Jump to content

బిందు సేద్యం

వికీపీడియా నుండి
ఇజ్రాయెల్ లో బిందుసేద్యం

బిందు సేద్యం అనేది ఒక సూక్ష్మసేద్య విధానం. ఈ విధానంలో నీటిని చుక్కల రూపంలో వేర్లకు చేరేలా చూస్తారు. నీటి సరఫరా నేలపైన నుంచీ ఉండవచ్చు లేదా భూమిలోప పూడ్చిపెట్టిన గొట్టాల ద్వారా ఉండవచ్చు. వేర్లకు నేరుగా నీరు అందేలా చూసి అది ఆవిరి కాకుండా చూడటం ఈ విధానం ప్రధాన లక్ష్యం. దీని ద్వారా సాగుకు అవసరమయ్యే నీరు, పోషకాలు పొదుపు చేయవచ్చు.

2023 నాటికి ప్రపంచం వ్యాప్తంగా సుమారు 3% మంది రైతులు బిందు సేద్యం ద్వారా సాగు చేస్తున్నారు.[1]

2012 నాటికి బిందు సేద్యాన్ని, ఇంకా ఇతర సూక్ష్మ సేద్యాలను అందిపుచ్చుకోవడంలో చైనా, భారతదేశం ముందువరుసలో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఒక కోటి హెక్టార్ల భూమి ఈ సాంకేతికతను సాగులో ఉపయోగించుకుంటోంది. కానీ ఇది ప్రపంచం సాగుభూమిలో కేవలం 4 శాతం మాత్రమే. ఇజ్రాయిల్ కు చెందిన నెటాఫిం అనే సంస్థ ఈ సాంకేతికతలో అగ్రస్థానంలో ఉంది.[2] భారతదేశానికి చెందిన జైన్ ఇరిగేషన్ అనే సంస్థ కూడా ఈ రంగంలోరెండో పెద్ద సంస్థగా అభివృద్ధి చెందుతూ వస్తోంది.[3] 2017 లో రివ్యులిస్ అనే సంస్థ యూరోడ్రిప్ అనే సంస్థను కొనుగోలు చేయడం ద్వారా సాగు పరికరాల ఉత్పత్తిలో రెండో పెద్ద సంస్థగా అవతరించింది.[4]

మూలాలు

[మార్చు]
  1. Degani, Corin (2023-08-14). "How Israel achieved one of the most secure water economies, drip by drip". Haaretz (in ఇంగ్లీష్). Retrieved 2024-06-17.
  2. Tova Cohen, Israeli irrigation firm Netafim sees 50 pct earnings rise by 2020, Reuters.com, 21 March 2018, accessed 1 August 2019
  3. Drip Irrigation Expanding Worldwide, National Geographic, 25 June 2012, accessed 1 August 2019
  4. Rivulis Irrigation buys Greek co Eurodrip, Globes, 11 January 2017