బీటా కణం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బీటా విఘటనం

బీటాకణాలు భార కేంద్రకముల నుండి వెలువడే ఋణావేశ కణాలు. ఇవి అత్యధిక వేగం, శక్తి కలిగిన ఎలక్ట్రాన్లుగా భావించవచ్చు. లేక పొటాషియం-40 వంటి మూలకాల కేంద్రకాల నుండి వెలువడు పాజిట్రాన్ లు.ఇవి రేడియోథార్మిక కణాలు.ఇవి రేడియోధార్మిక మూలకాల కేంద్రకం యొక్క అస్థిరత్వం వల్ల వెలువడతాయి. వీటిని -1β0తో సూచిస్తారు.

బీటా కణ విఘటనం[మార్చు]

రేడియో ధార్మిక మూలకం నుండి బీటా కణం వెలువడునపుడు పరమాణు సంఖ్య ఒక యూనిట్ పెరుగును. ద్రవ్యరాశి సంఖ్య మారదు.

సహజ రేడియో ధార్మికత[మార్చు]

ఇవి సాధారణంగా పరమాణు సంఖ్య 83 తర్వాత గల మూలకాలలో కేంద్రకం అస్థిరత్వం వల్ల వెలువడతాయి. ఇవి రేడియో ధార్మికత ప్రదర్శిస్తాయి. వీటిని మొదట హెన్రీ బెక్వరల్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు. ఆయన చేస్తున్న ప్రయోగంలో యురేనియం ఖనిజమైన పిచ్ బ్లెండ్ ను టేబుల్ సొరుగులో ఉంచి కొన్నిరోజుల తర్వాత చూసినపుడు అదే సొరుగులో గల చాలా జాగ్రత్తగా భద్రపరచబడ్డ పోటోగ్రాఫిక్ ప్లేట్లును కొన్ని కిరణాలు ప్రభావితం చెసినట్లు కనుగొన్నాడు. ఆ కిరణాలు పిచ్ బ్లెండ్ ఖనిజం నుండి వచ్చినట్లు గమనించాడు. అదే విధంగా వివిధ మూలకాలతో ప్రయోగం చేసిన తదుపరి 83 పరమాణు సంఖ్య తర్వాత గల మూలకాలలో కొన్ని కిరణాలు వెలువడుతున్నట్లు గుర్తించాడు. వీటికి బెక్వరల్ కిరణాలు అని నామకరణం చేసాడు. పరమాణు కేంద్రకం నుండి అస్థిరత్వం వల్ల కిరణాలు వెలువడటాన్ని సహజ రేడియో థార్మికత అంటారు.

రేడియో ధార్మిక వికిరణాలు-రకాలు[మార్చు]


ఒక సీసం దిమ్మకు రంధ్రం చేసి అందులో ఏదైనా రేడియో ధార్మిక మూలకం తీసుకోవావి.ఎందువలనంటే సీసం రేడియో ధార్మికతను ప్రదర్శించదు. రేడియో ధార్మిక మూలకం నుండి వెలువడుతున్న కిరణాలను శోషించుకుంటుంది. కాని కిరణాలు ఒకవైపు వస్తాయి. ఈ కిరణ పుంజంలో ఎన్ని రకాల వికిరణాలు ఉన్నాయో తెలుసుకొనుటకు కిరణ పుంజమునకు ఎరువైపుల అయస్కాంత క్షేత్రం ఉంచినపుదు అవి మూడు రకాలుగా ఉన్నాయని తెలిసింది. ఇపుడు అయస్కాంత క్షేత్రాన్ని తొలగించి విద్యుత్ క్షేత్రమును ఉంచినపుడు కొన్ని కణాలు ఋణావేశ పలకవైపు వంగినవి. కొన్ని ధనావెశ్ పలక వైపు వంగినవి. కొన్ని అపవర్తనం చెందకుండా పైకి పోయినవి.


పై ప్రయోగంలో ఋణా వేశ పలక వైపు ఆకర్షించినవి ఆల్ఫా కణాలు. ధనావేశ పలక వైపు వంగినవి బీటా కణాలు, అపవర్తనం చెందనివి గామా కిరణాలు

బీటా కణాల ధర్మాలు[మార్చు]

  • ఇవి కేంద్రకం నుండి వెలువడు ఎలక్ట్రాన్లుగా భావించవచ్చు. వీటి ద్రవ్యరాశి ఎలక్ట్రాన ద్రవ్యరాశితో సమానంగా ఉండును.
  • ఇవి ఒక యూనిట్ ఋణావేశం కలిగి ఉంటాయి. ద్రవ్యరాశి సంఖ్య 0.
  • వీటి వేగం సుమారు 108 మీ/సె. అన్ని కణాల వేగం ఒకేలా ఉండాలని లేదు.
  • ఇవి వాయువు గుండా ప్రయాణించినపుడు వాయువును అయనీకరిస్తాయి. వీటి అయనీకరణ సామర్థ్యం ఆల్ఫా కణాల కంటే తక్కువ గామా కిరణాల కన్నా ఎక్కువ.
  • వీటి చొచ్చుకుపోయే సామర్థ్యం గామా కిరణాల కన్నా తక్కువ, ఆల్ఫా కణాల కన్నా ఎక్కువ.
  • ఏ కేంద్రకం నుండయినా వెలువడినప్పుడు పరమాణువు పరమాణు సంఖ్య ఒక ప్రమాణం పెరుగును. ద్రవ్యరాశి సంఖ్య మారదు.
  • ఇవి ప్రమాదకరమైన కణాలు. ఇవి కాన్సర్ కణాల నిర్మూలనకు వాడుదురు.
"https://te.wikipedia.org/w/index.php?title=బీటా_కణం&oldid=3161998" నుండి వెలికితీశారు