బిందియా గోస్వామి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బిందియా గోస్వామి
బిందియా గోస్వామి (2014)
జననం
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1969–1987
జీవిత భాగస్వామివినోద్ మెహ్రా (1980-1984)
జెపి దత్తా (1985)

బిందియా గోస్వామి, భారతీయ సినిమా నటి. 1970, 1980లలో హిందీ సినిమాలలో నటించింది.

జననం[మార్చు]

బిందియా, వేణుగోపాల్ గోస్వామి (తమిళ అయ్యంగార్) - డాలీ (క్యాథలిక్) దంపతులకు రాజస్థాన్ రాష్ట్రం, భరత్‌పూర్ జిల్లాలోని కమాన్ లో జన్మించింది. వేణుగోపాల్ గోస్వామి వల్లభ సంప్రదాయ పూజారి, తన జీవితకాలంలో 7సార్లు వివాహం చేసుకున్నాడు.

సినిమారంగం[మార్చు]

యుక్తవయస్సులో హేమతో పోలికలున్న బిందియాను ఒక పార్టీలో చూసిన హేమమాలిని తల్లి, నిర్మాతలకు సిఫార్సు చేసింది. విజయ్ అరోరా సరసన జీవన్ జ్యోతి అనే హిందీ సినిమాలో తొలిసారిగా బిందియా నటించింది. బసు ఛటర్జీ 1977లో తీసిన ఖట్టా మీఠా, 1979లో తీసిన ప్రేమ్ వివాహ్ సినిమాలు విజయాన్ని అందుకున్నాయి. 1979లో హృషికేష్ ముఖర్జీ తీసిన గోల్ మాల్ అనే కామెడీ సినిమా భారీ విజయవంతం అయింది.[1] తరువాత 1979లో దాదా సినిమాలో వినోద్ మెహ్రాతో, 1980లో షాన్ సినిమాలో శశి కపూర్ సరసన కూడా నటించింది.

కాస్ట్యూమ్ డిజైనర్‌గా[మార్చు]

జెపి దత్తా తీసిన బోర్డర్ (1997), రెఫ్యూజీ (2000), ఎల్ఓసి కార్గిల్ (2003), ఉమ్రావ్ జాన్ (2007) వంటి సినిమాలలోని నటీమణులు రాణి ముఖర్జీ, కరీనా కపూర్, ఐశ్వర్య రాయ్ తదితరులకు కాస్ట్యూమ్స్ డిజైనింగ్ చేసింది.[2]

వ్యక్తిగత జీవితం[మార్చు]

బిందియాకు 1980లో సహనటుడు వినోద్ మెహ్రాలో వివాహం జరిగింది, నాలుగు సంవత్సరాల తర్వాత వారు విడాకులు తీసుకున్నారు.[3] ఆ తర్వాత, 1985లో దర్శకుడు జెపి దత్తా వివాహం చేసుకోవడానికి బిందియా నటించడం మానేసింది.[4] వారికి ఇద్దరు కుమార్తెలు (నిధి, సిద్ధి) ఉన్నారు.[2] కుమార్తె నిధి నటిగా పలు సినిమాలలో నటిస్తోంది.[5][6]

సినిమాలు[మార్చు]

  • మేరా యార్ మేరా దుష్మన్ (1987)
  • విశాల్ (1987) – చాన్వి
  • అవినాష్ (1986)
  • చోర్ పోలీస్ (1983) – రోహన్ భార్య (అతిథి పాత్ర)
  • మెహందీ (1983) – గౌరీ
  • లాలాచ్ (1983)
  • రంగ్ బిరంగి (1983) – స్వయంగా
  • రేష్మా (1982) పంజాబీ చిత్రం
  • ఆమ్నే సామ్నే (1982) – ఇన్‌స్పెక్టర్ జ్యోతి
  • హమారీ బహు అల్కా (1982) – అల్కా
  • హీరోన్ కా చోర్ (1982)
  • ఖుద్-దార్ (1982) – మంజు
  • హోటల్ (1981) – వందన (బిండియాగా)
  • యే రిష్తా నా టూటే (1981) – కిరణ్ కపూర్
  • సన్నాట (1981)
  • సంసాని: ది సెన్సేషన్ (1981) – నిషా శ్రీవాస్తవ్
  • బందిష్ (1980) – శాంతి
  • ఖూన్ ఖరాబా (1980)
  • షాన్ (1980) – రేణు
  • టక్కర్ (1980) – మీనా
  • అహ్సాస్ (1979) – స్వయంగా
  • దాదా (1979) – కామిని
  • గోల్మాల్ (1979) – ఊర్మిళ
  • జాందార్ (1979)
  • జానీ దుష్మన్ (1979) – శాంతి (ఠాకూర్ కూతురు)
  • ఖండాన్ (1979)
  • ముకాబ్లా (1979) – విక్కీ స్నేహితురాలు/భార్య
  • ప్రేమ్ వివాహ (1979)
  • అంఖ్ కా తారా (1978) – గీతా గుప్తా
  • కాలేజీ గర్ల్ (1978)
  • ఖట్టా మీఠా (1978) – జరైన్
  • రామ్ కసమ్ (1978)
  • చల మురారి హీరో బనానే (1977)
  • ఛోటా బాప్ (1977)
  • దునియాదారి (1977)
  • జే వెజయ్ (1977) - యువరాణి పద్మావతి
  • ఖేల్ కిస్మత్ కా (1977)
  • ముక్తి (1977) – పింకీ
  • కర్మ (1977) - బాలనటి[7]
  • జీవన్ జ్యోతి (1976)
  • చిక్ మిక్ బిజులీ (1969) (అస్సామీ)[2]

మూలాలు[మార్చు]

  1. "Excelsior... Nation". web.archive.org. 2007-09-27. Archived from the original on 2007-09-27. Retrieved 2022-02-13.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. 2.0 2.1 2.2 "Bindiya Goswami. -Biography -People". Archived from the original on 3 October 2013. Retrieved 2022-02-13.
  3. "JP saab was my destiny". Filmfare. Retrieved 2022-02-13.
  4. "Bindiya Goswami on what makes husband J.P. Dutta special". filmfare.com (in ఇంగ్లీష్). Retrieved 2022-02-13.
  5. "'Golmaal' actress Bindiya Goswami wants daughter to do her kind of films". The Indian Express. Retrieved 2022-02-13.
  6. "IndiaGlitz – FIRST LOOK: Checkout JP Duttas daughters debut movie Jee Bhar Ke Jee Le – Bollywood Movie News". IndiaGlitz. Archived from the original on 2014-10-13. Retrieved 2022-02-13.
  7. "When big stars wowed us on small screen - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-02-13.

బయటి లింకులు[మార్చు]