Jump to content

బాలాకోట్ యుద్ధం

అక్షాంశ రేఖాంశాలు: 34°00′12″N 71°22′43″E / 34.0034°N 71.3786°E / 34.0034; 71.3786
వికీపీడియా నుండి
బాలాకోట్ యుద్ధం
సిక్కు ఆఫ్ఘను యుద్ధంలో భాగము

బాలాకోట్ వద్ద యుద్ధ భూమి
తేదీ1831 మే 6
ప్రదేశంబాలాకోట్
34°00′12″N 71°22′43″E / 34.0034°N 71.3786°E / 34.0034; 71.3786
ఫలితంSikh victory
ప్రత్యర్థులు
సిక్ఖు సామ్రాజ్యంముజాహిదీన్
సేనాపతులు, నాయకులు
షేర్ సింగ్
హరిసింగ్ నల్వా
ఇలాహీ బక్ష్
Syed Ahmad Barelvi
Shah Ismail Dehlvi

బాలాకోట్ యుద్ధం 1831 మే 6 న మన్సెహ్రా జిల్లాలోని బాలాకోట్‌లో మహారాజా రంజిత్ సింగ్ కు, సయ్యద్ అహ్మద్ బరేల్వీల మధ్య జరిగింది. బరేల్వీ సిక్కులకు వ్యతిరేకంగా జిహాద్ ప్రకటించి బాలాకోట్‌లో శిబిరాన్ని ఏర్పాటు చేశాడు. షా ఇస్మాయిల్ దేహెల్వీ, అతని గిరిజనులతో కలిసి బరేల్వీ, తెల్లవారుజామున సిక్కులపై దాడి చేశాడు. రోజంతా యుద్ధం కొనసాగింది. సిక్కు సైనికులు చివరికి సయ్యద్ అహ్మద్ బరేల్వీని పట్టుకుని శిరచ్ఛేదం చేశారు. వందలాది మంది అతని అనుచరులను చంపేసారు.[1][2][3]

యుద్ధం

[మార్చు]

1831 మే 6 న, సయ్యద్ అహ్మద్ బరేల్వీకి చెందిన ముజాహిదీన్ దళాలు మన్‌సేహ్రా పర్వత లోయలోని బాలాకోట్ వద్ద అంతిమ యుద్ధానికి సిద్ధమయ్యాయి. సిక్కు దళాలు మెటికోట్ కొండ నుండి బాలాకోట్ వద్దకు చేరుకోవడం ప్రారంభించాయి. సయ్యద్ అహ్మద్, చాలా మంది ముజాహిదీన్ దళాలు మస్జిద్-ఎ-బాలా, ఆ చుట్టుపక్కల ఉన్నాయి. ముజాహిదీన్ దళం సత్బాన్ జలపాతం వెంబడి చాలా దూరంలో ఉంది. సయ్యద్ అహ్మద్ అకస్మాత్తుగా మస్జిద్-ఎ-బాలా నుండి సిక్కులపై దాడి వెడలి, మస్జిద్-ఇ-యారిన్ చేరుకున్నాడు. ఆపై అతను ముజాహిదీన్ దళాలతో కలిసి మేటికోట్ కొండ పాదాల వైపు కవాతు చేశాడు. మెటికోట్ హిల్‌లోని టిల్లర్‌లోని ప్రతి అంగుళాన్ని సిక్కు దళాలు ఆక్రమించాయి. సయ్యద్ అహ్మద్ ముజాహిదీన్ దళాలలో ముందు నడిచాడు. అకస్మాత్తుగా అతన్ని, మెటికోట్ కొండపైన చంపేసారు. సిక్కు సైనికులు అతని తలను నరికేసారు.

సయ్యద్ అహ్మద్ హతుడయ్యాడని ముజాహిదీన్లు గ్రహించలేదు. వాళ్ళు అతనిని వెతకడానికి వెళ్ళారు. ఈలోగా ముజాహిదీన్‌లకు చెందిన చిన్నచిన్న సమూహాలు వేర్వేరు ప్రదేశాలలో పోరాడుతూ మరణించారు. ఈ యుద్ధం కనీసం రెండు గంటల పాటు కొనసాగింది. సయ్యద్ అహ్మద్‌ను కొండపైకి తీసుకెళ్లారని, వారందరినీ కొండపైకి రమ్మని చెప్పారనీ ముజాహిదీన్లు గట్టిగా అరవడం ప్రారంభించారు. దాంతో, వాళ్ళు ఉత్తరాన ఉన్న కొండల వైపు వెళ్లారు. కొండల పైకి చేరుకున్నాక గానీ, తాము ముట్టడిలో ఉన్నామని వాళ్ళు గ్రహించలేక పోయారు. వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నించారు కానీ కొండలకు అన్ని వైపుల నుండి వచ్చిన సిక్కు సైనికులు వాళ్ళను చుట్టుముట్టి ఊచకోత కోసారు. ఆ విధంగా, ఆ ఘోరమైన యుద్ధం ముగిసింది.

సయ్యద్ అహ్మద్, దళంలో ముందు భాగాన ఉన్నాడనీ, సిక్కు సైనికుల సమూహంలోకి చొరబడ్డాడనీ మరొక పుకారు వచ్చింది. అతని చుట్టూ ఉన్న కొండ శిఖరాల కారణంగా అతను, అనుచరులకు కనబడలేదు. ఆ విధంగా అతను హతుడయ్యాక కూడా అతని మృతదేహం ముజాహిదీన్లకు దొరకలేదు. ఈ కారణంగా, చాలా కాలం తర్వాత కూడా, సయ్యద్ అహ్మద్ చనిపోయాడని ముజాహిదీన్‌లు నమ్మలేకపోయారు. ఈ యుద్ధంలో షా ఇస్మాయిల్ దేహ్లెవీ కూడా సిక్కు సైనికుల చేతిలో హతమయ్యాడు.

ఆ విధంగా, ఈ యుద్ధంలో సిక్కులు విజయం సాధించి, బాలాకోట్‌ను తమ సామ్రాజ్యంలో కలుపుకున్నారు. సిక్కు సామ్రాజ్యం పశ్చిమాన బాలాకోట్‌తో సహా, మన్‌సేహ్రా జిల్లా అంతటినీ కలుపుకుని ఆఫ్ఘన్ భూభాగంలోకి లోతుగా విస్తరించింది. ఈ ప్రధాన విజయం తర్వాత సిక్కులు, ఆఫ్ఘన్‌ల నుండి పెషావర్‌ను స్వాధీనం చేసుకునేందుకు తలపెట్టారు.[4]

మూలాలు

[మార్చు]
  1. Ahmad, M. (1975). Saiyid Ahmad Shahid: His Life and Mission (No. 93). Lucknow: Academy of Islamic Research and Publications. Page 27.
  2. Adamec, Ludwig W. (2009), Historical Dictionary of Islam, Scarecrow Press, ISBN 978-0-8108-6303-3
  3. Jalal, Ayesha (2009), "The Martyrs of Balakot", Partisans of Allah: Jihad in South Asia, Harvard University Press, pp. 58–113, ISBN 978-0-674-03907-0
  4. Jacques, Tony (2006). Dictionary of Battles and Sieges. Greenwood Press. p. 419. ISBN 978-0-313-33536-5. Archived from the original on 26 జూన్ 2015. Retrieved 13 August 2015.