బాలాసాహెబ్ భర్డే
బాలాసాహెబ్ భర్డే | |
---|---|
జననం | 1912 అహ్మద్ నగర్ జిల్లా, షెవ్‌గావ్, మహారాష్ట్ర |
మరణం | 2006 నవంబరు 22 పుణే |
వృత్తి | సామాజిక కార్యకర్త రాజకీయ నాయకుడు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | సహకార ఉద్యమం |
పిల్లలు | 5 గురు కుమారులు, ఒక కుమార్తె |
పురస్కారాలు | పద్మ భూషణ (2001) |
బాలాసాహెబ్ శివరామ్ భర్డే (1912-2006), స్వాతంత్ర్య సమర యోధుడు, సామాజిక కార్యకర్త, విద్యావేత్త. అతన్ని త్రయంబక్ అని కూడా పిలుస్తారు. అతను మహారాష్ట్ర శాసనసభ స్పీకరుగా పనిచేసాడు. [1] 1957-1962 మధ్య కాలంలో, మహారాష్ట్ర సహకార మంత్రిగా ఉండగా భర్డే, [2] [3] రాష్ట్రంలో సహకార ఉద్యమానికి కృషిచేసాడు. [4] [5] ఖాదీ గ్రామోద్యోగ్, హరిజన సేవక సంఘం, మహారాష్ట్ర గాంధీ స్మారక నిధి (MGSN) వంటి అనేక సామాజిక సంస్థల తోటి, ప్రభుత్వ సంస్థల తోటీ అతనికి అనుబంధం ఉంది. మహారాష్ట్ర గాంధీ స్మారక నిధికి రెండవ అధ్యక్షుడిగా పనిచేశాడు. [6] మహారాష్ట్ర రాష్ట్ర ఖాదీ మండలికి కూడా అధ్యక్షుడిగా పనిచేసాడు. [7]
మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా షెవ్‌గావ్ అనే చిన్న గ్రామంలో 1912 లో భర్డే జన్మించాడు. అతను 1952 నుండి రెండు దశాబ్దాల పాటు రాష్ట్ర శాసనసభలో తన స్వంత నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు. [8] సమాజానికి ఆయన చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం 2001 లో పద్మభూషణ్ ప్రదానం చేసింది. [9] అతనికి ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
2006 నవంబరు 22 న, 94 సంవత్సరాల వయస్సులో భర్డే, పూణేలో మరణించాడు. [7] అనేక విద్యా సంస్థలకు, [10] [11] షెవ్‌గావ్‌లోని ఒక ప్రజా గ్రంథాలయానికీ భర్డే పేరు పెట్టారు. [12]
ఇవి కూడా చూడండి
[మార్చు]- భారతదేశంలో సహకార ఉద్యమం
- మహారాష్ట్ర శాసనసభ
మూలాలు
[మార్చు]- ↑ N. S. Karandikar (21 February 2008). Sir Swami Samarth. Sterling Publishers Pvt. Ltd. pp. 214–. ISBN 978-81-207-3445-6.
- ↑ "About Us". Padmabhushan Balasaheb Bharde Pratishthan. 2016. Archived from the original on 26 August 2016. Retrieved 29 May 2016.
- ↑ "Bank History". Akola District Central Coop. Bank. 2016. Archived from the original on 4 April 2016. Retrieved 29 May 2016.
- ↑ "CM condoles demise of Balasaheb Bharde". One India. 22 November 2006. Retrieved 29 May 2016.
- ↑ "Blessings of Late Shri. Balasaheb Bharde". Ravi Ghate. 2016. Archived from the original on 29 March 2016. Retrieved 29 May 2016.
- ↑ "Maharashtra Gandhi Smarak Nidhi". Maharashtra Gandhi Smarak Nidhi. 2016. Archived from the original on 10 మార్చి 2018. Retrieved 29 May 2016.
- ↑ 7.0 7.1 "Balasaheb Bharade passes away". One India. 22 November 2006. Retrieved 29 May 2016. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "Balasaheb Bharade passes away" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ "List of successful Candidates" (PDF). Election Commission of India. 2016. pp. 9 of 408. Retrieved 29 May 2016.
- ↑ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2016. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 3 January 2016.
- ↑ "Other Institutions". Bhardesaksharta Prasarak Mandal. 2016. Archived from the original on 6 ఆగస్టు 2016. Retrieved 29 May 2016.
- ↑ "balasaheb bharde vidyalaya". Wikimapia. 2016. Retrieved 29 May 2016.
- ↑ "Deshbhakt Balasaheb Bharde Granthalaya". Indian Any. 2016. Retrieved 29 May 2016.