బురాన్ అంతరిక్ష నౌక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
'బురాన్'
బురాన్ అంతరిక్ష నౌక
1989 పారిస్ ఎయిర్ షో లో బురాన్
కక్ష్యా వాహనం పేరు1.01
దేశంసోవియట్ యూనియన్
పేరు వ్యుత్పత్తి"మంచుతుపాను" అనే రష్యా పదం[1]
స్థితినాశనమైంది (12 May 2002)[2]
తొలి యాత్ర1988 నవంబరు 15[1]
యాత్రల సంఖ్య1[1]
సిబ్బంది సంఖ్య0[1]
కక్ష్యల సంఖ్య2[1]

బురాన్, సోవియట్ / రష్యన్ స్పేస్ షటిల్ కార్యక్రమంలో భాగంగా తయారు చేసిన తొలి, ఏకైక నౌక. బురాన్ అనేది మొట్టమొదటి సోవియట్ / రష్యన్ షటిల్ పేరు మాత్రమే కాక, అసలు ఈ స్పేస్ షటిల్ కార్యక్రమం పేరు కూడా అదే. దాని ఆర్బిటర్లను " బురాన్- క్లాస్ ఆర్బిటర్లు" అని పిలుస్తారు. బురాన్ అంటే రష్యను భాషలో మంచు తుపాను అని అర్థం. ఈ తొలి బురాన్ నిర్మాణ సంఖ్య: 1.01

1988 లో బురాన్ సిబ్బంది లేకుండా ఒక అంతరిక్ష ప్రయాణం చేసింది. ఆ తరువాత దాన్ని భద్రపరచి ఉంచిన హ్యాంగరు 2002 లో కుప్పకూలిపోవడంతో ఈ నౌక నాశనమైంది. [3] బురాన్ షటిల్‌ను అంతరిక్షం లోకి తీసుకువెళ్ళేందుకు సూపర్ హెవీ-లిఫ్ట్ ప్రయోగ వాహనమైన ఎనర్జియా రాకెట్టును ఉపయోగించారు.

నిర్మాణం[మార్చు]

బురాన్ అంతరిక్ష నౌక నిర్మాణం 1980 లో మొదలైంది. 1984 నాటికి తొట్టతొలి పూర్తి స్థాయి నౌక సిద్ధమైంది. బురాన్ అంతరిక్ష నౌకను సోవియట్ యూనియన్‌కు చెందిన సూపర్-హెవీ లిఫ్ట్ రాకెట్టు, ఎనర్జియా ద్వారా ప్రయోగించారు. సోవియట్ యూనియన్ పతనం తర్వాత, 1993 లో, బురాన్ కార్యక్రమానికి మూతపడింది.[4]

తేదీ మైలురాయి [5][6]
1980 అసెంబ్లీ మొదలైంది
1983 ఆగస్టు NPO ఎనర్జియా సంస్థ, ఫ్యూసె‌లేజ్‌ను‌ అందుకుంది
1984 మార్చి సమగ్ర ఎలక్ట్రికల్ పరీక్ష ప్రారంభం
1984 డిసెంబరు బురాన్‌ను బైకొనూర్‌ అంతరిక్ష కేంద్రానికి చేర్చారు
1986 ఏప్రిల్ తుది అసెంబ్లీ మొదలైంది
1987 నవంబరు 15 తుది అసెంబ్లీ పూర్తైంది
1987 నవంబరు 15 - 1988 ఫిబ్రవరి 15 MIK OK లో పరీక్ష
1988 మే 19 - జూన్ 10 పరీక్షకు సిద్ధం
1988 నవంబరు 15 కక్ష్యా యాత్ర (1 కె 1)

ప్రయోగాల చరిత్ర[మార్చు]

బురాన్- తరగతి ఆర్బిటరు చేసిన ఏకైక యాత్ర, 1 కె 1 (మొదటి ఆర్బిటర్, మొదటి యాత్ర [7] ) 1988 నవంబరు 15 న 03:00:02 కు మొదలైంది. బైకోనూర్ కాస్మోడ్రోమ్ లో లాంచ్ ప్యాడ్-110/37 నుండి ఈ యాత్ర మొదలైంది. [3] [8] ప్రత్యేకంగా రూపొందించిన ఎనర్జియా రాకెట్టు, బురాన్‌ను అంతరిక్షం లోకి తీసుకువెళ్ళింది. ఆటోమేటెడ్ లాంచ్ సీక్వెన్స్, డిజైను చేసిన విధంగానే పనిచేసింది. ప్రోగ్రాములో సూచించిన విధంగానే ఈ రాకెట్టు, బురాన్‌ను తాత్కాలిక కక్ష్య లోకి ప్రక్షేపించింది. ఆ తరువాత బురాన్ తన స్వంత థ్రస్టర్లను వాడి ఇంకా పై కక్ష్య లోకి వెళ్ళి, భూమి చుట్టూ రెండు కక్ష్యలను పూర్తి చేసింది. ఆ తరువాత, ODU అనే కంబైన్‌డ్ ప్రొపల్షన్ వ్యవస్థకు చెందిన ఇంజన్లను పనిచేయించి, బురాన్‌ వాతావరణం లోకి తిరిగి ప్రవేశించింది. భూమి మీదకు తిరిగి వచ్చి విమానం లాగా రన్‌వేపై దిగింది.[9]

ప్రతిపాదించిన యాత్రలు[మార్చు]

1993 లో, 15-20 రోజుల వ్యవధి ఉండే సిబ్బంది లేని బురాన్ యాత్ర చెయ్యాలని 1989 లోనే సంకల్పించారు. [7] బురాన్ కార్యక్రమం అధికారికంగా రద్దు చేయనప్పటికీ, సోవియట్ యూనియన్ పతనమై, నిధులు ఆగిపోయాయి. దాంతో ఈ యాత్ర జరగనే లేదు. [4]

లక్షణాలు[మార్చు]

బురాన్ ద్రవ్యరాశి 62 టన్నులు, [10] గగరిష్టంగా 30 టన్నుల పేలోడ్‌తో, మొత్తం 105 టన్నుల లిఫ్ట్-ఆఫ్ బరువు ఉంటుంది.[11]

ద్రవ్యరాశి వివరాలు [3]

  • ఆకారం, ల్యాండింగ్ వ్యవస్థల మొత్తం ద్రవ్యరాశి: 42,000 kg (93,000 lb)
  • ఫంక్షనల్ వ్యవస్థలు, ప్రొపల్షన్ ల ద్రవ్యరాశి: 33,000 kg (73,000 lb)
  • గరిష్ట పే లోడ్: 30,000 kg (66,000 lb)
  • గరిష్ట లిఫ్టాఫ్ బరువు: 105,000 kg (231,000 lb)

కొలతలు [3] [4]

  • పొడవు: 36.37 m (119.3 ft)
  • రెక్కల వెడల్పు: 23.92 m (78.5 ft)
  • చక్రాలపై నిలబడినపుడు ఎత్తు: 16.35 m (53.6 ft)
  • పేలోడ్ స్థలం పొడవు: 18.55 m (60.9 ft)
  • పేలోడ్ స్థలం వ్యాసం: 4.65 m (15.3 ft)
  • వింగ్ గ్లోవ్ స్వీప్: 78 డిగ్రీలు
  • వింగ్ స్వీప్: 45 డిగ్రీలు

విధి, విధ్వంసం[మార్చు]

1989 జూన్ లో, ఆంటోనోవ్ ఎఎన్ -225 విమానం వెన్నుపై కూర్చుని బురాన్, 1989 లో లే బౌర్గేట్ విమానాశ్రయంలో జరిగిన పారిస్ ఎయిర్ షోలో పాల్గొంది.

బురాన్ కార్యక్రమం రద్దయ్యాక, బురాన్‌ను ఎనర్జియా రాకెట్‌తో సహా, కజకస్థాన్‌లోని బైకోనూర్ కాస్మోడ్రోమ్ వద్ద ఒక హ్యాంగర్‌లో జాగ్రత్త చేసారు.

బురాన్ అంతరిక్ష నౌక చేసిన ఈ మొదటి యాత్ర తరువాత, నిధుల కొరత కారణం గాను, సోవియట్ యూనియన్‌లోని రాజకీయ పరిస్థితుల కారణం గానూ ఈ కార్యక్రమాన్ని ఆపేసారు. 1990, 1992 ల్లో జరపాలని తలపెట్టిన రెండు ప్రయోగాల్లో పాల్గొనాల్సిన రెండు నౌకల (అనధికారికంగా ప్టిచ్కా అని, 2.01 అనీ వీటికి పేర్లు) నిర్మాణమే జరగ లేదు. రష్యా అధ్యక్షుడు బోరిస్ యెల్ట్సిన్ ఈ కార్యక్రమాన్ని 1993 జూన్ 30 న అధికారికంగా మూసేసాడు. రద్దయ్యే నాటికి, బురాన్ కార్యక్రమపై 2000 కోట్ల రూబుళ్లు ఖర్చు చేశారు.[12]

2002 మే 12 న, నిర్వహణ వైఫల్యం కారణంగా బైకోనూర్ లో బురాన్‌ను ఉంచిన హ్యాంగరు పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది కార్మికులు మరణించారు. బురాన్ అంతరిక్ష నౌక, ఎనర్జియా మోడలు నాశనమయ్యాయి.[13]

2017 లో వచ్చిన ఒక కథనం ప్రకారం, రెండు బురాన్- తరగతి నౌకలు (ఒకటి భూమై పైన వినియోగించేందుకు, రెండవది అంతరిక్ష ప్రయాణానికి 90% సిద్ధంగా ఉంది), ఒక ఎనర్జియా-ఎమ్ రాకెట్ ప్రోటోటైప్ క్యారియర్‌తో సహా ఇప్పటికీ బేస్ వద్ద భద్రంగా ఉన్నాయి.[14]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 "Buran". NASA. 12 November 1997. Archived from the original on 4 August 2006. Retrieved 15 August 2006.
  2. "Eight feared dead in Baikonur hangar collapse". Spaceflight Now. 16 May 2002.
  3. 3.0 3.1 3.2 3.3 Zak, Anatoly (25 December 2018). "Buran reusable orbiter". Russian Space Web. Retrieved 28 June 2019.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. 4.0 4.1 4.2 Wade, Mark. "Buran". Encyclopedia Astronautics. Retrieved 28 June 2019.
  5. ""Reusable space system "Energia – Buran" (in russian)". Retrieved 12 April 2020.
  6. "ground preparation". Retrieved 12 April 2020.
  7. 7.0 7.1 "Экипажи "Бурана" Несбывшиеся планы". Buran.ru (in రష్యన్). Retrieved 5 August 2006.
  8. "S.P.Korolev Rocket and Space Corporation Energia held a ceremony..." Energia.ru. 14 November 2008. Archived from the original on 13 అక్టోబరు 2016. Retrieved 3 September 2016.
  9. Handwerk, Brian (12 April 2016). "The Forgotten Soviet Space Shuttle Could Fly Itself". National Geographic Society. Retrieved 12 April 2016.
  10. "The orbiters and the launch vehicle". Buran.su. Retrieved 28 June 2019.
  11. Wade, Mark. "Buran". Encyclopedia Astronautics. Retrieved 28 June 2019.
  12. Wade, Mark. "Yeltsin cancels Buran project". Encyclopedia Astronautica. Archived from the original on 30 జూన్ 2006. Retrieved 11 సెప్టెంబరు 2020.
  13. Whitehouse, David (13 May 2002). "Russia's space dreams abandoned". BBC News. Retrieved 14 November 2007.
  14. Prisco, Jacopo (21 December 2017). "Abandoned Soviet space shuttle left in Kazakh Steppe". CNN. Retrieved 21 December 2017.