బి.ఎస్.మాధవరావు
బి.ఎస్.మాధవరావు | |
---|---|
![]() బెంగళూరు శ్రీనివాసరావు మాధవరావులు | |
జననం | క్రీ.శ 1900 బెంగళూరు |
వృత్తి | ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆర్మమెంట్ టెక్నాలజీ (పూణె) లో బాలిస్టిక్స్ ప్రొఫెసర్ |
ప్రసిద్ధి | భౌతిక శాస్త్రవేత్త |
తండ్రి | శ్రీనివాసరావు |
బి.ఎస్.మాధవరావు కన్నడ దేశానికి వలస వెళ్ళిన తెలుగు కుటుంబానికి చెందిన ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త.[1]
విషయ సూచిక
జీవిత విశేషాలు[మార్చు]
బి.ఎస్. మాధవరావు పూర్తీపేరు "బెంగళూరు శ్రీనివాసరావు మాధవరావు". ఆయన మే 29 1900 లో బెంగళూరు లో జన్మించారు. ఈయన తండ్రి పేరు శ్రీనివాసరావు. ఈయన కలకత్తా విశ్వవిద్యాలయం నుండి 1938 లో డి.ఎస్.సి డిగ్రీని పొందారు.[2] ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆర్మమెంట్ టెక్నాలజీ (పూణె) లో బాలిస్టిక్స్ ప్రొఫెసర్ గా 1955 నుండి 1960 మధ్య కాలంలో పనిచేసారు. ఆ సంస్థలోనే పదవీ విరమణ పొందారు. తదనంతరం పూనా విశ్వవిద్యాలయం లో అప్లయిడ్ మాథమెటిక్స్ ప్రొఫెసర్ గా 1960 నుండి 1965 మధ్య పనిచేసారు. 1953 లో ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ, ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వంటి సంస్థలలో ఫెలోషిప్ అందుకున్నారు.[2] ఈయన థియరెటిక్ ఫిజిక్స్ లో గ్రూపు థియరీ, మోడర్న్ బీజగణితం అంశాలలో పరిశోధనలు చేసారు.
ఈయన జూన్ 11 1987 లో మరణించారు.[3]
అవార్డులు[మార్చు]
- 1945 : ఎస్ రామానుజన్ ప్రైజ్ (మద్రాసు విశ్వవిద్యాలయం)
- ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ లో ఫెలోషిప్ మరియు జీవిత కాల సభ్యులు.
- ఇండియన్ మాథమెటిక్స్ సొసైటీ లో గౌరవ సభ్యులు.
మూలాలు[మార్చు]
- ↑ ఆంధ్ర శాస్త్రవేత్తలు (కృష్ణవేణి పబ్లిషర్స్, విజయవాడ సంపాదకులు.). శ్రీ వాసవ్య. 2011. p. 415.
- ↑ 2.0 2.1 http://insaindia.org/deceaseddetail.php?id=N530418. ఇండియన్ నేషనల్ సైన్సు అకాడమీ http://insaindia.org/deceaseddetail.php?id=N530418. Missing or empty
|title=
(help); External link in|website=
(help) - ↑ ఆయన విశేషాలు
ఇతర లింకులు[మార్చు]