Jump to content

బిట్స్, హైదరాబాదు

అక్షాంశ రేఖాంశాలు: 17°32′47.39″N 78°34′21.00″E / 17.5464972°N 78.5725000°E / 17.5464972; 78.5725000
వికీపీడియా నుండి
బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్,పిలాని - హైదరాబాద్ క్యాంపస్
నినాదంज्ञानं परम् बलं
Gyanam paramam balam
ఆంగ్లంలో నినాదం
"Knowledge is Power Supreme"
రకంస్యయం ప్రతిపత్తి
స్థాపితం2008
ఛాన్సలర్కుమార మంగళం బిర్లా
వైస్ ఛాన్సలర్ప్రొఫెసర్ బిజేంద్రనాధ్ జైన్
డైరక్టరుప్రొఫెసర్ వి. సాంబశివరావు
నిర్వహణా సిబ్బంది
140+
విద్యార్థులు2800
అండర్ గ్రాడ్యుయేట్లు2311
స్థానంహైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
17°32′47.39″N 78°34′21.00″E / 17.5464972°N 78.5725000°E / 17.5464972; 78.5725000
కాంపస్నగర సమీపము, 220 ఎకరాలు (0.89 కి.మీ2)
AlumniBITSAA
అనుబంధాలుబిట్స్, పిలానీ
క్రీడలుక్రికెట్, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్
జాలగూడుబిట్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్
దస్త్రం:Molecule (Sciences), Lotus (Humanities), Rocket (Technology)

బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) పిలాని హైదరాబాద్ క్యాంపస్ బిట్స్ పిలాని విశ్వవిద్యాలయం నాలుగు ప్రాంగణాలలో ఒకటి. 2008లో ప్రారంభింపబడిన ఇది బిట్స్ విశ్వవిద్యాలయ ప్రాంగణాలలో అతి కొత్తది. అత్యున్నత మౌలిక సదుపాయాలకు తోడు కాలానుగుణంగా కరికులమ్‌లో మార్పులు చేస్తూ భారతదేశంలో ఇంజనీరింగ్ విద్యనందించే అత్యుత్తమ విద్యాసంస్థల్లో 'బిట్స్ పిలానీ' అగ్రస్థానంలో నిలుస్తోంది. బిట్స్ ఒక్క సబ్జెక్టు చదువుకే పరిమితం కాదు. సబ్జెక్టులో అవసరమైన ప్రాక్టికల్ నాలెడ్జ్ సైతం విద్యార్థికి లభించేలా చూస్తుంది.

క్యాంపస్‌లు - కోర్సులు

[మార్చు]
బిట్స్ పిలాని, హైదరాబాదు క్యాంపస్

హైదరాబాద్ క్యాంపస్ బిఇ ఆనర్స్ (కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్ ఇంజనీరింగ్, మాన్యుఫాక్చరింగ్ ఇంజనీరింగ్) : బి.ఫార్మసీ ఆనర్స్; ఎమ్మెస్సీ ఆనర్స్ (బయలాజికల్ సైన్సెస్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, మేథమెటిక్స్, ఫిజిక్స్) ఉన్నాయి. జీనోమ్ వ్యాలీలో కూడా తన కార్యకలాపాలును ప్రారంభించింది.

ప్రవేశార్హత

[మార్చు]

పై కోర్సుల్లో ప్రవేశానికి అభ్యర్థులు 10+2 విధానంలో గుర్తింపు పొందిన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల నుంచి ఇంటర్మీడియెట్, మేథ్స్/ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఉత్తీర్ణులవ్వాలి. అంతేగాక కెమిస్ట్రీ, మేథ్స్, ఫిజిక్స్‌లలో కనీసం 75శాతం మార్కులు తెచ్చుకొని ఉండాలి (లేదా) ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథ్స్/ బయాలజీలలో ముఖ్యంగా ప్రతి సబ్జెక్టులో కనీసం 60 శాతం మార్కులు వచ్చి ఉండాలి. 2013లో పాసైన అలాగే 2014లో అర్హత పరీక్ష రాస్తున్న విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. బిట్స్ఎట్‌కి రెండుసార్లు మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంటుంది. ఇంగ్లీషు ధారాళంగా మాట్లాడే సామర్థ్యం కలిగి ఉండాలి. వివిధ రాష్ట్రప్రభుత్వాలు నిర్వహించే బోర్డు పరీక్షల్లో మొదటిర్యాంకు పొందిన అభ్యర్థులకు బిట్‌శాట్ స్కోరులో ప్రమేయం లేకుండా అడ్మిషన్లను కేటాయిస్తారు.

పరీక్ష విధానం

[మార్చు]

బిట్స్ ఎట్‌లో నాలుగు విభాగాలుంటాయి. మొదటి విభాగంలో ఫిజిక్స్, రెండో విభాగంలో కెమిస్ట్రీ, మూడో విభాగంలో ఇంగ్లీషు, లాజికల్ రీజనింగ్, నాల్గో విభాగంలో మేథ్స్ సబ్జెక్టులుంటాయి. పరీక్ష మూడు గంటలు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. సరైన సమాధానానికి మూడు మార్కులు. తప్పు సమాధానానికి ఒక మైనస్ మార్కులుంటాయి. విభాగం సబ్జెక్టు ప్రశ్నలు 1 ఫిజిక్స్ 40 2 కెమిస్ట్రీ 40 3 ఎ) ఇంగ్లిష్ 15 బి) లాజికల్ రీజనింగ్ 10 4 మేథ్స్ 45 మొత్తం 150 ప్రశ్నలు 3 మార్కులు = 450 మార్కులు అదనపు ప్రశ్నలు అభ్యర్థి 150 ప్రశ్నలను నిర్ణీత సమయం కన్నా ముందే పూర్తిచేస్తే అతనికి మరో 12 ప్రశ్నలు అదనంగా ఇస్తారు. కానీ తప్పుగా గుర్తిస్తే నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. అత్యున్నత ప్రతిభ కలిగిన విద్యార్థులకు అధిక మార్కులు తెచ్చుకొనేందుకు ఈ ప్రశ్నలు ఉపయోగపడతాయి. పరీక్ష కేంద్రంలోకి కాలిక్యులేటర్లు, లగారిథమ్స్‌ను అనుమతించరు. ఆన్‌లైన్ విధానంలోనే పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షకేంద్రంలో క్లోజ్డ్ సర్క్యూట్ టీవీ కెమెరాలు, వెబ్ కెమెరాల సహాయంతో మొత్తం పరీక్ష నిర్వహణను రికార్డు చేస్తారు.

రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు (ఆన్‌లైన్)

[మార్చు]

హైదరాబాద్ సిటీ ఝ విశాఖపట్నం ఝ బిట్స్ క్యాంపస్ (హైదరాబాద్) విజయవాడ, తిరుపతి.

బిట్స్ పిలానీ డీమ్డ్ యూనివర్సిటీ. పిలానీలో ఏర్పాటు చేసిన బిట్స్. బిట్స్ పిలానీ పేరుతోనే డీమ్డ్ యూనివర్సిటీగా నమోదైంది. అందువల్లే పిలానీ సహా దుబాయ్, గోవా, హైదరాబాద్ క్యాంపస్‌లలో ఎక్కడ చదివినా సర్టిఫికెట్లను బిట్స్ పిలానీ పేరు మీదుగా అందిస్తారు. ఒక రకంగా అదే వారి బ్రాండ్ నేమ్. లెర్నింగ్‌కు సంబంధించి విద్యార్థికి అపరిమితమైన స్వేచ్ఛ ఉంటుంది. సెమిస్టర్ మొదట్లోనే ఏ సబ్జెక్టుకు ఎన్ని క్లాసులకు హాజరు కావాలన్నది తెలియజేస్తారు. వివిధ టెస్టులతో సహా ప్రతీ సెమిస్టర్‌కు ముందే ఒక టైమ్ టేబుల్ ఉంటుంది. అందులో నుంచి విద్యార్థి తనకు అనుగుణంగా టైమ్ టేబుల్‌ను సర్దుబాటు చేసుకుంటాడు.

ఇంజనీరింగ్, సైన్స్, హ్యుమనిటీస్ ఏదైనా ఆరంభంలో ఫస్ట్ డిగ్రీ ప్రోగ్రామ్ మాత్రమే. ఏదైనా నాలుగ్ళే కోర్సే. మొదట్లో ఎందులో చేరినా, మొదటి రెండేళ్లలో సాధించిన ప్రగతి, మార్కులు ఆధారంగా బ్రాంచీలు మారడం మొదలుకుని అదనపు ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. బిటెక్ చేస్తూ ఎంటెక్ లేదంటే ఎంటెక్ చేస్తూ పిహెచ్‌డికి ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. అలాగే ఒక కోర్సు చేస్తూ వేరే కోర్సుకు బదిలీ కావచ్చు. డ్యూయల్ డిగ్రీ పొందే సదుపాయం ఉంది.

చివర్లో ఏడున్నర నెలల పాటు ఇండస్ట్రియల్ ఇంటర్న్‌షిప్ ఉంటుంది. ఇక్కడ నేరుగా ఆయా పరిశ్రమల్లో విద్యార్థులు పని చేయాల్సి ఉంటుంది. అందుకు స్టయిపెండ్ చెల్లిస్తారు. ఒక రకంగా ఇది పూర్తి స్థాయి ఉద్యోగం కింద లెక్క. ఏ రోజుకా రోజు డైరీ మెయింటైన్ చేయాలి. చివర్లో ప్రాజెక్టు రిపోర్టు రూపొందించాలి. ఇందులో భాగంగా కొందరు ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా, ఇటలీ తదితర దేశాలకు కూడా వెళుతుంటారు. దేశంలో 400 వరకు పరిశ్రమలతో బిట్స్‌కు అనుబంధం ఉంది. దేశంలోని ప్రముఖ పట్టణాల్లో బిట్స్ సిబ్బంది ఉంటారు. పరిశ్రమల యజమానులు, ఇతరులతో వీరంతా ఎప్పటికప్పడు ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ఈ సంబంధ బాంధవ్యాలతో ఎప్పటికప్పుడు పరిశ్రమ అవసరాలు ఏమిటి అన్నది తెలుస్తూ ఉంటుంది. తదనుగుణంగా ఇక్కడి కరికులమ్ తదితరాలన్నింటినీ అప్‌డేట్ చేసుకునే వీలు చిక్కుతోంది.విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కు సైతం అదే ఉపకరిస్తోంది. ఏతావతా బయటి ప్రపంచంతో గ్యాప్‌నకు తావులేని విధంగా వారు ఎదగగలుగుతున్నారు.

See more at: https://web.archive.org/web/20131227204406/http://www.andhrajyothy.com/node/45919#sthash.psj0vocC.dpuf