్, బ్రాడ్‌వే
1956 బెల్స్ ఆర్ రింగింగ్ కో-కొరియోగ్రాఫర్ ఆల్విన్ థియేటర్, బ్రాడ్‌వే
1958 న్యూ గర్ల్ ఇన్ టౌన్ నృత్య దర్శకుడు 46వ వీధి థియేటర్, బ్రాడ్‌వే
1959 రెడ్ హెడ్ దర్శకుడు, కొరియోగ్రాఫర్
1961 ది కంక్వేరింగ్ హీరో కొరియోగ్రాఫర్ (అన్‌క్రెడిటెడ్) ఎఎన్టిఏ థియేటర్, బ్రాడ్‌వే
1961 హౌ టు సక్సీడ్ ఇన్ బిజినెస్ వితౌట్ రియల్లీ ట్రైయింగ్ నృత్య దర్శకుడు 46వ వీధి థియేటర్, బ్రాడ్‌వే
1962 లిటిల్ మీ కో-డైరెక్టర్, కో-కొరియోగ్రాఫర్ లంట్-ఫోంటానే థియేటర్, బ్రాడ్‌వే
1963 పాల్ జోయ్ జోయ్ ఎవాన్స్ న్యూయార్క్ సిటీ సెంటర్, బ్రాడ్‌వే
1965 ప్లెజర్స్ ఆండ్ ప్యాలసెస్ దర్శకుడు, కొరియోగ్రాఫర్ ఫిషర్ థియేటర్, డెట్రాయిట్ [9]
1966 స్వీట్ ఛారిటీ దర్శకుడు, కొరియోగ్రాఫర్ ప్యాలెస్ థియేటర్, బ్రాడ్‌వే
1972 పిప్పిన్ పుస్తకం (అన్‌క్రెడిటెడ్), డైరెక్టర్, కొరియోగ్రాఫర్ ఇంపీరియల్ థియేటర్, బ్రాడ్‌వే
1972 లిజా దర్శకుడు, కొరియోగ్రాఫర్ వింటర్ గార్డెన్ థియేటర్, బ్రాడ్‌వే [10]
1975 చికాగో పుస్తకం; దర్శకుడు, కొరియోగ్రాఫర్ 46వ వీధి థియేటర్, బ్రాడ్‌వే
1978 డ్యాన్స్ దర్శకుడు, కొరియోగ్రాఫర్ అంబాసిడర్ థియేటర్, బ్రాడ్‌వే
1986 బిగ్ డీల్ దర్శకుడు, కొరియోగ్రాఫర్ బ్రాడ్‌వే థియేటర్, బ్రాడ్‌వే

సినిమాలు[మార్చు]

సంవత్సరం పేరు దర్శకుడు రచయిత నృత్య దర్శకుడు నటుడు పాత్ర మూలాలు
1953 ది అఫైర్స్ ఆఫ్ డోబీ గిల్లిస్ Yes చార్లీ ట్రాస్క్
1953 కిస్ మి కేట్ Yes హార్టెన్సియో
1953 గీవ్ ఏ గర్ల్ ఏ బ్రేక్ Yes బాబ్ డౌడీ
1955 మై సిస్టర్ఎలీన్ Yes Yes ఫ్రాంక్
1957 పైజామా గేమ్ Yes
1958 డామన్ యాన్కీస్ Yes Yes మంబో డాన్సర్ (అన్‌క్రెడిటెడ్)
1969 స్వీట్ ఛారిటీ Yes Yes
1972 క్యాబరే Yes Yes
1974 లిటిల్ ప్రిన్స్ Yes Yes నటుడు - ది స్నేక్
1974 లెన్ని Yes Yes ఇంటర్వ్యూయర్ (వాయిస్, గుర్తింపు లేనిది)
1977 థీవ్స్ Yes మిస్టర్ డే
1979 ఆల్ దట్ జాజ్ Yes Yes Yes
1983 స్టార్ 80 Yes Yes

టెలివిజన్[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర ఇతర వివరాలు మూలాలు
1950 ది జార్జ్ బర్న్స్ అండ్ గ్రేసీ అలెన్ షో భార్య మేరీ ఆన్ నైల్స్‌తో కలిసి డ్యాన్స్ రొటీన్ ఎపిసోడ్: గ్రేసీ ది ఆర్టిస్ట్
1959 స్టార్ట్ టైం దర్శకుడు ఎపిసోడ్: ది వండర్‌ఫుల్ వరల్డ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్
1972 లిజా విత్ ఏ జెడ్ దర్శకుడు టెలివిజన్

అవార్డులు[మార్చు]

సంవత్సరం అవార్డు విభాగం సినిమా ఫలితం
1972 అకాడమి పురస్కారం ఉత్తమ దర్శకుడు క్యాబరే విజేత
1974 లెన్ని నామినేట్
1979 ఆల్ దట్ జాజ్ నామినేట్
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే నామినేట్
1955 టోనీ అవార్డు ఉత్తమ కొరియోగ్రఫీ పైజామా గేమ్ విజేత
1956 డామన్ యాన్కీస్ విజేత
1957 బెల్స్ ఆర్ రింగింగ్ నామినేట్
1958 న్యూ గర్ల్ ఇన్ టౌన్ నామినేట్
1959 రెడ్ హెడ్ విజేత
1963 సంగీతానికి ఉత్తమ దర్శకత్వం లిటిల్ మీ నామినేట్
ఉత్తమ కొరియోగ్రఫీ విజేత
1964 ఉత్తమ సంగీత దర్శకత్వం పాల్ జోయ్ నామినేట్
1966 సంగీతానికి ఉత్తమ దర్శకత్వం స్వీట్ ఛారిటీ నామినేట్
ఉత్తమ కొరియోగ్రఫీ విజేత
1973 సంగీతానికి ఉత్తమ దర్శకత్వం పిప్పిన్ విజేత
ఉత్తమ కొరియోగ్రఫీ విజేత
1976 సంగీతానికి సంబంధించిన ఉత్తమ పుస్తకం చికాగో నామినేట్
సంగీతానికి ఉత్తమ దర్శకత్వం నామినేట్
ఉత్తమ కొరియోగ్రఫీ నామినేట్
1978 సంగీతానికి ఉత్తమ దర్శకత్వం డ్యాన్స్ నామినేట్
ఉత్తమ కొరియోగ్రఫీ విజేత
1986 సంగీతానికి సంబంధించిన ఉత్తమ పుస్తకం బిగ్ డీల్ నామినేట్
సంగీతానికి ఉత్తమ దర్శకత్వం నామినేట్
ఉత్తమ కొరియోగ్రఫీ విజేత
1973 ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డు అత్యుత్తమ వెరైటీ, సంగీతం లేదా హాస్యం లిజా విత్ ఏ జెడ్ విజేత
కామెడీ, వెరైటీ లేదా సంగీతంలో అత్యుత్తమ దర్శకత్వం విజేత
అత్యుత్తమ కొరియోగ్రఫీ విజేత

1973 అకాడమీ అవార్డులలో క్యాబరే సినిమాకు ఉత్తమ దర్శకుడిగా అకాడమీ అవార్డును గెలుచుకున్నాడు. 1973లో పిప్పిన్ సినిమాకు దర్శకత్వం, కొరియోగ్రఫీ విభాగంలో టోనీ అవార్డులను గెలుచుకున్నాడు. లిజా విత్ ఎ జెడ్ అనే టెలివిజన్ ప్రత్యేక కార్యక్రమానికి నిర్మాణం, కొరియోగ్రఫీ, దర్శకత్వం విభాగంలో ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డులను గెలుచుకున్నాడు. ఒకే సంవత్సరంలో మూడు ప్రధాన సినీ అవార్డులను గెలుచుకున్న ఏకైక వ్యక్తి ఫోస్సే.

2007 ఏప్రిల్ 27న న్యూయార్క్‌ నగరం, సరాటోగా స్ప్రింగ్స్‌లోని నేషనల్ మ్యూజియం ఆఫ్ డ్యాన్స్‌లో చేర్చబడ్డాడు. 1994లో స్థాపించబడిన లాస్ ఏంజిల్స్ డ్యాన్స్ అవార్డ్స్‌ను "ఫోస్సే అవార్డ్స్" అని పిలిచేవారు. ప్రస్తుతం దీనిని అమెరికన్ కొరియోగ్రఫీ అవార్డ్స్ అని పిలుస్తున్నారు. బాబ్ ఫోస్సే-గ్వెన్ వెర్డాన్ ఫెలోషిప్‌ను ఇతని కుమార్తె నికోల్ ఫోస్సే 2003లో ఆల్విన్ ఐలీ అమెరికన్ డ్యాన్స్ థియేటర్‌లో స్థాపించారు.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 McQuiston, John T. (September 24, 1987). "Bob Fosse, Director and Choreographer, Dies". The New York Times. Robert Louis Fosse was born in Chicago on June 23, 1927, the son of a vaudeville entertainer. He began performing on the vaudeville circuit as a child, and by the age of 13 he was a seasoned veteran of many burlesque shows. ...
  2. Gottfried 2003, p. 11.
  3. "Hardcover in Brief". The Washington Post. November 18, 1990. Archived from the original on November 2, 2012. Retrieved 2023-06-02.
  4. Garraty, John Arthur; Carnes, Mark C. (1999). American National Biography. ISBN 9780195127874.
  5. Hall, Charles and Stevenson, Douglas. "Bob Fosse Dies After Collapsing on D.C. Street" The Washington Post, September 24, 1987
  6. Gottfried 2003, pp. 449–50.
  7. "Dance Me a Song – Broadway Musical – Original | IBDB".
  8. IBDb profile: Max Goberman; accessed 2023-06-02.
  9. Suskin, Steven. "Frank Loesser" Show Tunes : The Songs, Shows, and Careers of Broadway's Major Composers (2010), (books.google.com), Oxford University Press, ISBN 0-19-988615-6, p.242
  10. "Liza with a 'Z". The Internet Movie Database. 2008. Retrieved 2023-06-02.

బయటి లింకులు[మార్చు]