పిలాని
Appearance
?Pilani రాజస్థాన్ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 28°22′N 75°36′E / 28.37°N 75.6°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం • ఎత్తు |
• 279 మీ (915 అడుగులు) |
జిల్లా (లు) | ఝున్ఝును జిల్లా |
జనాభా | 26,219 (2001 నాటికి) |
కోడులు • పిన్‌కోడ్ • ప్రాంతీయ ఫోన్ కోడ్ |
• 333031 • +91-1596 |
పిలాని రాజస్థాన్ రాష్ట్రంలోని ఒక పట్టణం. ఇది బిట్స్ విద్యా సంస్థల ద్వారా ప్రసిద్ధి చెందినది
చరిత్ర
[మార్చు]ఈ నగరం ఘనశ్యాం దాస్ యొక్క జన్మస్థలం, పిలానియా గోత్రానాకి సంభందించిన ఒకానొక వీరుని పరాక్రమానికి మెచ్చి అప్పటి రాజు ఈ ప్రాంతానికి ఈ పేరును నిర్ణయించాడు. పిలాని పట్టణం చాల చిన్న పట్టణం. ఇది సూరజ్ గర్ పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో కలదు.
విద్యాసంస్థలు
[మార్చు]పిలాని ఘనశ్వాం దాస్ సొంత ఊరు కావడంతో అక్కడ పలు విద్యా సౌకర్యాలను ఏర్పాటు చేసారు. వాటిలో కొన్ని
- పిలానిలో ప్రతిష్థాత్మకమైన "బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్" (బిట్స్)సంస్థను 1964 లో స్థాపించారు.
- బి.కె. బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ (బికెబైట్)
- .ఇంద్రమని మాండేలియ బాలికా కళాశాల
- షాదిలాల్ కటారియా టీచర్ ట్రైనింగ్ కళాశాల
- జి.డి.బిర్లా మొమోరియల్ పాలిటెక్నిక్ ఇనిస్టిట్యూట్
- శ్రీధర్ యునివెర్సీటీ
- బిర్లా పబ్లిక్ స్కూల్
- బిర్లా బాలికా విద్యానికేతన్
- బిర్లా శిశు విహార్
రవాణా సౌకర్యాలు
[మార్చు]పిలాని పట్టణానికి నేరుగా రైలు సౌకర్యం లేదు. దగ్గర్లోని రైల్వే స్టేషను చిరావా వద్దనున్నది. 220 కి.మీ దూరంలో ఉన్న జైపూర్, 210 కి.మీ దూరంలో ఉన్న ఢిల్లీ నగరాలకి రోడ్డుమార్గాన చేరుకోవచ్చు.
ఇతర విశేషాలు
[మార్చు]పిలానిలో చూడవలసిన ప్రదేశాలలో కొన్ని
- బిట్స్ పిలాని కాంపస్
- బిర్లా మ్యూజియం
- ఆదిత్య బిర్లా మొమోరియల్ గ్రూప్ సర్స్వతి మందిరం
- శివగంగ కాలువ
- రామ మందిరం, ఉద్యానవనం
- షిర్డీ సాయిబాబా దేవాలయం, దుర్గ మందిరం