బార్హస్పత్య సూత్రములు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బార్హస్పత్య సూత్రములు లేదా లోకాయత సూత్రములు హైందవ నాస్తిక తత్వం అయిన చార్వాక తత్త్వానికి, భౌతికవాదానికి మూలాలు.

ఈ సూత్రాల ప్రకారం, పంచమహాభూతాలు ఐన భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం తప్పితే, ఈ సృష్టిలో ఏమీ లేదు. ఈ అంశాల కలయికతోనే చైతన్య శక్తి, బుద్ధి జనిస్తుంది.

చార్వాకం ప్రకారం

యావజ్జీవేత్ సుఖం జీవేత్ జీవోన్నాస్తి మృత్యురాగోచర:

భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుత:

తాత్పర్యము: జీవితమంతయు సుఖముగ జీవించు. మృత్యువు కంటిచూపు నుండి తప్పించుకొనే జీవుడు లేడు. శ్మశానంలో కాలి బూడిదై పోయిన తర్వాత ఈ దేహము మరల తిరిగి వచ్చునా?

యావజ్జీవేత్ సుఖం జీవేత్ ఋణం కృత్వా ఘృతం పిబేత్

భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుత:

తాత్పర్యము: జీవితమంతయు సుఖముగ జీవించు. అప్పు తెచ్చుకొనైనా నేతిని సేవించు. శ్మశానంలో కాలి బూడిదై పోయిన తర్వాత ఈ దేహము మరల తిరిగి వచ్చునా?

న స్వర్గో నాపవర్గోవ నైవాత్మా పారలౌకిక:

నైవ వర్ణాశ్రమాదీనాం క్రియాశ్చ ఫలదాయికా:

తాత్పర్యము: స్వర్గం అనేది లేదు, ఉపవర్గాలు లేవు, ఆత్మ లేదు, పరలోకము లేదు, మోక్షము లేదు. వర్ణాలు, వారి వృత్తులు, వాటివలన కలిగే ఫలాలు కూడా లేవు.

అగ్నిహోత్రం త్రయో వేదాస్త్రిదండం భస్మప్రగుంఠనం

బుద్ధిపౌరుష హీనానం జీవికా ధాతృనిర్మితా

తాత్పర్యము: అగ్నిహోత్రాదులు, యజ్ఞాలు, (ఋగ్, యజుర్, సామ) వేదాలు, యజ్ఞఓపవీతాలు, భస్మలేపనాలు ఇవన్నియు బుద్ధి లేనివారు, మనుషులు కాని వారు బ్రతకలేక, ఇతరులను మూర్ఖులు చేసి బ్రతుకుదెరువు పొందాలనుకొనే బ్రాహ్మలు సృష్టించినవి.


సర్వదర్శన సంగ్రహంలో వీటి ప్రస్తావన ఉన్నది కానీ, సంపూర్ణంగా సూత్రముల ఆనవాలు లేవు.

నాస్తిక దర్శనాలలో చార్వాకం, బౌద్ధం, జైనం వస్తాయి. ఇవి వేదాల ప్రమాణాలను విశ్వసించవు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]