బార్డ్ (చాట్‌బాట్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


బార్డ్ అనేది LaMDA (డైలాగ్ అప్లికేషన్స్ కోసం బాషా నమూనా), కుటుంబం ఆధారంగా గూగుల్ చే అభివృద్ధి చేయబడిన ఒక కృత్రిమ మేధస్సు చాట్‌బాట్[1][2], ఫిబ్రవరి 6న, గూగుల్ బార్డ్‌ను ప్రకటించింది, మేలో ఇతర దేశాలకు విడుదల చేయడానికి ముందు 2023 మార్చిలో పరిమిత సామర్థ్యంతో విడుదల చేయబడింది. 2023లో, కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలో మే 10న జరిగిన గూగుల్ I/Oలో ఇది అధికారికంగా ప్రజలకు అందించబడింది. 180 దేశాలలోని వినియోగదారులందరికీ విడుదల చేసింది[3].బార్డ్ ప్రయోగాత్మకమైనది, కొన్ని ప్రతిస్పందనలు సరికానివి కావచ్చు.

నేపథ్యం

[మార్చు]

చాట్ జీపీటీ(ChatGPT)కి పోటీగా గూగుల్ విడుదల చేసినది, ఇది మనుషులతో మాట్లాడగలిగే సామర్థ్యం కలిగిన టెక్నాలజీ అయిన LaMDA ఆధారంగా పనిచేస్తుంది[4], ఆరేళ్లుగా ఏఐపై కృషి చేస్తున్న గూగుల్ AI చాట్‌బాట్ ప్రాజెక్ట్ అభివృద్ధిలో కంపెనీ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్ పాలుపంచుకున్నారని గూగుల్ CEO సుందర్ పిచాయ్ పేర్కొన్నారు,దాదాపు చాట్‍‍జీపీటీలానే గూగుల్ బార్డ్ ఉపయోగపడుతుంది. ఏదైనా ప్రశ్నను టెక్స్ట్ ద్వారా అడిగితే సమాధానాన్ని కృత్రిమ మేధస్సు ద్వారా వివరంగా ఇస్తోంది, ‘వెబ్‌ నుంచి అధిక నాణ్యత కలిగిన సమాచారాన్ని అందించడమే లక్ష్యంగా బార్డ్‌ను డిజైన్ చేసినట్టు ముఖ్య కార్య నిర్వాహణా అధికారి సుందర్ పిచాయ్ వెల్లడించారు

మూలాలు

[మార్చు]
  1. "Google Bard AI: కొత్త అప్‌డేట్‌తో బార్డ్ మరింత పవర్‌ఫుల్.. గూగుల్ సీఈఓ పిచాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు". News18 Telugu. Retrieved 2023-05-12.
  2. "Bard". bard.google.com (in ఇంగ్లీష్). Retrieved 2023-05-12.
  3. "Google Bard: గూగుల్ బార్డ్ వచ్చేసింది.. ఎలా ఉపయోగించాలంటే?". EENADU. Retrieved 2023-05-12.
  4. "Google: గూగుల్ నుంచి బార్డ్ ఏఐ, చాట్ జీపీటీకి పోటీ". The Economic Times Telugu. Retrieved 2023-05-12.