బారిల్ వన్నెహసాంగి
బారిల్ వన్నెహసాంగి | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 మార్చి 08 | |||
ముందు | లాల్బియాక్జామా | ||
---|---|---|---|
శాసన సభ్యురాలు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2023 డిసెంబరు 08 | |||
ముందు | ఎఫ్.లాల్నున్మావియా | ||
నియోజకవర్గం | ఐజ్వాల్ సౌత్ 3 | ||
ఐజ్వాల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్
| |||
పదవీ కాలం 2021 ఫిబ్రవరి 18 – 2023 | |||
ముందు | సి. లాల్తన్‌సంగ | ||
నియోజకవర్గం | వార్డు నెం. 19 | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఐజ్వాల్, మిజోరం | 1991 ఫిబ్రవరి 28||
జాతీయత | భారతీయురాలు | ||
రాజకీయ పార్టీ | జోరం పీపుల్స్ మూవ్‌మెంట్ | ||
పూర్వ విద్యార్థి | నార్త్-ఈస్టర్న్ హిల్ యూనివర్సిటీ | ||
వృత్తి | టీవీ వ్యాఖ్యాత , రేడియో జాకీ, రాజకీయ నాయకురాలు |
బారిల్ వన్నెహసాంగి, మిజోరం రాష్ట్రానికి చెందిన టీవీ వ్యాఖ్యాత , రేడియో జాకీ, రాజకీయ నాయకురాలు. ఆమె 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఐజ్వాల్ సౌత్ 3 శాసనసభ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై,[1] 2024 మార్చి 7న మిజోరం శాసనసభకు మొదటి మహిళా అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికై అధికారంలో కొనసాగుతుంది.[2]
రాజకీయ జీవితం
[మార్చు]బారిల్ వన్నెహసాంగి 2021లో రాజకీయాల్లోకి వచ్చి ఐజ్వాల్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ అభ్యర్థిగా పోటీ చేసి వార్డు నంబర్ XIX నుండి కార్పొరేటర్‌గా ఎన్నికైంది. ఆమె 2023లో ఎన్నికల్లో ఐజ్వాల్ సౌత్ 3 శాసనసభ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్రంలోనే అత్యంత పిన్న వయసు గల ఎమ్మెల్యేగా రికార్డు నెలకొల్పింది.[3][4]
బారిల్ వన్నెహసాంగి 40 మంది సభ్యులున్న మిజోరం రాష్ట్ర అసెంబ్లీకి మొదటిసారిగా 2024 మార్చి 7న మహిళ స్పీకర్‌గా నియమితురాలై రికార్డు నెలకొల్పింది.[5]
మూలాలు
[మార్చు]- ↑ NDTV (6 December 2023). "Meet Baryl Vanneihsangi, The Youngest MLA Of Mizoram". Archived from the original on 11 March 2024. Retrieved 11 March 2024.
- ↑ NTV Telugu (9 March 2024). "జయహో నారీమణి.. చిన్న వయసులో స్పీకర్‌గా ఎన్నిక". Archived from the original on 11 March 2024. Retrieved 11 March 2024.
- ↑ Financialexpress (6 December 2023). "Meet Baryl Vanneihsangi, an RJ-turned-politician and youngest woman MLA of Mizoram" (in ఇంగ్లీష్). Archived from the original on 11 March 2024. Retrieved 11 March 2024.
- ↑ Andhrajyothy (5 December 2023). "ఎవరీ బేరిల్ వన్నెహసాంగి.. టీవీ యాంకర్ నుంచి ఎమ్మెల్యేగా ఎలా ఎదిగింది?". Archived from the original on 11 March 2024. Retrieved 11 March 2024.
- ↑ Zee News Telugu (9 March 2024). "యాంకర్ నుంచి స్పీకర్‌గా.. మిజోరాంలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం". Archived from the original on 11 March 2024. Retrieved 11 March 2024.