బావాజీపాలెం
బావాజీ పాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 15°56′00″N 80°40′37″E / 15.933249°N 80.677060°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
మండలం | నిజాంపట్నం |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 522 314 |
ఎస్.టి.డి కోడ్ | 08648 |
బావాజీ పాలెం బాపట్ల జిల్లా, నిజాంపట్నం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గ్రామంలో మౌలిక వసతులు
[మార్చు]ఈ గ్రామం బహిరంగ మలవిసర్జన రహిత గ్రామం (ఓ.డి.ఎఫ్) గ్రామముగా ఎంపికైనది.[1]
గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం
[మార్చు]గ్రామ పంచాయతీ
[మార్చు]- ఇది ఒక మైనరు పంచాయతీ. అదవల, తోటకూరవారిపాలెం, గవినివారిపాలెం గ్రామాలు, బావాజీపాలెం గ్రామ పంచాయతీపరిధిలోని శివారు గ్రామాలు.
- 2013లో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో ఒక విశ్రాంత సైనికోద్యోగి అయిన మహమ్మద్ నజీర్ అహమ్మద్, సర్పంచిగా ఎన్నికైనారు. వీరు గ్రామములో పలు అభివృద్ధిపనులు చేయించుచున్నారు.[2]
గ్రామ విశేషాలు
[మార్చు]సైనికుల గ్రామం
[మార్చు]గ్రామంలో మొత్తం దాదాపుగా 300 ఇళ్ళు ఉంటాయి. ఒక్కో ఇంటి నుంచి కనీసం ఇద్దరైనా భారత సైన్యానికి పనిచేసే వారు, చేసిన వారు ఉండటం ఈ గ్రామం యొక్క ప్రత్యేకత. దేశవ్యాప్తంగా దాదాపు ఈ గ్రామానికి చెందిన 500 మంది సైనికులుగా పనిచేస్తున్నారు.[3]మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు కొంతమంది ఉపాధి కోసం ఆర్మీలో చేరారు. రెండో ప్రపంచ యుద్ధం నాటికి బావాజీపాలెంలో జవాన్ల సంఖ్య పెరిగింది. ఆరోజుల్లో యుద్ధాల్లో పాల్గొన్న జవానులు గ్రామానికి తిరిగి వచ్చినప్పుడు దేశం కోసం పోరాడటంలో సంతృప్తినీ అనుభవాలనీ నలుగురితో పంచుకోవడం మొదలుపెట్టారు. తమ బిడ్డల్ని సైన్యంలో చేర్చేందుకు సిద్ధపడ్డారు. అలా సైనిక వారసత్వం మొదలైంది.
1981 నాటికి బావాజీ పాలెంలో దాదాపు ప్రతీ ఇంటి నుంచి ఒక సైనికుడు ఉండేవాడు. దాంతో ఇండియన్ ఆర్మీ ఈ ఊరిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఆ ఊరిని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకుంది. దత్తత తీసుకుని రూ.11 లక్షలతో గ్రామ ప్రజలకు తాగునీటి సౌకర్యమూ ఇతర వసతులను ఏర్పాటు చేసింది. దాంతో ఇక అందరి దృష్టీ ఆర్మీపైనే. వారసత్వం ఇప్పటికీ కొనసాగుతోంది. ఇంజినీరింగ్, సాఫ్ట్‌వేర్ రంగాలవైపు పరుగులెడుతున్న ఈరోజుల్లోనూ బావాజీపాలేనికి చెందిన చాలామంది సైన్యంలో చేరేందుకే ఇష్టపడుతూ ఉండటం విశేషం. ఆర్మీలో ఉద్యోగ విరమణ అనంతరం అందరూ తిరిగి ఆగ్రామానికే వచ్చి స్థిరపడుతుండటం మరొక విశేషం. ప్రస్తుతం ఈ గ్రామానికి చెందినవారు 400 మందికిపైగానే సైన్యంలో పనిచేసేవారున్నారు. సైన్యంలో పనిచేసి, ఉద్యోగ విరమణ పొందినవారు మరో 200 మంది పైగానే ఉన్నారు. సైన్యంలో కీలకమైన ఆర్డినెన్స్ కెప్టెన్ గా విధులు నిర్వహించుచూ శ్రీ రవూఫ్ పదవీ విరమణ చేశారు. సుబేదార్ మేజర్లుగా 10 మంది, సుబేదార్లుగా మరో 15 మంది విధులు నిర్వహించు చున్నారు.[4]