బుడగ తామర
స్వరూపం
బుడగ తామర | |
---|---|
Scientific classification | |
Kingdom: | ప్లాంటే
|
(unranked): | మోనోకాట్స్
|
(unranked): | కొమెలినిడ్స్
|
Order: | కొమొలినాలెస్
|
Family: | పాంటడెరయేసి
|
Genus: | ఐఖార్నియా
|
Species: | ఈ. క్రాసిపెస్
|
Binomial name | |
Eichhornia crassipes మార్ట్, సామ్స్
|
బుడగ తామర ఒక నీటి మొక్క. దీనిని గుర్రపుడెక్క అని కూడా అంటారు. ఆంగ్లంలో వాటర్ హయసింథ్ అని పిలుస్తారు. వృక్షశాస్త్రంలో ఐకొర్నియా క్రస్సిపెస్ (Eichhornia crassipes) అని అంటారు. ఇది దక్షిణ అమెరికా అమెజాన్ నదీ పరీవాహక ప్రాంతానికి చెందినది. ఇతర ప్రదేశాలలో ఇది ఒక కలుపు మొక్కగా, విపరీతంగా పెరిగే అనవసరపు మొక్కగా పరిగణించబడింది. చెరువుల్లో, నీటి గుంటల్లో, నీరు చేరే పలు చోట్ల తరచూ ఈ మొక్క కనిపిస్తుంది.[1]
వివరణ
[మార్చు]బుడగతామర నీటిపై తేలుతూ పెరిగే నీటి వృక్షం. ఇది దక్షిణ అమెరికాకి సంబంధించిన వృక్షం. పెద్ద, బారు, దళసరి ఆకులతో ఉండే ఈ చెట్టు ఆకులు నీటికి పైన ఉంటుంది, కొన్ని సందర్భాలలో నీటికి ఒక మీటరు ఎత్తుకు ఈ ఆకులు పెరుగుతాయి.
మూలాలు
[మార్చు]- ↑ టి, సంపత్ కుమార్ (1982-01-01). "బుడగతామర". తెలుగు, త్రైమాసిక పత్రిక. 11 (1). తెలుగు అకాడమీ: 42.